కంటెంట్‌కు వెళ్లండి

Moses

774 వచనాలు · 7 కుటుంబ సభ్యులు

Moses ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇవి మోయాబు సమతల మైదానంలో, యెరికోకు ఎదురుగా యొర్దాను అవతలి వైపు ప్రాంతంలో యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు ఇచ్చారు.

  2. యొర్దానుకు తూర్పున ఉన్న అరణ్యంలో అనగా పారానుకు తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహబ్ అనే స్థలాలకు మధ్య సూఫుకు ఎదురుగా ఉన్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవి.

  3. నలభైయవ సంవత్సరం, పదకొండవ నెల మొదటి రోజున మోషే ఇశ్రాయేలీయులను ఉద్దేశించి యెహోవా ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటించాడు.

  4. యొర్దాను తూర్పున మోయాబు దేశంలో మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వివరించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు:

  5. తర్వాత మోషే యొర్దానుకు తూర్పు వైపు ఉన్న మూడు పట్టణాలను ప్రత్యేకంగా ఉంచాడు.

  6. మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇది.

  7. ఈ నిబంధనలు శాసనాలు చట్టాలు, ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి బయటకు వచ్చినప్పుడు యొర్దాను తూర్పున బేత్-పెయోరుకు ఎదురుగా ఉన్న లోయలో హెష్బోనులో పరిపాలించి, మోషే, ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిన అమోరీయుల రాజైన సీహోను దేశంలో వారికి ఇవ్వబడినవి.

  8. On this side Jordan, in the valley over against Bethpeor, in the land of Sihon king of the Amorites, who dwelt at Heshbon, whom Moses and the children of Israel smote, after they were come forth out of Egypt:

  9. మోషే ఇశ్రాయేలీయులందరిని పిలిపించి వారితో ఇలా చెప్పాడు: ఇశ్రాయేలూ, మీ వినికిడిలో నేను ప్రకటించే శాసనాలను, చట్టాలను వినండి. వాటిని నేర్చుకొని ఖచ్చితంగా పాటించండి.

  10. మోషే, ఇశ్రాయేలు పెద్దలు ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు: “ఈ రోజు మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నిటిని మీరు పాటించాలి.

  11. తర్వాత మోషే, లేవీయ యాజకులు ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా అన్నారు, “ఇశ్రాయేలూ, మౌనంగా ఉండి నేను చెప్పేది విను! ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రజలయ్యారు.

  12. ఆ రోజే మోషే ప్రజలకు ఆజ్ఞాపించాడు:

  13. యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికతో పాటు, మోయాబు దేశంలో వారితో మరో ఒడంబడిక చేయమని ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఒడంబడిక షరతులు.

  14. మోషే ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, వారితో ఇలా అన్నాడు: యెహోవా ఈజిప్టులో ఫరోకు అతని అధికారులందరికి, అతని దేశమంతటికి చేసింది మీ కళ్లు చూశాయి.

  15. మోషే బయటకు వెళ్లి ఇశ్రాయేలీయులతో ఈ మాటలు చెప్పాడు:

  16. తర్వాత మోషే యెహోషువను పిలిపించి, ఇశ్రాయేలీయులందరి సమక్షంలో అతనితో ఇలా అన్నాడు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వికులకు యెహోవా ప్రమాణం చేసిన దేశంలోకి నీవు ఈ ప్రజలతో పాటు వెళ్లి దానిని వారికి వారసత్వంగా ఇవ్వాలి.

  17. కాబట్టి మోషే ఈ ధర్మశాస్త్రాన్ని వ్రాసి, లేవీయులైన యాజకులకు అంటే యెహోవా నిబంధన మందసాన్ని మోసేవారికి, ఇశ్రాయేలీయుల పెద్దలందరికి ఇచ్చాడు.

  18. తర్వాత మోషే, “ప్రతి ఏడు సంవత్సరాల చివరిలో, అప్పులు రద్దు చేసే సంవత్సరంలో, గుడారాల పండుగ సమయంలో,

  19. ఆ తర్వాత యెహోవా మోషేతో, “నీవు చనిపోయే రోజు దగ్గరలో ఉంది. యెహోషువను పిలిచి, సమావేశ గుడారం దగ్గరకు రండి, అక్కడ నేను అతన్ని నియమిస్తాను” అని చెప్పారు. కాబట్టి మోషే, యెహోషువ వచ్చి సమావేశ గుడారం దగ్గర ఉన్నారు.

  20. యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు నీ పూర్వికులతో విశ్రాంతి తీసుకోబోతున్నావు, ఈ ప్రజలు త్వరలో తాము ప్రవేశించే దేశంలోని పరదేశి దేవతలకు వేశ్యగా మారతారు. వారు నన్ను విడిచిపెట్టి నేను వారితో చేసుకున్న నిబంధనను ఉల్లంఘిస్తారు.

  21. కాబట్టి మోషే ఆ రోజు ఈ పాటను వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పించాడు.

  22. మోషే ఈ ధర్మశాస్త్రం యొక్క మాటలన్నీ మొదటి నుండి చివరి వరకు ఒక గ్రంథంలో వ్రాయడం పూర్తి చేశాక,

  23. యెహోవా నిబంధన మందసాన్ని మోసే లేవీయులకు మోషే ఇలా ఆజ్ఞాపించాడు:

  24. ఇశ్రాయేలు సమాజమంతా వింటుండగా మోషే ఈ పాటలోని పదాలను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చదివాడు:

  25. మోషే నూను కుమారుడైన యెహోషువతో పాటు వచ్చి ప్రజలు వింటుండగా ఈ పాటలోని అన్ని మాటలను వినిపించాడు.