కంటెంట్‌కు వెళ్లండి

Balaam

59 వచనాలు · 1 కుటుంబ సభ్యుడు

Balaam ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అక్కడ బాలాకు ఎద్దులను గొర్రెలను బలి ఇచ్చాడు, బిలాముకు, అతనితో ఉన్న అధికారులకు కొంత ఇచ్చాడు.

  2. మర్నాడు ఉదయం బాలాకు బిలామును బామోత్ బయలుకు తీసుకెళ్లాడు, అక్కడినుండి ఇశ్రాయేలు శిబిరం యొక్క చివరలను చూడగలిగాడు.

  3. బిలాము బాలాకుతో అన్నాడు, “నాకు ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టాలి, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్లను నా కోసం సిద్ధం చేయాలి.”

  4. బాలాకు బిలాము చెప్పినట్లు చేశాడు, వారిద్దరు ఒక కోడెను, ఇద్దరు ఒక్కో బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించారు.

  5. అప్పుడు బిలాము బాలాకుతో, “నీవు నీ దహనబలి దగ్గర ఉండు. బహుశ యెహోవా నన్ను కలుసుకోడానికి రావొచ్చు. ఆయన నాకు ఏమి బయలుపరుస్తారో అది నీకు చెప్తాను” అని అన్నాడు. తర్వాత అతడు ఖాళీ కొండపైకి వెళ్లాడు.

  6. దేవుడు అతన్ని కలుసుకున్నారు, బిలాము, “నేను ఏడు బలిపీఠాలు సిద్ధపరచి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక కోడెను, ఒక పొట్టేలును అర్పించాను” అని అన్నాడు.

  7. యెహోవా బిలాము నోటిలో ఒక సందేశం పెట్టి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటలు చెప్పు” అని అన్నారు.

  8. బాలాకు బిలాముతో, “నీవు నాకు ఏమి చేశావు? నా శత్రువులను శపిస్తావని నిన్ను తీసుకువచ్చాను, కానీ నీవు వారిని ఆశీర్వదించడం తప్ప ఏమి చేయలేదు!”

  9. యెహోవా బిలామును కలుసుకొని, అతని నోటిలో మాట ఉంచి, “బాలాకు దగ్గరకు వెళ్లి ఈ మాటను చెప్పు” అని అన్నారు.

  10. బాలాకు బిలాముతో, “వారిని అసలు శపించకు వారిని దీవించకు!” అని అన్నాడు.

  11. బిలాము బాలాకుతో, “యెహోవా ఏది చెప్తే నేను అదే చేయాలని నేను చెప్పలేదా?” అని జవాబిచ్చాడు.

  12. అప్పుడు బాలాకు బిలాముతో, “అయితే నిన్ను మరో స్థలానికి తీసుకెళ్తాను. బహుశ అక్కడినుండి నీవు నా కోసం వారిని శపించడం దేవునికి ఇష్టం కావచ్చు” అని అన్నాడు.

  13. బాలాకు, బిలామును నిర్మానుష్య స్థలానికి ఎదురుగా ఉన్న పెయోరు కొండ శిఖరం పైకి తీసుకెళ్లాడు.

  14. బిలాము బాలాకుతో, “నా కోసం ఇక్కడ ఏడు బలిపీఠాలు కట్టించు, ఏడు కోడెలను, ఏడు పొట్టేళ్ళను సిద్ధం చేయించు” అని అన్నాడు.

  15. బాలాకు బిలాము చెప్పినట్టు చేశాడు, ప్రతి బలిపీఠం మీద కోడెను, పొట్టేలును అర్పించాడు.

  16. ఇశ్రాయేలును ఆశీర్వదించడం యెహోవాకు ఇష్టమని బిలాము గ్రహించినప్పుడు, అతడు ఇతర సమయాల్లో చేసినట్టు భవిష్యవాణి ఆశ్రయించలేదు, కానీ తన ముఖాన్ని అరణ్యం వైపు త్రిప్పాడు.

  17. ఇశ్రాయేలు వారు గోత్రాల ప్రకారం గుడారాలు వేసుకుని ఉండడం బిలాము చూసినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది,

  18. అతడు ఈ సందేశం ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,

  19. బిలాము మీద బాలాకుకు కోపం రగులుకుంది. చేతులు చరుస్తూ అతనితో, “నా శత్రువులను శపించమని నిన్ను పిలిపిస్తే, వారిని మూడుసార్లు దీవించావు.

  20. బిలాము బాలాకుతో, “నీవు పంపిన దూతలకు నేను చెప్పలేదా,

  21. అప్పుడు బిలాము ఈ సందేశాన్ని ఇచ్చాడు: “బెయోరు కుమారుడైన బిలాము యొక్క ప్రవచనం, స్పష్టంగా చూడగలిగే కన్ను గలవాని ప్రవచనం,

  22. తర్వాత బిలాము లేచి తన ఇంటికి వెళ్లాడు, బాలాకు తన దారిన వెళ్లాడు.

  23. చచ్చినవారిలో అయిదుగురు మిద్యాను రాజులైన ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ. వారు బెయోరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు.

  24. “వీరు బిలాము సలహా ప్రకారం పెయోరు సంఘటనలో ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉండడానికి పురికొల్పినవారు, వీరి మూలంగా యెహోవా ప్రజలు తెగులు ద్వారా మొత్తబడ్డారు.

  25. మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు వారు మిమ్మల్ని దారిలో రొట్టె గాని నీళ్లు గాని తీసుకుని కలవడానికి రాలేదు. వారు మిమ్మల్ని శపించడానికి అరాము నహరయీములోని పెతోరు నుండి బెయోరు కుమారుడు బిలామును తెచ్చుకున్నారు.