కంటెంట్‌కు వెళ్లండి

Israel

1,007 వచనాలు · 20 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jacob

Israel ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒక రోజు ఇశ్రాయేలు తల్లికి ఈజిప్టు తండ్రికి పుట్టిన కుమారుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్లాడు, అక్కడ శిబిరంలో అతనికి, ఒక ఇశ్రాయేలీయునికి మధ్య గొడవ జరిగింది.

  2. ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా తమ దేవున్ని శపిస్తే, తమ పాపశిక్షను భరించాలి;

  3. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడిన తర్వాత వారు దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేశారు.

  4. “ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోయే దేశంలో మీరు ప్రవేశించినప్పుడు, స్వయాన ఆ భూమి కూడా యెహోవాకు సబ్బాతు పాటించాలి.

  5. కాబట్టి లేవీయుల ఆస్తి విడిపించదగినది అంటే, వారి ఇల్లు ఏ పట్టణంలో అమ్మబడినా యాభైయవ వార్షికోత్సవంలో, తిరిగి ఇవ్వబడాలి, ఎందుకంటే లేవీయుల పట్టణాలలోని ఇల్లు ఇశ్రాయేలీయుల మధ్యలో వారి ఆస్తి.

  6. మీరు వారిని మీ పిల్లలకు వారసత్వపు ఆస్తిగా ఇవ్వవచ్చు, వారిని జీవితకాల బానిసలుగా చేయవచ్చు, కానీ మీరు మీ తోటి ఇశ్రాయేలీయులను కఠినంగా పాలించకూడదు.

  7. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా దాసులుగా ఉన్నారు, నేను ఈజిప్టు దేశం నుండి వారిని తీసుకువచ్చిన నా దాసులు. నేను మీ దేవుడనైన యెహోవాను.

  8. నేను యాకోబుతో నా నిబంధనను, ఇస్సాకుతో నా నిబంధనను, అబ్రాహాముతో నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను, దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను.

  9. మోషే ద్వారా తనకు, ఇశ్రాయేలీయులకు మధ్య సీనాయి పర్వతం దగ్గర యెహోవా ఏర్పాటుచేసిన శాసనాలు, చట్టాలు, నియమాలు ఇవి.

  10. “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో చెప్పు: ‘ఒకవేళ సమాన విలువను ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తిని యెహోవాకు అంకితం చేయడానికి ఎవరైనా ప్రత్యేక మ్రొక్కుబడి చేస్తే,

  11. ఇవి సీనాయి పర్వతం దగ్గర యెహోవా ఇశ్రాయేలీయుల కోసం మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.

  12. మొత్తం సమాజంలోని ఇశ్రాయేలీయుల వంశాలు కుటుంబాల ప్రకారం వారి జనాభా లెక్కలు నమోదు చేయి.

  13. ఇశ్రాయేలీయులందరిలో ఇరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సుండి ఇశ్రాయేలు సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.

  14. ఇశ్రాయేలీయులు తమ తమ గోత్ర విభజన ప్రకారం సొంత జెండాలతో తమ డేరాలు వేసుకోవాలి.

  15. అయితే నా కోపం ఇశ్రాయేలీయుల సమాజం మీదికి రాకుండా లేవీయులు సాక్షి గుడారం చుట్టూ డేరాలు వేసుకోవాలి. సాక్షి గుడారాన్ని కాపాడే బాధ్యత లేవీయులదే.”

  16. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలీయులు చేశారు.

  17. “ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.”

  18. వారి వారి కుటుంబాల పరంగా లెక్కించబడినవారు ఇశ్రాయేలీయులు వీరు. విభజనల ప్రకారం శిబిరాలలో ఉన్న పురుషులు 6,03,550.

  19. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులను ఇతర ఇశ్రాయేలీయులతో లెక్కించలేదు.

  20. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా ఇశ్రాయేలీయులు చేశారు; ఆ ప్రకారం వారు గుడారాలు వేసుకున్నారు, ఆ విధంగా వారి వారి వంశం, కుటుంబంతో ప్రయాణిస్తారు.

  21. ప్రత్యక్ష గుడారపు పని చేయడం ద్వారా ఇశ్రాయేలీయుల బాధ్యతలను నెరవేరుస్తూ, వారు సమావేశ గుడారపు సామాగ్రి అంతా చూసుకోవాలి.

  22. లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించు; వారు సంపూర్ణంగా అతని స్వాధీనం చేయబడిన ఇశ్రాయేలీయులు.

  23. మోషే, అహరోను, అతని కుమారులు సమావేశ గుడారానికి తూర్పున, అనగా సూర్యుడు ఉదయించే వైపున సమావేశ గుడారానికి ఎదురుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల పక్షంగా పరిశుద్ధాలయాన్ని కాపాడే బాధ్యత వీరిది. ఇతరులెవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే వారికి మరణశిక్ష.

  24. యెహోవా మోషేతో, “ఒక నెల లేదా ఆపై వయస్సున్న ఇశ్రాయేలీయుల తొలిసంతానమైన మగవారిని లెక్కించండి, వారి పేర్ల జాబితాను తయారుచేయండి.

  25. ఇశ్రాయేలీయుల్లోని తొలిసంతానానికి బదులు లేవీయులను, ఇశ్రాయేలీయుల పశువుల్లో తొలిసంతానానికి బదులు లేవీయుల పశువులను నా కోసం తీసుకోవాలి. నేను యెహోవానై యున్నాను.”