Skip to content

Industry గురించి బైబిల్ వచనాలు

46 వచనాలు · 23 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది, వర్తకులకు నడికట్లను అమ్ముతుంది.

  2. బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది; ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు.

  3. ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది.

  4. ఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది, పని చేయకుండ ఆమె భోజనం చేయదు.

  5. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు:

  6. “చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు, కాని వారందరినీ నీవు మించినదానవు.”

  7. అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం; యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది.

  8. చేసే పనిని బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది, ప్రజల ఎదుట ఆమె పనులు ఆమెను పొగడుతాయి.

  9. నా కళ్లు కోరినవాటిలో దేన్ని చూడకుండ నేను నిరాకరించలేదు; సంతోషాలను అనుభవించకుండా నా హృదయాన్ని ఆటంకపరచలేదు. నా పనులన్నిటిని బట్టి నా హృదయం సంతోషించింది. నా శ్రమంతటికి కలిగిన ఫలితం ఇదే.

  10. అయితే, నా చేతులు చేసిన పనులన్నిటిని వాటికోసం నేను పడిన శ్రమనంతటి పరిశీలిస్తే, అవన్నీ అర్థరహితమే అని, గాలికి ప్రయాసపడినట్లే అని తెలుసుకున్నాను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేదని నేను గ్రహించాను.

  11. ఇదంతా చూస్తూ ఉంటే సూర్యుని క్రింద జరుగుతున్న దాన్ని బట్టి నాకెంతో విచారం కలిగింది, కాబట్టి నేను నా జీవితాన్ని అసహ్యించుకున్నాను. అంతా అర్థరహితమే గాలికి ప్రయాసపడడమే.

  12. సూర్యుని క్రింద నేను కష్టపడి సాధించినవన్నీ నా తర్వాత వచ్చే వారికి చెందుతాయని తెలుసుకొని నేను వాటన్నిటిని అసహ్యించుకున్నాను.

  13. నా తర్వాత వచ్చేవాడు ఎలాంటివాడో ఎవరికి తెలుసు? అతడు జ్ఞాని కావచ్చు, మూర్ఖుడు కావచ్చు. ఎలాంటి వాడైనా సూర్యుని క్రింద నా శ్రమతో నైపుణ్యతతో సంపాదించినదంతా అతని స్వాధీనమౌతుంది. ఇది కూడా అర్థరహితమే.

  14. కాబట్టి సూర్యుని క్రింద నేను పడిన కష్టమంతటి గురించి నేను నిరాశ చెందాను.

  15. ఒకరు జ్ఞానంతో తెలివితో నైపుణ్యంతో శ్రమించి పని చేస్తారు, కాని తర్వాత వారు దానిని శ్రమించని మరొకరికి వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా అర్థరహితమే, గొప్ప దురదృష్టకరమే.

  16. సూర్యుని క్రింద మనుష్యులు కష్టపడి చేస్తున్న పనులకు వారి శ్రమకు పొందుతున్నది ఏంటి?

  17. ఆ ప్రేమ ద్వారా సమాధానకరమైన జీవితాన్ని గడపడమే మీ ధ్యేయంగా పెట్టుకొని, మేము మీకు చెప్పిన విధంగా ఇతరుల జోలికి పోకుండా మీ సొంత విషయాలనే చూసుకుంటూ మీ చేతులతో కష్టపడి పని చేయండని మిమ్మల్ని వేడుకొంటున్నాము.

  18. అప్పుడు మీ అనుదిన జీవితం బయటి వారి గౌరవాన్ని గెలుచుకుంటుంది, మీరు ఎవరిపైనా ఆధారపడేవారిగా ఉండరు.

  19. మేము మీతో ఉన్నప్పుడు, “పని చేయనివాడు ఆహారం తినడానికి పాత్రుడు కాడు” అనే నియమాన్ని కూడా మీకు ఇచ్చాము.

  20. మీలో కొందరు సోమరులుగా ఏ పని చేసుకోకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నారని మేము విన్నాము.

  21. అలాంటివారు స్థిరపడి, వారు తినే ఆహారాన్ని వారే సంపాదించుకోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము వారిని హెచ్చరిస్తున్నాము, వేడుకుంటున్నాము.