కంటెంట్‌కు వెళ్లండి

Babylon

255 verses · 3 known names

ఇలా కూడా పిలుస్తారు: Babylon's, Sheshach

32.5300, 44.4200 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Babylon ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు పట్టుబడ్డాడు. అతన్ని హమాతు దేశంలోని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.

  2. అక్కడ బబులోను రాజు రిబ్లాలో సిద్కియా కుమారులను, అలాగే యూదా పెద్దలందరినీ అతని కళ్లముందే చంపేశాడు.

  3. అప్పుడు అతడు సిద్కియా రాజు కళ్లు ఊడదీసి, ఇత్తడి సంకెళ్ళతో బంధించి, అతన్ని బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు చనిపోయే వరకు అక్కడే చెరసాలలో ఉంచాడు.

  4. బబులోను రాజైన నెబుకద్నెజరు పరిపాలనలోని పందొమ్మిదవ సంవత్సరం, అయిదవ నెల, పదవ రోజున బబులోను రాజు సేవకుడును రాజ రక్షక దళాధిపతియునైన నెబూజరదాను యెరూషలేముకు వచ్చాడు.

  5. రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను నిరుపేదలైన కొందరిని పట్టణంలో మిగిలినవారిని, బబులోను రాజు పక్షం చేరిన వారిని, మిగిలిన నిపుణులైన చేతిపని వారిని బందీలుగా తీసుకెళ్లాడు.

  6. బబులోనీయులు యెహోవా మందిరం దగ్గర ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, ఇత్తడి గంగాళాన్ని పగలగొట్టి, ఆ ఇత్తడినంతటిని బబులోనుకు తీసుకెళ్లారు.

  7. రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను వారందరినీ పట్టుకుని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లాడు.

  8. హమాతు దేశంలోని రిబ్లాలో బబులోను రాజు వారిని చంపించాడు. కాబట్టి యూదా తన దేశానికి దూరంగా బందీగా వెళ్లిపోయింది.

  9. యూదా రాజైన యెహోయాకీను బందీగా ఉన్న ముప్పై ఏడవ సంవత్సరం, ఆవిల్-మెరోదకు బబులోనుకు రాజైన సంవత్సరంలో, పన్నెండవ నెల ఇరవై అయిదవ రోజున, అతడు యూదా రాజైన యెహోయాకీనును జైలు నుండి విడుదల చేశాడు.

  10. అతడు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న ఇతర రాజుల స్థాయి కంటే ఉన్నత స్థాయిని అతనికిచ్చాడు.

  11. అతడు బ్రతికి ఉన్నంత కాలం, అతడు చనిపోయే వరకు, బబులోను రాజు ప్రతిరోజు క్రమంగా యెహోయాకీనుకు బత్తెం ఇచ్చాడు.

  12. అతన్ని పట్టుకోడానికి వల వేయగా అతడు దానిలో చిక్కుకుంటాడు. నేను అతన్ని బబులోనీయుల దేశమైన బబులోనుకు తీసుకువస్తాను కానీ అతడు దానిని చూడకుండానే అక్కడే అతడు చనిపోతాడు.

  13. “తిరుగుబాటు చేసే ఈ ప్రజలతో ఇలా చెప్పు, ‘ఈ మాటల అర్థం మీకు తెలియదా?’ ఇదిగో, ‘బబులోను రాజు యెరూషలేముకు వెళ్లి దాని రాజును, అధిపతులను పట్టుకుని తనతో పాటు బబులోనుకు తీసుకువచ్చాడు.

  14. “ ‘ఏ రాజైతే అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడో, ఎవరి ప్రమాణాన్ని అతడు తృణీకరించాడో, ఎవరి ఒప్పందాన్ని అతడు ఉల్లంఘించాడో ఆ రాజు దేశమైన బబులోనులోనే, నా జీవం తోడు అతడు చనిపోతాడు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  15. నేను అతనికి వలవేసి నా ఉచ్చులో బిగించి బబులోనుకు తీసుకెళ్లి అతడు నా పట్ల నమ్మకద్రోహిగా ఉన్నాడు కాబట్టి అక్కడ అతనికి శిక్ష విధిస్తాను.

  16. దానికి గాలం తగిలించి బోనులో పెట్టి బబులోను రాజు దగ్గరకు దానిని తీసుకెళ్లారు. ఇశ్రాయేలీయుల పర్వతాలమీద దాని గర్జన ఎన్నటికీ వినబడకుండా వారు దానిని చెరసాలలో ఉంచారు.

  17. “మనుష్యకుమారుడా, బబులోను రాజు ఖడ్గం పట్టడానికి రెండు దారులను ఏర్పరచు, రెండూ ఒకే దేశం నుండి మొదలవుతాయి. ఒక సూచికను తయారుచేసి, పట్టణానికి వెళ్లే రహదారి ఆరంభంలో ఉంచు.

  18. దారులు విడిపోయే చోట రెండు మార్గాలు చీలే స్థలంలో శకునం తెలుసుకోవడానికి బబులోను రాజు ఆగుతాడు. అతడు బాణాలను అటూ ఇటూ ఆడిస్తూ విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు. అతడు కాలేయం శకునాన్ని పరీక్షించి చూస్తున్నాడు.

  19. “మనుష్యకుమారుడా, ఈ తేదీని నమోదు చేయి ఎందుకంటే బబులోను రాజు ఈ రోజే యెరూషలేమును ముట్టడించాడు.

  20. “ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఉత్తరం నుండి నేను రాజుల రాజు, బబులోను రాజైన నెబుకద్నెజరును గుర్రాలు రథాలు, గుర్రపురౌతులు గొప్ప సైన్యంతో తూరు మీదికి రప్పించబోతున్నాను.

  21. “మనుష్యకుమారుడా, తూరు పట్టణం మీద బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యంతో దండెత్తి చాలా బాధాకరమైన పని చేయించాడు. వారందరి తలలు బోడివయ్యాయి. అందరి భుజాలు కొట్టుకుపోయాయి. అయినా తూరు పట్టణం మీదికి అతడు తెచ్చిన నష్టాన్ని బట్టి అతనికి అతని సైన్యానికి ప్రతిఫలం కూడా దొరకలేదు.

  22. కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఈజిప్టు దేశాన్ని బబులోను రాజైన నెబుకద్నెజరుకు నేను అప్పగిస్తున్నాను. అతడు దాని ఆస్తిని తీసుకుని దాని సొమ్మును దోచుకొని కొల్లగొడతాడు. అదే అతని సైన్యానికి జీతం అవుతుంది.

  23. “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: “ ‘బబులోను రాజైన నెబుకద్నెజరుచేత నేను ఈజిప్టువారి అల్లరిమూకలను అంతం చేస్తాను.

  24. నేను బబులోను రాజు చేతులను బలపరచి నా ఖడ్గాన్ని అతని చేతికి అందిస్తాను. నేను ఫరో చేతులను విరగ్గొట్టినప్పుడు బబులోను రాజు ఎదుట చావు దెబ్బ తిన్నవానిలా అతడు మూల్గుతాడు.

  25. నేను బబులోను రాజు చేతులను బలపరుస్తాను, కాని ఫరో చేతులు చచ్చుబడిపోతాయి. ఈజిప్టు దేశం మీద ఆడించడానికి నేను నా ఖడ్గాన్ని బబులోను రాజు చేతికి ఇచ్చినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.