Industry గురించి బైబిల్ వచనాలు: General references
General references గురించి వచనాలు
సోమరి చేతులు దరిద్రత తెస్తాయి, కాని శ్రద్ధగా పని చేసేవారి చేతులు ధనాన్ని తెస్తాయి.
వేసవిలో పంటను కూర్చేవారు వివేకంగల పిల్లలు, అయితే కోతకాలంలో నిద్రించేవారు అవమానాన్ని తెచ్చే పిల్లలు.
నీ గొర్రెల మందల పరిస్థితి జాగ్రత్తగా తెలుసుకో, నీ మందల మీద జాగ్రత్తగా మనస్సు పెట్టు;
ఐశ్వర్యం శాశ్వతం కాదు, కిరీటం తరతరాల వరకు ఉండదు.
ఎండుగడ్డి తొలగించబడి, క్రొత్తది ఎదగడం కనిపిస్తున్నప్పుడు. కొండ మీది నుండి గడ్డిని పోగుచేసినప్పుడు.
నీ బట్టల కోసం గొర్రెపిల్లలు ఉన్నాయి ఒక చేను కొను డబ్బుకు మేకపోతులు సరిపోతాయి.
నీ ఆహారానికి, నీ ఇంటివారి ఆహారానికి నీ పనికత్తెల పోషణలు మేకపాలు సమృద్ధి అవుతాయి.
చీమలు బలంలేని ప్రాణులైనా, అవి ఎండాకాలంలో ఆహారం కూర్చుకుంటాయి.
చిన్న కుందేళ్ళు బలంలేని ప్రాణులైనా, అవి బండ సందుల్లో నివాసాలు ఏర్పరచుకుంటాయి.
మిడతలకు రాజు లేడు, అయినా అవి బారులు తీరి సాగిపోతాయి.
బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినా రాజుల ఇండ్లలో అది ఉంటుంది.
ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది.
ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, వర్తకుల ఓడల లాంటిది.
ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది; తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది; తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది.
ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది; తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది.
ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి.
ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది, రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.
ఆమె పంటను చేత పట్టుకుంటుంది, తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది.
పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.
మంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు, ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు.
ఆమె పరుపులను తయారుచేసుకుంటుంది, ఆమె బట్టలు సన్నని నారబట్టలు ఎరుపు వస్త్రాలు.
ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు, అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు.
ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది, వర్తకులకు నడికట్లను అమ్ముతుంది.
బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది; ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు.
ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది.