Skip to content

Trespass Offering గురించి బైబిల్ వచనాలు: Atonement made by

7 వచనాలు · 25 కోణాలు

Atonement made by గురించి వచనాలు

  1. వారు చేసిన పాపానికి జరిమానాగా, వారు మంద నుండి ఆడ గొర్రెపిల్ల లేదా మేకను పాపపరిహారబలిగా యెహోవా దగ్గరకు తీసుకురావాలి; యాజకుడు వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి.

  2. యాజకుడు మరొకదాన్ని నిర్ణీత విధానంలో దహనబలిగా అర్పించి, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి, వారు క్షమించబడతారు.

  3. ఈ విధంగా యాజకుడు వారు చేసిన ఈ పాపాల్లో దేనికోసమైనా ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు. మిగిలిన అర్పణ, భోజనార్పణ మాదిరిగానే యాజకునికి చెందుతుంది.’ ”

  4. ఆ వ్యక్తి పవిత్ర పదార్థం విషయంలో తప్పిదం చేసినందుకు, అధనంగా దాని విలువలో అయిదవ వంతు నష్టపరిహారం చెల్లించి అదంతా యాజకునికి ఇవ్వాలి. యాజకుడు పొట్టేలును అపరాధపరిహారబలిగా వారికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.

  5. వారు మంద నుండి అపరాధపరిహారబలిగా, ఒక లోపం లేని, సరియైన విలువగల పొట్టేలును యాజకుని దగ్గరకు తీసుకురావాలి. ఈ విధంగా యాజకుడు వారు అనుకోకుండ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు.

  6. ఈ విధంగా యాజకుడు యెహోవా ఎదుట వారి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు అపరాధులవడానికి కారణమైన కృత్యాల నుండి వారు క్షమించబడతారు.”

  7. యాజకుడు ఆ పొట్టేలును అపరాధపరిహారబలిగా సమర్పించి యెహోవా ఎదుట అతడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు; అతని పాపం క్షమించబడుతుంది.