కంటెంట్‌కు వెళ్లండి

Trespass Offering గురించి బైబిల్ వచనాలు

42 వచనాలు · 25 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆమె ఒకవేళ గొర్రెపిల్లను కొనలేకపోతే, ఆమె గువ్వల జతను లేదా రెండు చిన్న పావురాలను తీసుకురావాలి. వాటిలో ఒకటి దహనబలి కోసం మరొకటి పాపపరిహారబలి కోసము. ఈ విధంగా యాజకుడు ఆమెకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు, ఆమె శుద్ధి అవుతుంది.’ ”

  2. “ఎవరైనా అనారోగ్య వ్యక్తిని వారి ఆచారరీత్య శుద్ధీకరణ పాటిస్తున్న సమయంలో, యాజకుని దగ్గరకు తీసుకువచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు ఇవి:

  3. “అప్పుడు యాజకుడు మగ గొర్రెపిల్లలలో ఒకదాన్ని తీసుకుని, అపరాధపరిహారబలిగా, కొంచెం నూనెతో పాటు అర్పించాలి; అతడు వాటిని పైకెత్తి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాలి.

  4. అతడు పాపపరిహారబలిని, దహనబలిని వధించే పరిశుద్ధాలయ ప్రాంతంలో గొర్రెపిల్లను వధించాలి. పాపపరిహారబలిలా, అపరాధపరిహారబలి కూడా యాజకునికే చెందుతుంది; అది అతిపరిశుద్ధము.

  5. యాజకుడు అపరాధపరిహారబలి పశువు రక్తాన్ని కొంచెం తీసుకుని శుద్ధీకరణ కోసం వచ్చిన వ్యక్తి యొక్క కుడిచెవి కొన మీద, వారి కుడిచేతి బొటనవ్రేలుపై, వారి కుడికాలి బొటనవ్రేలుపై పూయాలి.

  6. “అయినప్పటికీ, ఒకవేళ వారు పేదవారైయుండి వీటిని చేసే స్తోమత లేనివారైతే, వారి ప్రాయశ్చిత్తం కోసం అపరాధపరిహారబలిగా ప్రత్యేకంగా అర్పించడానికి వారు ఒక మగ గొర్రెపిల్లను, దానితో పాటు భోజనార్పణ కోసం ఒక సేరు నూనెలో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని,

  7. రెండు పావురాలు లేదా రెండు చిన్న గువ్వలను, వారి స్థోమతను బట్టి ఒకటి పాపపరిహారబలి కోసం మరొకటి దహనబలి కోసం తీసుకురావాలి.

  8. ఎనిమిదవ రోజున అతడు రెండు పావురాలను లేదా రెండు చిన్న గువ్వలను తీసుకుని యెహోవా ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి.

  9. యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్రవిస్తున్న వ్యక్తికి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.

  10. “ ‘ఒక దాసికి మరొక పురుషునితో నిశ్చితార్థం జరిగి, ఆమె కోసం విమోచన క్రయధనం చెల్లించబడక, ఆమెకు విడుదల కలుగక ముందే ఎవడైనా ఆమెతో పడుకున్నట్లైతే సరియైన శిక్ష ఉండాలి. అయితే ఆమె స్వతంత్రురాలు కాదు, కాబట్టి వారు చంపబడాల్సిన అవసరం లేదు.

  11. అయినాసరే, ఆ పురుషుడు సమావేశ గుడార ద్వారం దగ్గరకు ఒక పొట్టేలును తెచ్చి యెహోవాకు అపరాధపరిహారబలి అర్పించాలి.

  12. యాజకుడు ఆ పొట్టేలును అపరాధపరిహారబలిగా సమర్పించి యెహోవా ఎదుట అతడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు; అతని పాపం క్షమించబడుతుంది.

  13. వారు ప్రత్యేకించుకున్న కాలాన్ని నియమించుకొని తిరిగి తమను తాము యెహోవాకు ప్రత్యేకించుకుని ఒక ఏడాది గొర్రెపిల్లను అపరాధపరిహారబలి కోసం తేవాలి. ప్రత్యేకించుకున్న కాలంలో అపవిత్రులయ్యారు కాబట్టి మునుపటి రోజులు లెక్కకు రావు.

  14. అయినా అతన్ని నలగ్గొట్టడం యెహోవాకు ఇష్టమైంది, యెహోవా అతని జీవితాన్ని పాపపరిహారబలిగా అర్పించినా, అతడు తన సంతానాన్ని చూస్తాడు, దీర్ఘకాలం జీవిస్తాడు, యెహోవా చిత్తం అతని హస్తంలో వృద్ధిచెందుతుంది.

  15. ద్వారపు మంటపానికి రెండు వైపులా రెండు బల్లలు ఉన్నాయి; వాటిపై దహనబలులు, పాపపరిహార బలులు, అపరాధబలులను వధిస్తారు.

  16. వారు భోజనార్పణలు, పాపపరిహార బలులు, అపరాధబలులు తింటారు. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించినవన్నీ వారివే అవుతాయి.

  17. అతడు నాతో ఇలా అన్నారు: “అపరాధ పరిహారార్థబలి, పాపపరిహారబలి వండి, భోజనార్పణ కాల్చడానికి, బయటి ఆవరణంలోనికి వాటిని తీసుకురాకుండా, ప్రజలను పవిత్రం చేయడానికి యాజకులు ఉండే స్థలం ఇది.”