కంటెంట్‌కు వెళ్లండి

Afflictions and Adversities గురించి బైబిల్ వచనాలు

526 వచనాలు · 5 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆయన మీకు తన నిబంధనను ప్రకటించారు, అనగా మీరు పాటించాలని పది ఆజ్ఞలు మీకు ఆజ్ఞాపించి, వాటిని రెండు రాతి పలకలమీద వ్రాశారు.

  2. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు అనుసరించాల్సిన శాసనాలను చట్టాలను మీకు నేర్పించమని యెహోవా నాకు ఆదేశించారు.

  3. అయితే చాలా జాగ్రతగా ఉండండి! హోరేబులో యెహోవా అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడిన రోజున మీరు ఏ రూపాన్ని చూడలేదు.

  4. మీ కోసం ఎలాంటి విగ్రహాన్ని, ఎలాంటి రూపంలో ఉన్న దానినైన, స్త్రీ లేదా పురుషుని రూపంలో కాని,

  5. లేదా భూమి మీద ఉండే ఏ జంతువులా కాని, ఆకాశంలో ఎగిరే పక్షిలా కాని,

  6. లేదా నేల మీద ప్రాకే ఏ ప్రాణిలా కాని, నీటి క్రింద ఉండే ఏ చేపలా కాని విగ్రహం తయారుచేసుకోకండి.

  7. మీరు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆకాశ సైన్యాలైన సూర్యచంద్ర నక్షత్రాలను చూసిన వాటిచే ఆకర్షించబడి, మీ దేవుడైన యెహోవా ఆకాశం క్రింద సమస్త దేశాల కోసం పంచి ఇచ్చిన వాటికి నమస్కరించి వాటికి సేవచేయకుండ మీరు జాగ్రత్తపడండి.

  8. మీరైతే, యెహోవా మిమ్మల్ని పట్టుకుని నేడు మీరున్నట్లుగా ఆయన వారసత్వ ప్రజలుగా ఉండడానికి ఇనుప కొలిమిలో నుండి, ఈజిప్టు నుండి, మిమ్మల్ని బయటకు తీసుకువచ్చారు.

  9. మీ కారణంగా యెహోవా నా మీద కోప్పడి నేను ఈ యొర్దాను దాటకూడదని, మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న మంచి దేశంలో ప్రవేశించకూడదని ఆయన ప్రమాణము చేశారు.

  10. నేను ఈ దేశంలో చనిపోతాను; నేను యొర్దానును దాటను; కాని మీరు నది దాటి వెళ్లి ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు.

  11. మీ దేవుడైన యెహోవా మీతో చేసిన నిబంధనను మరచిపోకుండా జాగ్రత్తపడండి; మీ దేవుడైన యెహోవా నిషేధించిన వాటి యొక్క ఎలాంటి రూపంలోను మీ కోసం విగ్రహాన్ని చేసుకోకండి.

  12. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దహించు అగ్ని, ఆయన రోషం గల దేవుడు.

  13. మీకు పిల్లలు మనవళ్లు కలిగి, ఆ దేశంలో చాలా కాలం నివసించిన తర్వాత, మీరు అప్పుడు చెడిపోయి ఏ రూపంలోనైనా విగ్రహాన్ని చేసుకుని మీ దేవుడైన యెహోవా కళ్ళెదుట చెడు చేసి ఆయనకు కోపం పుట్టిస్తే,

  14. మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోయే ఆ దేశంలో ఎక్కువకాలం నివసించకుండా వెంటనే నశిస్తారని ఈ రోజు ఆకాశాలను భూమిని మీమీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశంలో ఎక్కువకాలం నివసించరు ఖచ్చితంగా నశించిపోతారు.

  15. యెహోవా జనాంగాల మధ్యలో మిమ్మల్ని చెదరగొడతారు, యెహోవా మిమ్మల్ని తోలివేసే దేశాల మధ్యలో మీలో కొద్దిమంది మాత్రమే మిగులుతారు.

  16. అక్కడ మీరు మనుష్యులు తయారుచేసిన కర్ర, రాతి దేవుళ్ళను సేవిస్తారు. అవి చూడలేవు, వినలేవు, తినలేవు, వాసన చూడలేవు.

  17. అయితే అక్కడినుండి మీరు మీ దేవుడైన యెహోవాను వెదికితే, మీ పూర్ణహృదయంతో మీ పూర్ణాత్మతో వెదికినప్పుడు ఆయన మీకు దొరుకుతారు.

  18. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు, ఈ సంగతులన్ని మీకు జరిగిన తర్వాత, అప్పుడు చివరి రోజుల్లో మీరు మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటారు.

  19. మీ దేవుడైన యెహోవా జాలిగల దేవుడు; కాబట్టి ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని నాశనం చేయడు, ఆయన మీ పూర్వికులతో ప్రమాణం ద్వార నిశ్చయం చేసిన నిబంధనను మరచిపోరు.

  20. అయితే, మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయత చూపక, నేను ఈ రోజు మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని, శాసనాలను జాగ్రత్తగా పాటించకపోతే, ఈ శాపాలన్నీ మీపైకి వచ్చి మిమ్మల్ని ముంచేస్తాయి.

  21. మీరు పట్టణంలో శపించబడతారు, పొలంలో శపించబడతారు.

  22. మీ గంప, పిండి పిసికే తొట్టి శపించబడతాయి.

  23. మీ గర్భఫలం శపించబడుతుంది, మీ భూమి పంటలు, మీ పశువుల దూడలు, మీ మందల గొర్రెపిల్లలు శపించబడతాయి.

  24. మీరు లోపలికి వచ్చినప్పుడు శపించబడతారు, బయటకు వెళ్లినప్పుడు శపించబడతారు.

  25. మీరు ఆయనను విడిచిపెట్టి చేసిన చెడు కారణంగా, అకస్మాత్తుగా నాశనమయ్యే వరకు, యెహోవా మీరు చేయి వేసిన ప్రతి దాని మీదికి శాపాలు, నిరాశను, నిరుత్సాహాన్ని పంపుతారు.