Skip to content

Blasphemy గురించి బైబిల్ వచనాలు

90 వచనాలు · 19 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు మందంగా ఉన్న బలమైన డాలుతో ధిక్కారంగా దేవుని మీదికి దండెత్తుతాడు.

  2. దేవుడు నన్ను భక్తిహీనులకు అప్పగించారు. దుర్మార్గుల చేతుల్లో నన్ను పడవేశారు.

  3. నేను నెమ్మది కలిగి ఉండేవాన్ని, కాని ఆయన నన్ను ముక్కలుగా చేశారు; నా మెడ పట్టుకుని విదిలించి నన్ను నలిపేశారు. ఆయన నన్ను తన గురిగా పెట్టుకున్నారు;

  4. ఆయన బాణాలు నన్ను చుట్టుకున్నాయి జాలి లేకుండ ఆయన నా మూత్రపిండాల గుండా గుచ్చారు నా పైత్యరసాన్ని నేలపై పారబోశారు.

  5. పదే పదే ఆయన నన్ను విరుచుకుపడ్డారు; శూరునిలా పరుగున నా మీద పడ్డారు.

  6. దేవుడు నాకు అన్యాయం చేశారని నా చుట్టూ ఆయన తన వల వేశారని తెలుసుకోండి.

  7. “నాపై ‘దౌర్జన్యం జరుగుతుంది’ అని నేను మొరపెట్టినా నాకు జవాబు రాదు; సహాయం చేయమని అడిగినా నాకు న్యాయం జరుగదు.

  8. “జాలి పడండి, నా స్నేహితులారా, నాపై జాలి చూపండి ఎందుకంటే దేవుని హస్తం నన్ను మొత్తింది.

  9. దేవుడు వెంటాడినట్లు మీరు కూడా నన్నెందుకు వెంటాడుతున్నారు? నా శరీరం నాశనమైపోయింది, ఇది చాలదా?

  10. వారు తమ సంవత్సరాలు శ్రేయస్సులో గడుపుతారు సమాధానంతో సమాధికి వెళ్తారు.

  11. అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు.

  12. “దేవుడు ఎత్తైన ఆకాశాల్లో లేరా? పైనున్న నక్షత్రాలను చూడు అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయి!

  13. అయినా నీవు, ‘దేవునికేమి తెలుసు? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం చెప్పగలడా?

  14. ఆకాశమండలం పైన ఆయన తిరుగుచున్నాడు కాబట్టి మేఘాలు ఆయనను కప్పివేశాయి ఆయన చూడలేడు’ అని అంటున్నావు.

  15. అయినా దేవుడు నాలో తప్పును కనుగొన్నారు; నన్ను తన శత్రువుగా భావిస్తున్నారు.

  16. నా కాళ్లకు సంకెళ్ళు బిగించాడు. నా మార్గాలన్నిటిని దగ్గర నుండి గమనిస్తున్నాడు.’

  17. “యోబు, ‘నేను నిర్దోషిని, కాని దేవుడు నాకు న్యాయం చేయలేదు.

  18. నేను న్యాయంగా ఉన్నప్పటికీ నన్ను అబద్ధికునిగా చూస్తున్నారు; నా దోషం ఏమి లేనప్పటికి ఆయన బాణాలు నయంకాని గాయం నాకు కలిగింది’ అన్నాడు.

  19. “నీవు జ్ఞానం కలిగి ఉంటే, ఇది విను; నేను చెప్పేది ఆలకించు.

  20. న్యాయాన్ని ద్వేషించేవాడు పరిపాలించగలడా? బలాఢ్యుడైన న్యాయవంతుడైన దేవుని మీద నీవు నేరం మోపుతావా?

  21. ‘మీరు పనికిమాలినవారు’ అని రాజులతో, ‘మీరు దుష్టులు’ అని సంస్థానాధిపతులతో చెప్పేవాడు ఈయన కాడా,

  22. ఆయన అధికారులంటే పక్షపాతం లేదు ఆయన బీదలను కాదని ధనవంతులకు దయచూపించడు, అందరు ఆయన చేతుల్లో సృష్టించబడినవారే కదా.

  23. సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు ఆలకించండి, నా నిట్టూర్పు గురించి ఆలోచించండి.

  24. నా రాజా నా దేవా, సాయం కోసం నేను చేసే మొరను వినండి, మీకే నేను ప్రార్థిస్తున్నాను.

  25. వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు; వారు, “ఈ ఎడారిలో దేవుడు మనకు భోజనం సరఫరా చేయగలడా?