Skip to content

Achbor గురించి బైబిల్ వచనాలు

7 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. అక్బోరు కుమారుడైన బయల్-హనాను చనిపోయిన తర్వాత, హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణం పేరు పాయు, అతని భార్యపేరు మెహెతబేలు, ఈమె మే-జాహబ్ కుమార్తెయైన మత్రేదు కుమార్తె.

  2. యాజకుడైన హిల్కీయా, అహీకాము, అక్బోరు, షాఫాను, అశాయా హుల్దా ప్రవక్తి దగ్గరకు వెళ్లారు. ఆమె వస్త్రశాల తనిఖీదారుడైన హర్షషుకు పుట్టిన తిక్వా కుమారుడైన షల్లూము భార్య, యెరూషలేములో నూతన భాగంలో నివసించేది.

  3. షావూలు చనిపోయిన తర్వాత, అక్బోరు కుమారుడైన బయల్-హనాను అతని స్థానంలో రాజయ్యాడు.

  4. తర్వాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడైన అహీకాముకు, మీకా కుమారుడైన అబ్దోనుకు, కార్యదర్శియైన షాఫానుకు, రాజు సేవకుడైన అశాయాకు ఇలా ఆదేశాలు జారీ చేశాడు:

  5. అయితే రాజైన యెహోయాకీము, అక్బోరు కుమారుడైన ఎల్నాతానును మరికొందరు వ్యక్తులతో పాటు ఈజిప్టుకు పంపాడు.

  6. అతడు రాజభవనంలోని లేఖికుని గదిలోకి వెళ్లాడు, అక్కడ అధికారులందరు అనగా లేఖికుడైన ఎలీషామా, షెమయా కుమారుడైన దెలాయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా, ఇంకా ఇతర అధికారులందరూ కూర్చుని ఉన్నారు.

  7. ఆ గ్రంథపుచుట్టను కాల్చవద్దు అంటూ ఎల్నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును అభ్యర్థించారు, కాని రాజు వారి అభ్యర్థనను వినిపించుకోలేదు.