The Anger of God గురించి బైబిల్ వచనాలు: Manifested in terrors
Manifested in terrors గురించి వచనాలు
యాకోబు దేవా! మీరు గద్దిస్తే గుర్రం రథం మరణ నిద్రలో పడి ఉంటాయి.
మీ ఒక్కరికే భయపడాలి. మీరు కోప్పడినప్పుడు మీ ఎదుట ఎవరు నిలవగలరు?
పరలోకం నుండి మీరు తీర్పు ప్రకటించారు, దేశం భయపడి మౌనం వహించింది.
“చూడండి, యెహోవా, ఆలోచించండి: మీరు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలా వ్యవహరించారా? స్త్రీలు తమ సంతానాన్ని తినాలా, తాము పెంచిన పిల్లలను తినాలా? యాజకుడు, ప్రవక్త ప్రభువు యొక్క పరిశుద్ధాలయంలో చంపబడాలా?
“చిన్నవారు, పెద్దవారు కలిసి వీధుల్లోని దుమ్ములో పడుకుంటారు; నా యువకులు, యువతులు ఖడ్గం చేత చంపబడ్డారు. మీరు కోప్పడిన దినాన మీరు వారిని చంపారు; మీరు జాలి లేకుండా వారిని వధించారు.
“మీరు ఒక పండుగ దినానికి పిలిచినట్లు, నాకు వ్యతిరేకంగా ప్రతి వైపు నుండి భయాందోళనలు పిలిచారు. యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు, బ్రతకలేదు; నేను అపురూపంగా పెంచుకొన్న వారిని నా శత్రువు నాశనం చేశాడు.”