కంటెంట్‌కు వెళ్లండి

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. యెహోషువ 7:26సుమారు క్రీ.పూ. 1451

    ఆకాను మీద వారు ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు, అది ఇప్పటికీ ఉంది. అప్పుడు యెహోవా తీవ్రమైన కోపం చల్లారింది. కాబట్టి అప్పటినుండి ఆ స్థలాన్ని ఆకోరు లోయ అని పిలుస్తారు.

  2. యెహోషువ 8:1సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు యెహోవా యెహోషువతో, “భయపడకు; నిరుత్సాహపడకు. సైన్యమంతటిని నీతో తీసుకుని హాయి మీద దండెత్తు. నేను హాయి రాజును, అతని జనులను, పట్టణాన్ని, అతని దేశాన్ని నీ చేతులకు అప్పగించాను.

  3. యెహోషువ 8:2సుమారు క్రీ.పూ. 1451

    యెరికోకు దాని రాజుకు నీవు చేసిన విధంగా హాయికి దాని రాజుకు చేస్తావు, అయితే ఈసారి దానిలోని సొమ్మును, పశువులను మీ కోసం దోచుకోవచ్చు. పట్టణం వెనుక మాటు ఏర్పాటు చేయి” అని చెప్పారు.

  4. యెహోషువ 8:3సుమారు క్రీ.పూ. 1451

    కాబట్టి యెహోషువ, సైనికులందరూ హాయిని ముట్టడించడానికి బయలుదేరారు. ముప్పైవేలమంది గొప్ప పరాక్రమవంతులను యెహోషువ ఎన్నుకుని రాత్రివేళ వారిని పంపిస్తూ,

  5. యెహోషువ 8:4సుమారు క్రీ.పూ. 1451

    వారికి ఈ ఆజ్ఞలు ఇచ్చాడు: “శ్రద్ధగా వినండి. మీరు పట్టణం వెనుక మాటువేసి ఉండాలి. పట్టణానికి బాగా దూరంగా వెళ్లిపోకుండా మీరంతా సిద్ధంగా ఉండాలి.

  6. యెహోషువ 8:5సుమారు క్రీ.పూ. 1451

    నేను, నాతో ఉన్నవారంతా పట్టణం దగ్గరకు వస్తాం, వారు ఇంతకు ముందులా మా మీదికి వచ్చినప్పుడు మేము వారి నుండి పారిపోతాము.

  7. యెహోషువ 8:6సుమారు క్రీ.పూ. 1451

    ‘వారు ఇంతకుముందులాగే మన నుండి పారిపోతున్నారు’ అని వారనుకుంటారు కాబట్టి మేము వారిని పట్టణం నుండి బయటకు తీసుకువచ్చే వరకు వారు మమ్మల్ని వెంటాడుతారు. మేము వారి నుండి పారిపోయినప్పుడు,

  8. యెహోషువ 8:7సుమారు క్రీ.పూ. 1451

    మీరు మాటు నుండి బయటకు వచ్చి పట్టణాన్ని పట్టుకోండి. మీ దేవుడైన యెహోవా ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తారు.

  9. యెహోషువ 8:8సుమారు క్రీ.పూ. 1451

    మీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దానికి నిప్పు పెట్టండి. యెహోవా ఆజ్ఞాపించినట్లుగా చేసి దానికి నిప్పు పెట్టండి. నేను మీకు ఇచ్చే ఆదేశాలు ఇవే.”

  10. యెహోషువ 8:9సుమారు క్రీ.పూ. 1451

    యెహోషువ వారిని పంపించగా వారు వెళ్లి బేతేలుకు హాయికి మధ్య హాయి పడపటి వైపున మాటు వేశారు ఆ రాత్రి యెహోషువ ప్రజలమధ్య గడిపాడు.

  11. యెహోషువ 8:10సుమారు క్రీ.పూ. 1451

    యెహోషువ మరుసటి ఉదయాన్నే తన సైన్యాన్ని సిద్ధపరచి, అతడు ఇశ్రాయేలీయుల పెద్దలు కలిసి వారి ముందు హాయి మీదికి వెళ్లారు.

  12. యెహోషువ 8:11సుమారు క్రీ.పూ. 1451

    అతనితో ఉన్న బలగమంతా పట్టణానికి సమీపించి దాని ముందుకు చేరుకుంది. వారు హాయికి ఉత్తరాన, వారికి ఆ పట్టణానికి మధ్య లోయ ఉన్నచోట శిబిరం ఏర్పరచుకున్నారు.

  13. యెహోషువ 8:12సుమారు క్రీ.పూ. 1451

    యెహోషువ దాదాపు అయిదువేల మందిని తీసుకుని పట్టణానికి పడమటి వైపున బేతేలుకు, హాయికి మధ్య మాటు వేశాడు.

  14. యెహోషువ 8:13సుమారు క్రీ.పూ. 1451

    కాబట్టి సైనికులు పట్టణానికి ఉత్తరాన ప్రధాన శిబిరాన్ని, పట్టణానికి పడమర మాటు వేయడానికి తమ స్థానాలను ఏర్పరచుకున్నారు. ఆ రాత్రి యెహోషువ లోయలోకి వెళ్లాడు.

  15. యెహోషువ 8:14సుమారు క్రీ.పూ. 1451

    హాయి రాజు ఇది చూసినప్పుడు, అతడు, పట్టణపు ప్రజలందరూ ఉదయాన్నే త్వరగా లేచి అరాబాకు ఎదురుగా ఉన్న ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఇశ్రాయేలును యుద్ధంలో ఎదుర్కోడానికి బయలుదేరారు. అయితే పట్టణం వెనుక తనను పట్టుకోడానికి మాటువేసి ఉంటారని అతనికి తెలియలేదు.

  16. యెహోషువ 8:15సుమారు క్రీ.పూ. 1451

    యెహోషువ, ఇశ్రాయేలీయులందరు వారి ముందు నిలబడలేక అరణ్యానికి పారిపోయారు.

  17. యెహోషువ 8:16సుమారు క్రీ.పూ. 1451

    వారిని తరమడానికి హాయిలోని ప్రజలందరూ కలిసి యెహోషువను వెంటాడుతున్నామనే భ్రమలో పట్టణం నుండి దూరంగా వచ్చేశారు.

  18. యెహోషువ 8:17సుమారు క్రీ.పూ. 1451

    ఇశ్రాయేలును తరమడానికి వెళ్లకుండా ఉన్నవారు హాయిలో గాని బేతేలులో గాని ఒక్కరు కూడా లేదు. వారు పట్టణాన్ని మూయకుండా తెరిచే ఉంచి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లారు.

  19. యెహోషువ 8:18సుమారు క్రీ.పూ. 1451

    అప్పుడు యెహోవా యెహోషువతో, “నీ చేతిలో ఉన్న ఈటెను హాయి వైపు పట్టుకో, నీ చేతికి నేను పట్టణాన్ని అప్పగిస్తాను” అని చెప్పారు. కాబట్టి యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను పట్టణం వైపు చాపాడు.

  20. యెహోషువ 8:19సుమారు క్రీ.పూ. 1451

    యెహోషువ తన చేయి చాపిన వెంటనే మాటున ఉన్నవారు త్వరత్వరగా తమ స్థలాల నుండి బయటకు పరిగెత్తి వచ్చి పట్టణంలో జొరబడి దానిని స్వాధీనం చేసుకుని, వెంటనే దానికి నిప్పంటించారు.

  21. యెహోషువ 8:20సుమారు క్రీ.పూ. 1451

    హాయి మనుష్యులు వెనక్కి తిరిగి చూచేటప్పటికి ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంలోకి లేవడం చూశారు, అయితే వారు తప్పించుకోవడానికి ఏ వైపు నుండి కూడా అవకాశం లేదు; అరణ్యం వైపు పారిపోతున్న ఇశ్రాయేలీయులు ఇప్పుడు తమను వెంటాడుతున్న వారిమీదికి దాడికి దిగారు.

  22. యెహోషువ 8:21సుమారు క్రీ.పూ. 1451

    మాటున పొంచిన వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడం పట్టణం నుండి పొగ పైకి లేవడం యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలంతా చూసి, వారు వెనుకకు తిరిగి హాయి మనుష్యుల మీద దాడి చేశారు.

  23. యెహోషువ 8:22సుమారు క్రీ.పూ. 1451

    ఈ లోపు పట్టణం బయట మాటు వేసినవారు కూడా వారితో పోరాడటానికి బయలుదేరి వచ్చారు. కొంతమంది ఇటువైపు, మరికొంతమంది అటువైపు ఉండడంతో ఇశ్రాయేలీయుల మధ్యలో హాయి వారు చిక్కుకున్నారు. కాబట్టి వారిలో ఎవ్వరూ బ్రతికి బయటపడకుండ అందరిని హతమార్చారు.

  24. యెహోషువ 8:23సుమారు క్రీ.పూ. 1451

    కాని హాయి రాజును మాత్రం వారు ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరకు తీసుకువచ్చారు.

  25. యెహోషువ 8:24సుమారు క్రీ.పూ. 1451

    పొలాల్లో, అరణ్యంలో హాయి మనుష్యులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపటం పూర్తి చేసిన తర్వాత, వారిలో ఎవరూ మిగలకుండా ప్రతి ఒక్కరు ఖడ్గం పాలయ్యాక, ఇశ్రాయేలీయులంతా హాయికి తిరిగివచ్చి దానిలో ఉన్నవారందరిని చంపివేశారు.