కంటెంట్‌కు వెళ్లండి

Pharaoh

138 వచనాలు

Pharaoh ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి రాజైన ఫరో బలం నుండి విడిపించి, వారిని బయటకు తీసుకువచ్చిన తమ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా వారు పాపం చేశారు. వారు ఇతర దేవుళ్ళను పూజిస్తూ,

  2. ఫరో, అతని సేవకులు, అతని దేశ ప్రజలందరు ఇశ్రాయేలీయుల పట్ల ఎంత అహంకారంతో ప్రవర్తించారో మీకు తెలుసు కాబట్టి మీరు వారి ఎదుట అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకక్రియలు చేశారు. ఈ రోజు వరకు మీ నామాన్ని ఘనపరిచేలా చేశారు.

  3. ఓ ఈజిప్టు, మీ మధ్యలో ఫరోకు, అతని సేవకులకు వ్యతిరేకంగా ఆయన ఆశ్చర్యకార్యాలను అద్భుతాలను పంపారు.

  4. ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  5. నా ప్రియురాలా, నీవు అద్భుతం నీవు ఫరో రథం యొక్క గుర్రాల్లా ఉన్నావు.

  6. ఫరో సైన్యం ఈజిప్టు నుండి బయలుదేరగా, యెరూషలేమును ముట్టడించిన బబులోనీయులు ఆ వార్త విని యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిపోయారు.

  7. “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘ఫరో గురించి నన్ను విచారించడానికి నిన్ను పంపిన యూదా రాజుతో చెప్పు. మీకు మద్ధతు ఇవ్వడానికి బయలుదేరిన సైన్యం తిరిగి తన దేశమైన ఈజిప్టుకు వెళ్తుంది.

  8. ఫరో సైన్యాన్ని బట్టి బబులోనీయుల సైన్యం యెరూషలేము నుండి వెనుకకు వెళ్లిన తర్వాత,

  9. “యూదులు చూస్తుండగానే, నీతో పాటు కొన్ని పెద్ద రాళ్లను తీసుకెళ్లి, తహ్పన్హేసులోని ఫరో రాజభవనం ద్వారం దగ్గర ఉన్న ఇటుక కాలిబాటలో మట్టిలో పాతిపెట్టు.

  10. నేను బబులోను రాజు చేతులను బలపరచి నా ఖడ్గాన్ని అతని చేతికి అందిస్తాను. నేను ఫరో చేతులను విరగ్గొట్టినప్పుడు బబులోను రాజు ఎదుట చావు దెబ్బ తిన్నవానిలా అతడు మూల్గుతాడు.

  11. అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది.

  12. అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో చూపించాలని, భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను నియమించాను.”

  13. విశ్వాసం ద్వారానే మోషే, పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకోడానికి నిరాకరించాడు.