Skip to content

Holiness గురించి బైబిల్ వచనాలు

150 వచనాలు · 51 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే ఆత్మ వలన కలిగే ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం,

  2. మృదుత్వం, మనస్సును అదుపు చేసుకోవడం. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ నియమం లేదు.

  3. యేసు క్రీస్తుకు సంబంధించినవారు శరీరాన్ని దాని వాంఛలతో దురాశలతో సిలువ వేశారు.

  4. మనం ఆత్మ వలన జీవిస్తున్నాం కాబట్టి మనం ఆత్మతో పాటు నడుద్దాము.

  5. మీరు కూడా సత్య వాక్యాన్ని అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసం ఉంచినప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మచేత ముద్రించబడి ఉన్నారు.

  6. దేవుని మహిమను స్తుతించడానికి ఆయన స్వాస్థ్యమైన వారికి విడుదల కలిగే వరకు ఈ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.

  7. ఆ కట్టడమంతా ఆయనలో ఒకటిగా అమర్చబడి ప్రభువులో పరిశుద్ధాలయంగా వృద్ధిపొందుతూ ఉంది.

  8. ఈ విధంగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసస్థలంగా కట్టబడుతున్నారు.

  9. అయితే మీరు క్రీస్తు గురించి విన్నప్పుడు యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా ఆయనలో బోధించబడినప్పుడు మీరు నేర్చుకున్న జీవన విధానం ఇది కాదు.

  10. If so be that ye have heard him, and have been taught by him, as the truth is in Jesus:

  11. మీ పాత స్వభావాన్ని, మీకు బోధించబడిన ప్రకారం, మీ ఆలోచనా వైఖరి నూతనపరచబడటానికి,

  12. మీ మోసపూరిత కోరికలతో చెడిపోతున్న, మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి;

  13. నిజమైన నీతి, పరిశుద్ధత గల దేవుని పోలికగా ఉండడానికి సృజించబడిన క్రొత్త స్వభావాన్ని ధరించుకోవాలి.

  14. ఒకప్పుడు మీరు చీకటియై ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రభువులో మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు బిడ్డలుగా జీవించండి,

  15. ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది.

  16. కాబట్టి ప్రభువుకు ఇష్టమైనది ఏదో తెలుసుకోండి.

  17. నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.

  18. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను తాను అప్పగించుకున్నట్లుగా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి.

  19. క్రీస్తు ప్రేమ తన సంఘాన్ని వాక్యమనే నీళ్ల స్నానంతో శుద్ధి చేసి, పవిత్రపరచడానికి,

  20. దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కోసం తనను తాను సమర్పించుకున్నారు.

  21. That ye may approve things that are excellent; that ye may be sincere and without offence till the day of Christ;

  22. Being filled with the fruits of righteousness, which are by Jesus Christ, unto the glory and praise of God.

  23. కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి.

  24. వీటి కారణంగానే దేవుని ఉగ్రత వస్తుంది.

  25. ఒకప్పుడు మీరు వీటి ప్రకారం నడుచుకొని జీవించారు.