Skip to content

Sanitation గురించి బైబిల్ వచనాలు: Contagion

150 వచనాలు · 10 కోణాలు

Contagion గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ ‘ఒకవేళ ఎవరైనా తాము అపరాధులని తెలుసుకుంటే పొరపాటున ఆచారరీత్య అపవిత్రమైన దానిని తాకితే (అపవిత్రమైన జంతువు కళేబరం, అది అడవిదైనా పెంపుడుదైనా, లేదా భూమి మీద ప్రాకే జీవియైనా కావచ్చు), వారు అపవిత్రులయ్యారు అని వారికి అవగాహన లేకపోతే, తర్వాత తాము గ్రహిస్తే,

  2. లేదా ఒకవేళ వారు పొరపాటున మనుష్యులను అపవిత్రం చేసే దేనినైనా తాకితే, దాని గురించి తెలుసుకున్నా తర్వాత వారు అపరాధులు అవుతారు,

  3. “ ‘మాంసానికి ఏదైనా ఆచారరీత్య అపవిత్ర పదార్థం తగిలితే అది తినకూడదు. అది కాల్చివేయాలి. ఇతర మాంసం అయితే ఆచార ప్రకారం శుభ్రంగా ఉన్నవారు తినవచ్చు.

  4. ఎవరైనా అపవిత్రమైన దాన్ని అది మానవ అపవిత్రత గాని అపవిత్రమైన జంతువునే గాని నేలపై ప్రాకే జీవులనే గాని తాకి, యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”

  5. “ ‘వీటి ద్వార మీరు అపవిత్రులవుతారు; వాటి కళేబరాలను ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  6. వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు.

  7. “ ‘చీలిన డెక్కలు లేని నెమరువేయని ప్రతి జంతువు మీకు అపవిత్రం; వాటిలో దేని కళేబరాన్నైనా ఎవరైనా తాకితే వారు అపవిత్రులవుతారు.

  8. నాలుగు కాళ్ల జంతువులన్నిటిలో తమ పంజాలతో నడిచేవన్నీ అపవిత్రమైనవి; వాటిలో దేని కళేబరాన్నైనా ఎవరైనా తాకితే వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  9. వీటి కళేబరాలలో దేనినైన ఎవరైనా మోస్తే, వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రంగా ఉంటారు. ఈ జంతువులు మీకు అపవిత్రమైనవి.

  10. భూమి మీద కదిలే వాటన్నిటిలో, ఇవి మీకు నిషేధమైనవి. అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరాన్ని తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  11. అవి చనిపోయిన తర్వాత వాటి కళేబరం దేని పైననైన పడితే, అది చెక్క గాని, వస్త్రం గాని, చర్మం గాని గోనెసంచి గాని దేనితో చేసినదైనా, దాని ఉపయోగం ఏదైనా దానిని నీటిలో పెట్టండి; అది సాయంత్రం వరకు అపవిత్రం, తర్వాత అది పవిత్రమవుతుంది.

  12. వాటిలో ఏదైనా మట్టికుండలో పడితే, దానిలో ఉన్నదంతా అపవిత్రమవుతుంది, మీరు తప్పనిసరిగా ఆ కుండను పగులగొట్టాలి.

  13. మీరు తినదగిన ఏ ఆహారమైనా అలాంటి కుండలోని నీరు తగిలితే అది అపవిత్రమవుతుంది, ఎటువంటి పానీయమైనా సరే అలాంటి కుండలో నుండి త్రాగితే అది అపవిత్రము.

  14. వాటి కళేబరాలలో కొంచెమైనా ఒకటి దేనిపైనైనా పడితే అది అపవిత్రమవుతుంది; అది పొయ్యి గాని లేదా వంటచేసే కుండ గాని తప్పకుండ పగులగొట్టబడాలి. అవి అపవిత్రమైనవి, మీరు వాటిని అపవిత్రమైనవిగా భావించాలి.

  15. ఏదేమైనా, ఒక ఊటలో గాని లేదా నీటి తొట్టిలో గాని పవిత్రంగా ఉంటుంది, కానీ వీటిలో ఏదైన ఒకటి ఈ కళేబరాన్ని తాకితే వారు అపవిత్రమవుతారు.

  16. ఒకవేళ నాటబడవలసిన విత్తనాలపై కళేబరం పడితే, అవి పవిత్రంగా ఉంటాయి.

  17. కానీ ఒకవేళ విత్తనాలకు నీరు పెట్టిన తర్వాత, వాటిపై పడితే, అది మీకు అపవిత్రమవుతాయి.

  18. “ ‘ఒకవేళ మీరు తినదగిన జంతువుల్లో ఏదైనా చనిపోతే, దాని కళేబరాన్ని తాకిన ఎవరైనా సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  19. దాని కళేబరంలో ఎవరైనా ఏదైనా తింటే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు. కళేబరాన్ని ఎవరైనా మోస్తే వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటారు.

  20. “మనుష్యులెవరికైనా వారి చర్మంపై వాపు లేదా దద్దుర్లు లేదా మెరిసే మచ్చ ఉన్నట్లయితే, అది అపవిత్రమైన కుష్ఠువ్యాధి కావచ్చు, వారు యాజకుడైన అహరోను దగ్గరకు లేదా యాజకుడుగా ఉన్న అతని కుమారులలో ఒకరి దగ్గరకు తీసుకురాబడాలి.

  21. యాజకుడు వారి చర్మం మీద ఉన్న పుండును పరీక్షించాలి. ఆ పుండులో వెంట్రుకలు తెల్లబారి ఆ పుండు చర్మంలో లోతుగా ఉంటే అది కుష్ఠువ్యాధి యొక్క లక్షణము. యాజకుడు ఆ వారిని పరీక్షించి వారు ఆచారరీత్య అపవిత్రులని ప్రకటించాలి.

  22. చర్మంలో మచ్చ మెరుస్తూ తెల్లగా ఉండి, చర్మం లోతుకంటే ఎక్కువ లేకపోతే అందులోని వెంట్రుకలు తెల్లగా మారకపోతే యాజకుడు వారిని ఏడు రోజులు వేరుగా ఉంచాలి.

  23. ఏడవ రోజు యాజకుడు వారిని పరీక్షించాలి. చర్మం పుండు అలాగే ఉండి వ్యాపించకుండ ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు వారిని వేరుగా ఉంచాలి.

  24. ఏడవ రోజు యాజకుడు వారిని మళ్ళీ పరీక్షించాలి, పుండు క్షీణించి, చర్మంలో వ్యాపించకపోతే, యాజకుడు వారిని శుభ్రంగా ప్రకటించాలి; ఇది దద్దుర్లు మాత్రమే. వారు బట్టలు ఉతుక్కోవాలి, వారు శుభ్రంగా అవుతారు.

  25. కాని వారు శుద్ధులని ప్రకటించబడడానికి యాజకునికి కనుపరచుకున్న తర్వాత దద్దుర్లు చర్మంలో వ్యాపిస్తే వారిని తిరిగి యాజకుని దగ్గరకు రావాలి.