కంటెంట్‌కు వెళ్లండి

Prisoners గురించి బైబిల్ వచనాలు

323 వచనాలు · 22 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యేసు తనను పట్టుకోవడానికి వచ్చిన ముఖ్య యాజకులతో, దేవాలయ కావలివారి అధికారులతో యూదా నాయకులతో, “నన్ను పట్టుకోవడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా?

  2. నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో కూర్చుని బోధించేటప్పుడు నాపై ఒక చేయి కూడ వేయలేదు. అయినా ఇప్పుడు ఇది మీ సమయం, చీకటి పరిపాలిస్తున్న సమయం” అన్నారు.

  3. వారు యేసును బంధించి, ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు పేతురు దూరం నుండి వారిని వెంబడించాడు.

  4. అక్కడ కొందరు ప్రాంగణం మధ్యలో మంటలు వేసి, కలిసి కూర్చున్నప్పుడు, పేతురు వారితో కూర్చున్నాడు.

  5. అప్పుడు ఆ మంట వెలుతురులో ఒక దాసియైన అమ్మాయి అతన్ని తేరి చూసి, “ఇతడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నది.

  6. పేతురు దానిని నిరాకరించి, “అమ్మాయి, అతడు ఎవరో నాకు తెలియదు” అన్నాడు.

  7. కొంతసేపు తర్వాత ఇంకొకడు అతన్ని చూసి, “నీవు కూడా వారిలో ఒకడివి” అన్నాడు. పేతురు, “నేను కాదు!” అన్నాడు.

  8. ఇంచుమించు ఒక గంట సమయం తర్వాత మరొకడు, “వీడు గలిలయుడే, నిజంగానే వీడు కూడా అతనితో ఉన్నవాడే” అన్నాడు.

  9. అందుకు పేతురు, “నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు” అని చెప్తుండగానే కోడి కూసింది.

  10. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశారు అప్పుడు పేతురు, “కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు” అని ప్రభువు తనతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని,

  11. బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.

  12. యేసును కావలివారు ఎగతాళి చేస్తూ, ఆయనను కొట్టారు.

  13. వారు ఆయన ముఖాన్ని కప్పి, “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు!” అన్నారు.

  14. ఆయనను దూషిస్తూ అనేక మాటలు అన్నారు.

  15. ఉదయం కాగానే ప్రజానాయకుల సభ, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు సమావేశమయ్యారు, యేసు వారి ముందు నడిపించబడ్డారు.

  16. “నీవు క్రీస్తువైతే, మాతో చెప్పు” అన్నారు. అందుకు యేసు, “నేను మీతో చెప్పినా, మీరు నమ్మరు.

  17. ఒకవేళ నేను మిమ్మల్ని అడిగినా, మీరు నాకు జవాబు చెప్పరు.

  18. కానీ ఇప్పటినుండి మనుష్యకుమారుడు శక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుంటాడు” అని వారితో చెప్పారు.

  19. అందుకు వారందరు, “నీవు దేవుని కుమారుడవా?” అని అడిగారు. అందుకు ఆయన, “అని మీరే అంటున్నారు” అని వారితో చెప్పారు.

  20. అందుకు వారు, “మనకు ఇంకా సాక్ష్యం ఏం అవసరం? స్వయంగా ఇతడే తన నోటితో పలకడం విన్నాం” అన్నారు.

  21. పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి.

  22. కాబట్టి యూదా తనతో సైనికుల గుంపును ముఖ్య యాజకులు పరిసయ్యులు పంపిన అధికారులను వెంటబెట్టుకొని, దివిటీలతో, దీపాలతో ఆయుధాలతో తోటకు వచ్చాడు.

  23. యేసు తనకు ఏమి జరుగబోతుందో తెలిసి కూడా బయటకు వెళ్లి వారితో, “మీకు ఎవరు కావాలి?” అని అడిగారు.

  24. “నజరేయుడైన యేసు” అని వారు జవాబిచ్చారు. “ఆయనను నేనే” అని యేసు వారితో చెప్పారు. యేసును అప్పగించిన యూదా కూడా వారితో నిలబడి ఉన్నాడు.

  25. యేసు వారితో, “ఆయనను నేనే” అని చెప్పినప్పుడు వారు వెనుకకు తూలి నేలపై పడిపోయారు.