కంటెంట్‌కు వెళ్లండి

The Anger of God గురించి బైబిల్ వచనాలు: Specially reserved for the day of wrath

5 వచనాలు · 43 కోణాలు

"The Anger of God" కోసం వెతకండి

Specially reserved for the day of wrath గురించి వచనాలు

  1. యెహోవా మహాదినం సమీపంగా ఉంది, అది ఆసన్నమై త్వరగా రాబోతుంది. యెహోవా దినాన ఏడ్పు భయంకరంగా ఉంటుంది; ఆ దినాన బలాఢ్యులు ఘోరంగా ఏడుస్తారు.

  2. ఆ దినం ఉగ్రత దినం; బాధ, వేదన కలుగుతుంది. అది నాశనం, ధ్వంసం, చీకటి అంధకారం కమ్మే దినం, మబ్బులు, గాఢాంధకారం కమ్మే రోజు.

  3. ప్రాకార పట్టణాల దగ్గర ఎత్తైన గోపురాల దగ్గర యుద్ధఘోష, బాకానాదం వినబడే రోజు.

  4. “ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు. వారి రక్తం దుమ్ములా, వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది.

  5. యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.