కంటెంట్‌కు వెళ్లండి

Blasphemy గురించి బైబిల్ వచనాలు

90 వచనాలు · 19 కోణాలు

"Blasphemy" కోసం వెతకండి

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఒక రోజు ఇశ్రాయేలు తల్లికి ఈజిప్టు తండ్రికి పుట్టిన కుమారుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వెళ్లాడు, అక్కడ శిబిరంలో అతనికి, ఒక ఇశ్రాయేలీయునికి మధ్య గొడవ జరిగింది.

  2. ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని దూషిస్తూ శపించాడు; కాబట్టి వారు అతన్ని మోషే దగ్గరకు తీసుకువచ్చారు. (అతని తల్లి పేరు షెలోమీతు, దాను గోత్రానికి చెందిన దిబ్రీ కుమార్తె.)

  3. యెహోవా చిత్తం వారికి తెలిసే వరకు వారు అతన్ని అదుపులో ఉంచారు.

  4. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  5. “ఆ దైవదూషకున్ని శిబిరం బయటకు తీసుకెళ్లు. అతని మాటలు విన్న వారంతా అతని తలపై చేతులుంచగానే సమాజమంతా రాళ్లతో అతన్ని కొట్టి చంపాలి.

  6. ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా తమ దేవున్ని శపిస్తే, తమ పాపశిక్షను భరించాలి;

  7. యెహోవా నామాన్ని ఎవరైనా దూషిస్తే, వారు మరణశిక్షకు గురి అవుతారు. సమాజమంత వారిని రాళ్లతో కొట్టి చంపాలి. విదేశీయులైనా, స్వదేశీయులైనా, యెహోవా నామాన్ని దూషిస్తే, వారికి మరణశిక్ష విధించాలి.

  8. నేను పిలిచినప్పుడు ఆయన సమాధానం ఇచ్చిన కూడా, ఆయన నా మాట వింటారని నేను నమ్మలేను.

  9. తుఫానుతో ఆయన నన్ను నలుగగొడతారు, ఏ కారణం లేకుండా నా గాయాలను ఎక్కువ చేస్తారు.

  10. ఆయన నన్ను ఊపిరి తీసుకోనివ్వరు కాని చేదైన వాటిని నాకు తినిపిస్తారు.

  11. దేవుని దండాన్ని నా మీద నుండి తీసివేయగలిగిన వారు ఉంటే బాగుండేది, అప్పుడు ఆయన భయం నన్ను ఇక బెదిరించదు.

  12. అప్పుడు నిర్భయంగా నేను ఆయనతో మాట్లాడగలను, కాని ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అలా చేయలేను.

  13. నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి.

  14. నన్ను హింసించడం, మీ చేతిపనిని త్రోసివేయడం, దుర్మార్గుల ప్రణాళికలను చూసి సంతోషించడం మీకు ఇష్టమా?

  15. మీ కళ్లు మనుష్యుల కళ్లలాంటివా? మనుష్యులు చూసేటట్లు మీరు చూస్తారా?

  16. మీ రోజులు మానవుల రోజుల వంటివా మీ సంవత్సరాలు బలమైన మనుష్యుల సంవత్సరాల వంటివా?

  17. నేను దోషిని కానని మీ చేతిలో నుండి నన్ను ఎవరూ విడిపించలేరని మీకు తెలిసినప్పటికీ నా అపరాధాలను మీరు వెదకుతున్నారు? నా పాపాలను మీరు పరిశోధిస్తున్నారు?

  18. Thou knowest that I am not wicked; and there is none that can deliver out of thine hand.

  19. దేవుని పక్షంగా మీరు దుర్మార్గంగా మాట్లాడగలరా? ఆయన కోసం వంచనగా మాట్లాడగలరా?

  20. ఆయన పట్ల పక్షపాతం చూపిస్తారా? దేవుని పక్షంగా మీరు వాదిస్తారా?

  21. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తే బాగుంటుందా? ఒక మనిషిని మోసం చేసినట్టు మీరు ఆయనను మోసం చేయగలరా?

  22. గాలికి ఎగిరే ఆకును మీరు వేధిస్తారా? ఎండిన చెత్తను మీరు తరుముతారా?

  23. మీరు నాకు కఠిన శిక్ష విధించారు యవ్వనకాలంలో చేసిన పాపాల ప్రతిఫలం అనుభవించేలా చేశారు.

  24. సంకెళ్ళతో నా కాళ్లు బిగించారు. నా అరికాళ్ల చుట్టూ గీత గీసి, నా ప్రవర్తనంతటిని జాగ్రత్తగా కనిపెడుతున్నారు.

  25. ఎందుకంటే, అతడు దేవునికి విరోధంగా చేయి చాపాడు సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల గర్వంగా ప్రవర్తించాడు.