Skip to content

Oath గురించి బైబిల్ వచనాలు

85 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే విశ్వసించిన మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాము. అయితే దేవుడు ఇలా అన్నారు, “ ‘కాబట్టి వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.” ఆయన తన కార్యాలన్ని లోకాన్ని సృష్టించినప్పుడే పూర్తి చేశారు.

  2. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినపుడు, ఆయన కంటే గొప్పవాడు మరియొకడు లేడు కాబట్టి ఆయన తన మీదనే ప్రమాణం చేసి,

  3. “నిశ్చయంగా నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను” అని చెప్పారు.

  4. ప్రజలు ప్రమాణం చేసినప్పుడు తమకంటే గొప్పవారి తోడని ప్రమాణం చేస్తారు, దాంతో వారి అన్ని వివాదాలు పరిష్కారమవుతాయి.

  5. తన వాగ్దానానికి వారసులైన వారికి తన మార్పులేని స్వభావంలోని ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికి దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ప్రమాణంతో దృఢపరిచారు.

  6. అయితే ఆయన ప్రమాణంతో యాజకుడు అయ్యేటప్పుడు దేవుడు ఆయనతో ఇలా అన్నారు: “ప్రభువు ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు: ‘నీవు నిరంతరం యాజకునిగా ఉంటావు.’ ”

  7. ధర్మశాస్త్రం బలహీనతతో ఉన్న మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమిస్తుంది; కాని ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన దేవుని ప్రమాణం నిత్యం పరిపూర్ణునిగా చేయబడిన దేవుని కుమారున్ని ప్రధాన యాజకునిగా నియమించింది.

  8. అన్నిటికి మించి, నా సహోదరీ సహోదరులారా, ఆకాశంతోడని గాని భూమితోడని గాని లేదా ఇంకా దేనిపైనైనా గాని ప్రమాణం చేయవద్దు. మీరు, అవునంటే “అవును” కాదంటే “కాదు” అని లేకపోతే మీరు శిక్షించబడతారు.

  9. అప్పుడు సముద్రం మీద, భూమి మీద నిలబడి ఉన్నట్లు నేను చూసిన ఆ దేవదూత తన కుడిచేతిని ఆకాశం వైపు ఎత్తాడు.

  10. ఆ తర్వాత అతడు ఎల్లకాలం జీవిస్తూ పరలోకాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని, భూమిని దానిలో ఉన్నవాటన్నిటిని, సముద్రాన్ని దానిలో ఉన్నవాటన్నిటిని సృజించినవాని తోడు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, “ఇక ఏ ఆలస్యం ఉండదు!