Skip to content

Shaphan

23 వచనాలు · 4 కుటుంబ సభ్యులు

Shaphan ను ప్రస్తావించే వచనాలు

  1. అతని పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో రాజైన యోషీయా మెషుల్లాము మనుమడును అజల్యా కుమారుడును, కార్యదర్శియునైన షాఫానును యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి పంపాడు. అతడు ఇలా చెప్పాడు:

  2. ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అని చెప్పి దానిని షాఫానుకు ఇచ్చాడు.

  3. తర్వాత కార్యదర్శియైన షాఫాను రాజు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: “మీ సేవకులు యెహోవా మందిరంలో ఉన్న డబ్బు జమచేసి, మందిరంలో పని చేస్తున్న వారికి, వారి పై అధికారుల చేతికి అప్పగించారు.”

  4. అప్పుడు కార్యదర్శియైన షాఫాను, “యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు” అని రాజుకు చెప్పి రాజు సముఖంలో దాని నుండి చదివాడు.

  5. తర్వాత రాజు యాజకుడైన హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకాయా కుమారుడైన అక్బోరుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:

  6. యాజకుడైన హిల్కీయా, అహీకాము, అక్బోరు, షాఫాను, అశాయా హుల్దా ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె వస్త్రశాల తనిఖీదారుడైన హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూము భార్య, యెరూషలేములో నూతన భాగంలో నివసించేది.

  7. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదాలో కొంతమందిని ఉండనిచ్చాడు. వారిమీద అతడు షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యాను అధికారిగా నియమించాడు.

  8. యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో దేశాన్ని, మందిరాన్ని పవిత్రం చేద్దామని తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణ అధిపతియైన మయశేయా, లేఖికుడును యోవాహాజు కుమారుడునైన యోవాహును పంపాడు.

  9. హిల్కీయా కార్యదర్శియైన షాఫానుతో, “యెహోవా మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు దొరికింది” అన్నాడు. అతడు దానిని షాఫానుకు ఇచ్చాడు.

  10. షాఫాను ఆ గ్రంథాన్ని రాజు దగ్గరకు తీసుకెళ్లి ఇలా చెప్పాడు: “మీ అధికారులకు మీరు అప్పచెప్పిన పనులన్నీ చేస్తున్నారు.

  11. అప్పుడు కార్యదర్శియైన షాఫాను, “యాజకుడైన హిల్కీయా ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చాడు” అని రాజుకు చెప్పాడు. షాఫాను దానిని రాజు సముఖంలో చదివాడు.

  12. తర్వాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకా కుమారుడైన అబ్దోనుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:

  13. ఇంకా, షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు అండగా నిలబడ్డాడు, కాబట్టి యిర్మీయాను చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.

  14. యూదా రాజైన సిద్కియా బబులోను రాజు నెబుకద్నెజరు దగ్గరకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాశా, హిల్కీయా కుమారుడైన గెమర్యాలతో అతడు ఈ ఉత్తరాన్ని పంపించాడు. అందులో ఇలా ఉంది:

  15. యెహోవా మందిరంలో కార్యదర్శియైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగా ఉన్న ప్రాంగణంలో యెహోవా మందిర క్రొత్త ద్వార ప్రవేశం దగ్గర ప్రజలందరికి వినిపించేలా బారూకు గ్రంథపుచుట్టలో నుండి యిర్మీయా చెప్పిన మాటలను చదివాడు.

  16. షాఫాను మనుమడును గెమర్యా కుమారుడునైన మీకాయా ఆ గ్రంథపుచుట్టలో నుండి చదవబడిన యెహోవా చెప్పిన మాటలన్నీ విని,

  17. అతడు రాజభవనంలోని లేఖికుని గదిలోకి వెళ్లాడు, అక్కడ అధికారులందరు అనగా లేఖికుడైన ఎలీషామా, షెమయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇంకా ఇతర అధికారులందరూ కూర్చుని ఉన్నారు.

  18. మనుష్యులను పంపి యిర్మీయాను కావలివారి ప్రాంగణం నుండి బయటకు తీసుకువచ్చారు. అతన్ని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లమని షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యాకు అప్పగించారు. కాబట్టి యిర్మీయా తన సొంత ప్రజల మధ్యనే ఉండిపోయాడు.

  19. అయితే, యిర్మీయా బయలుదేరక ముందు, నెబూజరదాను, “బబులోను రాజు యూదా పట్టణాలపై నియమించిన షాఫాను మనుమడు, అహీకాము కుమారుడైన గెదల్యా దగ్గరకు తిరిగివెళ్లి, అతనితో పాటు ప్రజలమధ్య నివసించు, లేదా ఎక్కడికి వెళ్లడం సరియైనది అని నీకు అనిపిస్తే అక్కడికి వెళ్లు” అని చెప్పాడు. తర్వాత దళాధిపతి అతనికి ఆహారపదార్థాలు బహుమానం ఇచ్చి అతన్ని పంపించాడు.

  20. అప్పుడు షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యా ప్రమాణం చేసి, వారికి వారి భద్రత గురించి నమ్మకం కలిగించడానికి, “బబులోనీయులకు సేవ చేయడానికి మీరు భయపడకండి; దేశంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి, మీకు అంతా మంచే జరుగుతుంది.

  21. బబులోను రాజు యూదాలో కొందరిని విడిచిపెట్టి షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడునైన గెదల్యాను వారి మీద అధిపతిగా నియమించాడని మోయాబు, అమ్మోను, ఎదోము ఇతర దేశాల్లో ఉన్న యూదులందరు విన్నప్పుడు,

  22. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, అతనితో ఉన్న పదిమంది మనుష్యులు లేచి, బబులోను రాజు ఆ దేశం మీద అధిపతిగా నియమించిన షాఫాను మనుమడు అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గంతో కొట్టి చంపారు.

  23. షాఫాను కుమారుడైన అహీకాము, అతని కుమారుడైన గెదల్యా దగ్గర రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను విడిచిపెట్టిన వారందరినీ అనగా పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను కూడా వారు తీసుకెళ్లారు. అలాగే వారు ప్రవక్తయైన యిర్మీయాను, నేరియా కుమారుడైన బారూకును తమ వెంట తీసుకెళ్లారు.