Skip to content

Wisdom గురించి బైబిల్ వచనాలు: Of Solomon

22 వచనాలు · 14 కోణాలు

Of Solomon గురించి వచనాలు

  1. నీవు అడిగింది నేను ఇస్తాను. నేను నీకు జ్ఞానం కలిగిన వివేచన హృదయాన్ని ఇస్తాను. నీలాంటి వారు నీకంటే ముందు ఎవరూ లేరు, నీ తర్వాత ఎవరూ ఉండరు.

  2. కొంతకాలం తర్వాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకు వచ్చి అతని ముందు నిలబడ్డారు.

  3. వారిలో ఒక స్త్రీ అన్నది, “నా ప్రభువా, దయచేసి వినండి. ఈ స్త్రీ, నేను ఒకే ఇంట్లో ఉంటాము. ఈమె నాతో ఉన్నప్పుడు నేను శిశువును కన్నాను.

  4. నాకు శిశువు పుట్టిన మూడవ రోజు ఈమెకు కూడ శిశువు పుట్టాడు. మేము ఒంటరిగా ఉన్నాము; మేము తప్ప ఇంట్లో మరొకరు లేరు.

  5. “రాత్రివేళ ఈమె తన కుమారుని మీదికి దొర్లింది, వాడు చనిపోయాడు.

  6. కాబట్టి మధ్యరాత్రి ఈమె లేచి, మీ దాసురాలైన నేను పడుకోని ఉన్నప్పుడు, నా ప్రక్కన ఉన్న నా కుమారుని తీసుకుని తన ప్రక్కన పెట్టుకొని, చనిపోయిన తన కుమారుని నా ప్రక్కన పెట్టింది.

  7. ప్రొద్దున నా కుమారునికి పాలు ఇవ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు! అయితే నేను ఉదయకాలపు వెలుగులో గమనించి చూస్తే, వాడు నేను జన్మనిచ్చిన వాడు కాదు.”

  8. ఇంకొక స్త్రీ అన్నది, “లేదు! బ్రతికి ఉన్నవాడు నా కుమారుడు; చనిపోయినవాడు నీ వాడు.” మొదటి స్త్రీ అన్నది, “లేదు! చనిపోయినవాడు నీ వాడు; బ్రతికి ఉన్నవాడు నావాడు.” ఇంకా రాజు ముందు వారు వాదించుకున్నారు.

  9. రాజు అన్నాడు, “ఈమె అంటుంది, ‘నా కుమారుడు బ్రతికి ఉన్నాడు, నీ కుమారుడు చనిపోయాడు’ ఆమె అంటుంది, ‘లేదు! నీ కుమారుడు చనిపోయాడు, నావాడు బ్రతికి ఉన్నాడు.’ ”

  10. అప్పుడు రాజు అన్నాడు, “నాకొక ఖడ్గం తీసుకురండి.” కాబట్టి వారు ఖడ్గం రాజు దగ్గరకు తెచ్చారు.

  11. అప్పుడు రాజు వారికి ఇలా ఆదేశించాడు: “బ్రతికి ఉన్న బిడ్డను రెండు ముక్కలు చేసి, ఈమెకు సగం ఆమెకు సగం ఇవ్వండి.”

  12. అందుకు బ్రతికి ఉన్న శిశువు యొక్క తల్లి తన కుమారుని పట్ల జాలితో కరిగిపోయి రాజుతో అన్నది, “దయచేసి, నా ప్రభువా, ఆమెకు బ్రతికి ఉన్న శిశువును ఇచ్చేయండి! అతన్ని చంపకండి!” అయితే ఇంకొక స్త్రీ అన్నది, “అతడు నీకు గాని, నాకు గాని దక్కకూడదు. అతన్ని రెండు ముక్కలు చేయండి!”

  13. అప్పుడు రాజు తన తీర్పు ఇచ్చాడు: “బ్రతికి ఉన్న శిశువును మొదటి స్త్రీకి ఇవ్వండి. అతన్ని చంపకండి; ఆమె అతని తల్లి.”

  14. రాజు ఇచ్చిన తీర్పు గురించి ఇశ్రాయేలీయులందరు విన్నప్పుడు, రాజును ఎంతో గౌరవించారు, ఎందుకంటే తీర్పు తీర్చడానికి దేవుని దగ్గరనుండి అతడు జ్ఞానం పొందుకున్నాడని వారు గ్రహించారు.

  15. దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని గొప్ప వివేచనను, సముద్రతీరంలోని కొలవలేని ఇసుకరేణువులంత ప్రసాదించారు.

  16. సొలొమోను జ్ఞానం తూర్పు దేశాల వారందరి జ్ఞానం కంటే, ఈజిప్టులోని జ్ఞానమంతటి కంటే గొప్పది.

  17. అతడు మనుష్యులందరి కంటే జ్ఞాని, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద కంటే జ్ఞాని. అతని కీర్తి చుట్టూ ఉన్న అన్ని దేశాలకు వ్యాపించింది.

  18. అతడు 3,000 సామెతలు పలికాడు, 1,005 కీర్తనలు వ్రాశాడు.

  19. అతడు లెబానోనులో ఉండే దేవదారు చెట్ల నుండి, గోడల నుండి మొలిచే హిస్సోపు మొక్కల వరకు చెట్ల గురించి వివరించాడు. అతడు జంతువులు, పక్షులు, ప్రాకే జంతువులు, చేపల గురించి కూడా వివరించాడు.

  20. అతని జ్ఞానం గురించి విన్న భూరాజులందరి ద్వారా అన్ని దేశాల నుండి రాయబారులు వచ్చి సొలొమోను జ్ఞాన వాక్కులను వినేవారు.

  21. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానాన్ని ప్రసాదించారు. హీరాము సొలొమోనులు సమాధానంతో ఒక ఒప్పందం చేసుకున్నారు.

  22. దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వినడానికి లోకంలోని ప్రజలందరూ సొలొమోనును చూడాలని కోరుకున్నారు.