కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “తుఫానులతో కొట్టుకుపోతూ ఓదార్పు లేక బాధపడుతున్న పట్టణమా, వైడూర్యాలతో నేను నిన్ను తిరిగి కడతాను, నీలమణులతో నీ పునాదులను వేస్తాను.

  2. రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు, మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను.

  3. యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.

  4. ఎవరైనా నీ మీద దాడి చేస్తే, అది చేసింది నేను కాదు; నీ మీద దాడి చేసినవారు నీకు లొంగిపోతారు.

  5. “చూడు, నిప్పులు ఊది మండించి తన పనికి తగిన ఆయుధాన్ని తయారుచేసే కమ్మరిని సృజించింది నేనే. నాశనం చేయడానికి నాశనం చేసేవాన్ని సృష్టించింది నేనే.

  6. నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు, నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే, నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  7. ఆహారం కాని దాని కోసం మీరెందుకు డబ్బు ఖర్చుపెడతారు? తృప్తి కలిగించని వాటికోసం ఎందుకు కష్టార్జితాన్ని వెచ్చిస్తారు? వినండి, నా మాట వినండి, ఏది మంచిదో దానిని తినండి, అప్పుడు మీరు గొప్ప వాటిని ఆనందిస్తారు.

  8. శ్రద్ధగా విని నా దగ్గరకు రండి; మీరు వింటే బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదుకు వాగ్దానం చేసిన నా శాశ్వత ప్రేమను మీకు చూపిస్తాను.

  9. చూడండి, నేను అతన్ని జనాంగాలకు సాక్షిగా చేశాను, జనాంగాలకు రాజుగా అధిపతిగా అతన్ని నియమించాను.

  10. ఖచ్చితంగా నీకు తెలియని దేశాలను నీవు పిలుస్తావు. యెహోవా నిన్ను మహిమపరచడం చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీవెవరో తెలియని దేశాలు నీ దగ్గరకు పరుగెత్తుకొని వస్తాయి.

  11. యెహోవా మీకు దొరికే సమయంలో ఆయనను వెదకండి; ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకోండి.

  12. దుష్టులు తమ మార్గాలను అవినీతిపరులు తమ ఆలోచనలు విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగితే ఆయన వారిపై జాలి పడతారు. మన దేవుడు వారిని ఉచితంగా క్షమిస్తారు.

  13. “నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు” అని యెహోవా చెప్తున్నారు.

  14. “ఆకాశాలు భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గాల కన్నా నా మార్గాలు మీ ఆలోచనల కన్నా నా ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి.

  15. అలాగే నా నోటి నుండి వచ్చిన నా మాట ఉంటుంది: అది వట్టిగా నా దగ్గరకు తిరిగి రాకుండా నేను కోరుకున్న ప్రకారం చేసి నేను దానిని పంపిన ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది.

  16. ముండ్ల చెట్లకు బదులు సరళ వృక్షాలు పెరుగుతాయి, దురదగొండి చెట్లకు బదులు గొంజిచెట్లు ఎదుగుతాయి. ఇది యెహోవా కీర్తిగా నిత్యమైన గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.”

  17. యెహోవా చెప్పే మాట ఇదే: “నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది, నా నీతి త్వరలో వెల్లడవుతుంది, కాబట్టి న్యాయంగా ఉండండి సరియైనది చేయండి.

  18. యెహోవాను వెంబడించే ఏ విదేశీయుడైనా, “యెహోవా తన ప్రజల్లో నుండి నన్ను వెలివేస్తారు” అని అనకూడదు. ఏ నపుంసకుడైనా, “నేను కేవలం ఎండిన చెట్టును” అని అనకూడదు.

  19. ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే: “నేను నియమించిన సబ్బాతును పాటిస్తూ నాకిష్టమైన వాటిని కోరుకుంటూ నా నిబంధనకు నమ్మకంగా ఉండే నపుంసకులకు,

  20. నా మందిరంలో, నా గోడలలో, కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను. ఎప్పటికీ నిలిచివుండే నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను.

  21. యెహోవాకు కట్టుబడి ఉంటూ ఆయనకు సేవ చేస్తూ, యెహోవా నామాన్ని ప్రేమిస్తూ, ఆయన సేవకులుగా ఉంటూ సబ్బాతును అపవిత్రపరచకుండా పాటిస్తూ, నా నిబంధన నమ్మకంగా పాటిస్తున్న విదేశీయులందరిని

  22. నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను, నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి; నా మందిరం అన్ని దేశాలకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది.”

  23. ఇశ్రాయేలీయులలో బందీగా కొనిపోబడినవారిని సమకూర్చే ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నారు: “నేను సమకూర్చిన వారే కాకుండా వారితో పాటు ఇతరులను సమకూర్చుతాను.”

  24. వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను మనం తృప్తిగా మద్యం త్రాగుదాం! ఈ రోజులానే రేపు ఉంటుంది, ఇంకా మంచిగా ఉంటుంది” అంటారు.

  25. కనుమలలోని నున్నని రాళ్ల మధ్యలో ఉన్న విగ్రహాలు మీ భాగము; నిజంగా అవే మీకు భాగము. అవును వాటికి మీ పానార్పణలు పోశారు, భోజనార్పణలు చెల్లించారు. ఇదంతా చూసి నేను క్షమించాలా?