Rain గురించి బైబిల్ వచనాలు: Promised in due season to the obedient
Promised in due season to the obedient గురించి వచనాలు
వాన కాలంలో వాన పంపుతాను, భూమి తన పంటను, చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి.
అప్పుడు మీ దేశంలో సకాలంలో తొలకరి కడవరి వర్షాలు కురిపిస్తాను. అప్పుడు మీరు ధాన్యాన్ని క్రొత్త ద్రాక్షరసాన్ని, ఒలీవ నూనెను సమకూర్చుకోవచ్చు.
నేను వాటిని నా పర్వతం చుట్టుప్రక్కల ఉన్న స్థలాలను ఆశీర్వాదకరంగా చేస్తాను. రుతువుల ప్రకారం జల్లులు కురిపిస్తాను; ఆశీర్వాదకరమైన జల్లులు కురుస్తాయి.
చెట్లు తమ పండ్లను ఇస్తాయి, భూమి తన పంటను ఇస్తుంది; ప్రజలు తమ దేశంలో క్షేమంగా ఉంటారు. నేను వారి కాడిని విరగ్గొట్టి, వారిని బానిసలుగా చేసుకున్న వారి చేతుల్లో నుండి వారిని విడిపించినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.