Skip to content

Tents గురించి బైబిల్ వచనాలు

40 వచనాలు · 24 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. జిమ్రీ కుట్రపన్ని రాజును చంపేశాడని ఇశ్రాయేలీయులు విన్నప్పుడు సేనాధిపతియైన ఒమ్రీని ఇశ్రాయేలుకు రాజుగా చేశారు.

  2. కాబట్టి వారు తమ ప్రాణాలు దక్కించుకోవాలని తమ గుడారాలను, గుర్రాలను, గాడిదలను ఎక్కడివి అక్కడే శిబిరంలో వదిలిపెట్టి తెల్లవారక ముందే చీకట్లోనే పారిపోయారు.

  3. సౌలు పాలిస్తున్నప్పుడు వారు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. వారు గిలాదుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయీల నివాస స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.

  4. బందిపోటు దొంగల గుడారాలు ప్రశాంతంగా ఉంటాయి, దేవునికి కోపం పుట్టించే వారు సురక్షితంగా ఉంటారు, వారి దేవుడు వారి చేతిలోనే ఉన్నాడు.

  5. యెరూషలేము కుమార్తెలారా, నల్లనిదానను, అయినా నేను సౌందర్యవతిని, కేదారు డేరాలవంటిదానను, సొలొమోను గుడారపు తెరల్లా నేనూ నల్లనిదాన్ని.

  6. స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఒకవేళ నీకు తెలియకపోతే, మందల అడుగుజాడలను బట్టి వెళ్లు, కాపరుల డేరాల ప్రక్కన నీ మేక పిల్లలను మేపుకో.

  7. ఇకపై దానిలో ఎవరూ నివసించరు తరతరాలకు దానిలో ఎవరూ కాపురముండరు; అరబీయులు అక్కడ తమ డేరాలు వేసుకోరు, గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ విశ్రాంతి తీసుకోనివ్వరు.

  8. గొర్రెల కాపరి గుడారంలా నా ఇల్లు పడవేయబడి నా నుండి తీసివేయబడింది. నేతపనివాడు వస్త్రం చుట్టినట్లు నా జీవితాన్ని ముగిస్తున్నాను, ఆయన నన్ను మగ్గం నుండి వేరుచేశారు. ఒక్క రోజులోనే మీరు నాకు ముగింపు తెచ్చారు.

  9. ఆయన భూమండలంపై ఆసీనుడై కూర్చున్నారు. ఆయన ముందు ప్రజలు మిడతల్లా ఉన్నారు. తెరను విప్పినట్లు ఆయన ఆకాశాన్ని పరిచి గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలంగా ఏర్పరిచారు.

  10. “నీ గుడారపు స్థలాన్ని పెద్దగా చేయి. నీ గుడారపు తెరలను ఆటంకం లేకుండా ముందుకు పొడిగించు నీ త్రాళ్లను పొడవుగా చేయి. నీ మేకుల్ని లోతుగా దిగగొట్టు.

  11. నా గుడారం నాశనమైంది; దాని త్రాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నా నుండి వెళ్లిపోయారు, వారిక లేరు; నా గుడారం వేయడానికి నాకు బసను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు.

  12. అలాగే మీరు ఎప్పటికీ ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తవద్దు, ద్రాక్షతోటలు నాటవద్దు; వీటిలో మీకు ఏదీ ఉండకూడదు; ఎల్లప్పుడూ గుడారాల్లో నివసించాలి. అప్పుడు మీరు పరవాసులుగా ఉన్న దేశంలో దీర్ఘకాలం జీవిస్తారు’ అని మాకు ఆజ్ఞాపించాడు.

  13. మేము గుడారాల్లో నివసించాము, మా పూర్వికుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని పూర్తిగా పాటించాము.

  14. కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు: “నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,

  15. విశ్వాసం ద్వారానే దేవుడు తనకు వాగ్దానం చేసిన దేశంలో పరదేశిలా గుడారంలో నివసించాడు, అతనితో పాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా అలాగే చేశారు.