Skip to content
ద్వితీయోపదేశకాండము 2:24-37

ద్వితీయోపదేశకాండము 2:24-37

24
“మీరు లేచి బయలుదేరి అర్నోను వాగు దాటండి. చూడండి, అమోరీయుడైన హెష్బోను రాజైన సీహోనును అతని దేశాన్ని మీ చేతికి అప్పగించాను. దానిని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టి అతనితో యుద్ధం చేయండి.
25
ఈ రోజే నేను ఆకాశం క్రింద ఉన్న అన్ని దేశాలకు మీరంటే భయాన్ని, వణుకుని కలిగించడం మొదలుపెడతాను. వారు మీ గురించి సమాచారాన్ని విని వణుకుతారు; మీ కారణంగా వారు కలవరపడతారు.”
26
కెదేమోతు ఎడారి నుండి నేను హెష్బోను రాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి సమాధానాన్ని తెలియజేశాను,
27
“మీ దేశం మీదుగా మమ్మల్ని వెళ్లనివ్వండి. మేము కుడి ఎడమల వైపు తిరగము, రహదారి మీదనే వెళ్తాము.
28
మా దగ్గర నుండి వెండి తీసుకుని తినడానికి ఆహారం త్రాగడానికి నీళ్లు ఇవ్వండి. మమ్మల్ని కాలినడకన వెళ్లనివ్వండి.
29
శేయీరులో నివసించే ఏశావు సంతతివారు ఆరులో మోయాబీయులు మాకు చేసినట్టే మా దేవుడైన యెహోవా మాకు ఇస్తున్న దేశానికి వెళ్లడానికి కాలినడకన యొర్దాను దాటి వెళ్లనివ్వండి” అని తెలియజేశాను.
30
అయితే హెష్బోను రాజైన సీహోను మనం అతని దేశం గుండా వెళ్లడానికి అనుమతించలేదు. ఎందుకంటే ఇప్పుడు జరిగినట్లుగా అతన్ని మీ చేతికి అప్పగించడానికి మీ దేవుడైన యెహోవా అతని మనస్సు కఠినపరచి అతని హృదయాన్ని మొండిగా మార్చారు.
31
అప్పుడు యెహోవా నాతో అన్నారు, “చూడండి, నేను సీహోనును, అతని దేశాన్ని మీకు అప్పగించడం మొదలుపెట్టాను. అతని దేశాన్ని జయించి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టండి.”
32
సీహోను అతని సైన్యమంతా యాహాజులో మనతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు,
33
మన దేవుడైన యెహోవా అతన్ని మనకు అప్పగించారు కాబట్టి అతన్ని, అతని కుమారులను, అతని సైన్యమంతటిని మనం హతం చేశాము.
34
ఆ సమయంలో అతని పట్టణాలన్నిటిని, వాటిలో ఉన్న పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎవరు మిగులకుండా పూర్తిగా నాశనం చేశాము.
35
అయితే మన కోసం పశువులను, ఆ పట్టణాల సొమ్మును దోచుకున్నాము.
36
అర్నోను వాగు ఒడ్డున ఉన్న అరోయేరు నుండి, ఆ వాగు దగ్గర ఉన్న పట్టణం మొదలుపెట్టి గిలాదు వరకు మనలను మించి బలం కలిగిన పట్టణం ఒకటి కూడా లేదు. మన దేవుడైన యెహోవా వాటన్నిటిని మనకు అప్పగించారు.
37
అయితే మన దేవుడైన యెహోవా ఆజ్ఞ ప్రకారం అమ్మోనీయుల దేశాన్ని కాని యబ్బోకు వాగు లోయలోని ఏ ప్రాంతాన్ని కాని కొండల్లో ఉన్న పట్టణాలను కాని మీరు ఆక్రమించలేదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options