కంటెంట్‌కు వెళ్లండి

Sanitation గురించి బైబిల్ వచనాలు

289 వచనాలు · 10 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘మరొకని భార్యతో అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వారికి ఆ వ్యభిచారిణికి ఇద్దరికి మరణశిక్ష విధించాలి.

  2. “ ‘తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం ఉన్నవాడు తన తండ్రిని అగౌరపరిచాడు. ఆ స్త్రీ పురుషులిద్దరినీ చంపేయాలి; వారి మరణానికి వారే బాధ్యులు.

  3. “ ‘ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం కలిగియుంటే, వారిద్దరినీ చంపేయాలి; వారు వక్రబుద్ధికి పాల్పడ్డారు; వారి మరణానికి వారే బాధ్యులు.

  4. “ ‘ఒకడు స్త్రీతో ఉన్నట్టు మరో పురుషునితో లైంగిక సంబంధం కలిగివుంటే వారిద్దరు హేయమైనది చేశారు కాబట్టి వారికి మరణశిక్ష విధించాలి. వారి మరణానికి వారే బాధ్యులు.

  5. “ ‘ఒకడు స్త్రీని, ఆమె తల్లిని కూడా పెళ్ళి చేసుకోవడం దుర్మార్గము. అతడిని వారిద్దరు అగ్నిలో కాల్చివేయాలి. అప్పుడు మీ మధ్యలో దుర్మార్గం ఉండదు.

  6. “ ‘జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్న వానికి మరణశిక్ష విధించాలి, ఆ జంతువును చంపాలి.

  7. “ ‘ఒక స్త్రీ లైంగిక సంబంధం కోసం జంతువు దగ్గరకు వెళ్లితే, ఆ స్త్రీని ఆ జంతువు చంపాలి; వారి మరణానికి వారే బాధ్యులు.

  8. “ ‘ఒకడు తన సోదరిని అనగా తన తండ్రి కుమార్తెను గాని తల్లి కుమార్తెను గాని పెళ్ళి చేసుకుని వారికి లైంగిక సంబంధం ఉంటే, అది అపకీర్తి. వారిని బహిరంగంగా వారి ప్రజల ఎదుట శిక్షించాలి. అతడు తన సోదరిని అగౌరపరిచాడు కాబట్టి అతడే బాధ్యత వహించాలి.

  9. “ ‘ఒకడు నెలసరిలో ఉన్న స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అతడు ఆమె రక్తస్రావాన్ని బహిర్గతం చేశాడు, ఆమె కూడ దానిని బయటపెట్టింది. కాబట్టి వారిద్దరిని ప్రజల్లో నుండి తొలగించాలి.

  10. “ ‘మీ తల్లి సోదరితో గాని మీ తండ్రి సోదరితో గాని లైంగిక సంబంధం పెట్టుకోకండి, ఎందుకంటే అది రక్తసంబంధాన్ని అగౌరపరచడమే; వారి శిక్షకు వారే బాధ్యులు.

  11. “ ‘ఒకడు తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకుంటే, అతడు మామను అగౌరపరచినట్టు. వారి పాపశిక్షకు వారే బాధ్యులు; వారు సంతానం లేకుండా చస్తారు.

  12. “ ‘ఒకడు తన సోదరుని భార్యను పెళ్ళి చేసుకోవడం అపవిత్రమైన పని; అతడు తన సోదరున్ని అగౌరపరచినట్టే వారికి సంతానం కలుగదు.

  13. “ ‘అహరోను సంతతిలో ఎవరికైనా కుష్ఠువ్యాధి గాని, స్రావ రోగం గాని ఉంటే వారు పవిత్రమయ్యేవరకు పవిత్ర పదార్థాలను తినకూడదు. వారు శవాన్ని గాని అపవిత్రమైన దేనినైనా గాని తాకినా లేదా వీర్యం విసర్జనతో ఉన్న ఎవరినైన తాకినా, వారు అపవిత్రం అవుతారు,

  14. అపవిత్రమైన ప్రాకే పురుగును తాకినా, లేదా ఆచారరీత్య అపవిత్రంగా ఉన్న మనుష్యుని తాకినవారు అపవిత్రం అవుతారు.

  15. అలాంటి వాటిలో దేనినైన తాకితే, వారు సాయంత్రం వరకు అపవిత్రంగానే ఉంటారు. వారు నీటితో స్నానం చేసే వరకు పవిత్రమైన అర్పణల నుండి దేన్ని తినకూడదు.

  16. సూర్యుడు అస్తమించినప్పుడు వారు పవిత్రం అవుతారు, తర్వాత వారు పవిత్ర అర్పణలు తినవచ్చు, ఎందుకంటే అది వారి ఆహారము.

  17. వారు చచ్చినదానిని గాని అడవి జంతువులు చీల్చిన దానిని గాని తిని అపవిత్రం కాకూడదు. నేను యెహోవాను.

  18. “ఎవరికైనా అపవిత్రమైన కుష్ఠువ్యాధి ఉన్నా లేదా ఏదైనా స్రావము కలిగి ఉన్నా లేదా శవాన్ని ముట్టుకొని ఆచారరీత్య అపవిత్రమై ఉన్నా, అలాంటి వారిని శిబిరంలో నుండి పంపివేయాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు.

  19. పురుషులనైనా స్త్రీలనైనా పంపివేయాలి; నేను ప్రజలమధ్య నివసిస్తాను కాబట్టి వారు శిబిరాన్ని అపవిత్రం చేయకుండేలా వారిని పంపివేయాలి.”

  20. ఇశ్రాయేలీయులు అలాగే చేశారు; వారిని శిబిరం బయటకు పంపివేశారు. యెహోవా మోషేకు సూచించిన ప్రకారం వారు చేశారు.

  21. అయితే కొందరు మనుష్యులు మృతదేహాన్ని బట్టి ఆచారరీత్య అపవిత్రులైనందుకు ఆ రోజున పస్కాను జరుపుకోలేకపోయారు. కాబట్టి అదే రోజు వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి,

  22. “ఇశ్రాయేలీయులతో చెప్పు: ‘ఇప్పుడున్న మీలో ఎవరైనా లేదా రాబోయే తరాల వారైనా మృతదేహాన్ని బట్టి గాని దూర ప్రయాణాన్ని బట్టి గాని అపవిత్రులైతే, వారు యెహోవా పస్కాను జరుపుకోవచ్చు,

  23. “నీవు ప్రజలకు ఇలా చెప్పు: ‘రేపటి కోసం మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి, రేపు మీరు మాంసం తినబోతున్నారు. మీరు, “మాకు మాంసం మాత్రం ఉంటే బాగుండేది! ఈజిప్టులో మాకు బాగుండేది!” అని ఏడ్వడం యెహోవా విన్నారు కాబట్టి యెహోవా మీకు మాంసం ఇస్తారు, మీరు తింటారు.

  24. దానిని మీరు తినడం ఒక రోజు కాదు, రెండు రోజులు, అయిదు రోజులు, పది రోజులు, యిరవై రోజులు కాదు,

  25. ఒక నెలంతా మీ నాసికా రంధ్రాల నుండి బయటకు వచ్చి మీరు అసహ్యించుకునే వరకు తింటారు; ఎందుకంటే మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిరాకరించి, “మేము అసలు ఈజిప్టును ఎందుకు విడిచిపెట్టామో?” అంటూ ఆయన ఎదుట ఏడ్చారు.’ ”