Aliens గురించి బైబిల్ వచనాలు: Religious privileges of
Religious privileges of గురించి వచనాలు
“మీ మధ్య నివసించే విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలనుకుంటే అతని ఇంట్లోని మగవారందరు సున్నతి పొందాలి. అప్పుడు వారు దేశంలో పుట్టినవారిలా దానిలో పాల్గొనవచ్చు. సున్నతి పొందని మగవారు దీనిని తినకూడదు.
దీని గురించి స్వదేశీయులకు మీ మధ్య నివసిస్తున్న విదేశీయులకు ఒకే నియమం వర్తిస్తుంది.”
“ ‘మీ మధ్యలో ఉంటున్న విదేశీయులు కూడా యెహోవా పస్కాను నియమ నిబంధనలతో జరుపుకోవాలి. విదేశీయులకు స్వదేశీయులకు ఒకే నియమాలు ఉండాలి.’ ”
వచ్చే తరాలకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. విదేశీయులు లేదా మీ మధ్య నివసించే ఎవరైనా సరే, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి అర్పించాలనుకుంటే, మీలాగే వారు కూడా చేయాలి.
సమాజంలో ఉండే మీరైనా, విదేశీయులైనా ఒకే చట్టం పాటించాలి; ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది. యెహోవా దృష్టిలో మీరూ విదేశీయులు ఒక్కటే: