Red Sea గురించి బైబిల్ వచనాలు: Israelites camp by
Israelites camp by గురించి వచనాలు
“ఇశ్రాయేలీయులను వెనుకకు తిరిగి పీ హహీరోతుకు సమీపంలో మిగ్దోలుకు సముద్రానికి మధ్యలో బయల్-సెఫోనుకు సరిగ్గా ఎదురుగా సముద్రతీరాన బసచేయమని వారితో చెప్పు.
ఈజిప్టువారు అంటే ఫరో యొక్క అన్ని గుర్రాలు, రథాలు, గుర్రపురౌతులు, దళాలు ఇశ్రాయేలీయులను వెంటాడి, వారిని దాటి బయల్-సెఫోను ఎదురుగా ఉన్న పీ హహీరోతుకు సమీపంలో సముద్రతీరాన బసచేసి వారిని పట్టుకోడానికి వచ్చారు.
అమాలేకీయులు, కనానీయులు ఆ లోయల్లో నివసిస్తున్నారు కాబట్టి, రేపు వెనుకకు తిరగండి, ఎడారి వైపు ఎర్ర సముద్రం మార్గం గుండా రండి” అని చెప్పారు.
ఎదోము చుట్టూ తిరిగి రావాలని వారు హోరు పర్వతం నుండి ఎర్ర సముద్రం మార్గాన ప్రయాణం చేశారు. అయితే ప్రజలు ఈ ప్రయాణంలో ఓపిక కోల్పోయారు;
ఎలీము నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర దిగారు.
ఎర్ర సముద్రం నుండి బయలుదేరి సీను ఎడారికి వచ్చారు.
మీరైతే వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణించండి” అని అన్నారు.
యెహోవా నాతో చెప్పిన ప్రకారం మనం వెనుకకు తిరిగి ఎర్ర సముద్ర మార్గంలో అరణ్యంలోనికి ప్రయాణమై వెళ్లి చాలా రోజులు శేయీరు కొండ ప్రాంతం చుట్టూ తిరిగాము.
అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు,
“మీరు ఈ కొండ ప్రాంతం చుట్టూ తిరిగింది చాలు; ఉత్తరం వైపు తిరగండి.