కంటెంట్‌కు వెళ్లండి

Moses

774 వచనాలు · 7 కుటుంబ సభ్యులు

Moses ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తర్వాత బెసలేలును ఒహోలీయాబును, యెహోవా సామర్థ్యం ఇచ్చిన వారిని, పని చేయడానికి ప్రేరేపించబడిన వారందరిని మోషే పిలిపించాడు.

  2. పరిశుద్ధాలయ నిర్మాణానికి ఇశ్రాయేలీయులు తెచ్చిన కానుకలన్నిటిని మోషే దగ్గర నుండి వారు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ప్రతి ఉదయం స్వేచ్ఛార్పణగా అతని దగ్గరకు కానుకలు తెస్తూనే ఉన్నారు.

  3. మోషేతో, “యెహోవా చేయమని ఆజ్ఞాపించిన పనికి కావలసిన దానికన్నా ఎక్కువగా ప్రజలు తెస్తున్నారు” అని చెప్పారు.

  4. అప్పుడు మోషే: “పరిశుద్ధాలయం కోసం ఏ పురుషుడు గాని స్త్రీ గాని ఇకమీదట ఏ అర్పణ తీసుకురాకూడదు” అని ఒక ఆజ్ఞ ఇవ్వగా వారు దాన్ని శిబిరమంతటికి తెలియజేశారు. అప్పుడు ప్రజలు కానుకలు తీసుకురావడం మానుకున్నారు.

  5. సమావేశ గుడారం అనగా సాక్షి గుడారానికి ఉపయోగించిన వస్తువుల వివరాలు ఇవే, యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో మోషే ఆజ్ఞ ప్రకారం లేవీయులు నమోదు చేశారు:

  6. యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడు హూరు మనుమడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడు;

  7. పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి నీలం ఊదా ఎరుపు రంగుల నూలు ఉపయోగించి వారు నేసిన వస్త్రాలను తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు పవిత్ర వస్త్రాలను కూడా తయారుచేశారు.

  8. నైపుణ్యంగా అల్లబడిన దాని నడికట్టు ఏఫోదుతో ఒకే ముక్కగా, బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.

  9. తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.

  10. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు, రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టారు.

  11. సేవ చేస్తున్నప్పుడు వేసుకోడానికి బంగారు గంటలు దానిమ్మపండ్లు ఒకదాని ప్రక్కన ఒకటిగా వస్త్రం అంచు చుట్టూ ఉంచారు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.

  12. పేనిన సన్నని నారతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలుతో బుటా పనిగా నడికట్టు తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.

  13. దాన్ని తలపాగాకు అతకడానికి దానిని నీలి దారంతో కట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవి చేశారు.

  14. సమావేశ గుడారపు పనంతా పూర్తి అయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేశారు.

  15. అప్పుడు వారు సమావేశ గుడారం మోషే దగ్గరకు తెచ్చారు: గుడారం దాని అలంకరణలు, దాని కొలుకులు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు, దిమ్మలు;

  16. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పని అంతా పూర్తి చేశారు.

  17. మోషే వారు చేసిన పనిని పరిశీలించి, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు దానిని చేశారని చూశాడు. కాబట్టి మోషే వారిని దీవించాడు.

  18. యెహోవా మోషేతో ఇలా అన్నారు:

  19. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం మోషే అన్నిటిని చేశాడు.

  20. మోషే మందిరాన్ని నిలబెడుతున్నప్పుడు, అతడు దాని దిమ్మలు సరియైన చోట పెట్టి, పలకలను నిలబెట్టి అడ్డకర్రలు దూర్చి దాని స్తంభాలు నిలబెట్టాడు.

  21. తర్వాత మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం సమావేశ గుడారం మీద గుడారాన్ని పరచి దానిపైన గుడారపు కప్పు వేశాడు.

  22. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే మందసాన్ని సమావేశ గుడారంలోకి తీసుకువచ్చి కప్పివుంచే తెర తగిలించి నిబంధన మందసాన్ని కప్పాడు.

  23. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దానిపైన రొట్టెను పెట్టాడు.

  24. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, యెహోవా ఎదుట దీపాలు వెలిగించాడు.

  25. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, పరిమళ వాసనగల ధూపాన్ని దాని మీద కాల్చాడు.