కంటెంట్‌కు వెళ్లండి

Ancient Samaria గురించి బైబిల్ వచనాలు

87 వచనాలు · 29 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సమరయా, నీ దూడ విగ్రహాన్ని తీసివేయి! నా కోపం వాటి మీద రగులుకుంది ఎంతకాలం మీరు అపవిత్రులుగా ఉంటారు?

  2. ఆ విగ్రహాలు ఇశ్రాయేలువి! ఈ దూడను కంసాలి తయారుచేశాడు. అది దేవుడు కాదు, ఆ సమరయ దూడ ముక్కలుగా విరగ్గొట్టబడుతుంది.

  3. సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి, ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు ఖడ్గానికి కూలుతారు; వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు, వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.”

  4. అష్డోదు కోటలకు ఇలా చాటించండి, ఈజిప్టు కోటలకు ఇలా చాటించండి: “సమరయ పర్వతాలమీద కూడుకోండి; దానిలో జరుగుతున్న గొప్ప అల్లరిని, దాని ప్రజలమధ్య ఉన్న దౌర్జన్యాన్ని చూడండి.”

  5. “సరియైనది ఎలా చేయాలో వారికి తెలియదు,” అని యెహోవా చెప్తున్నారు, “వారు తమ కోటలలో తాము కొల్లగొట్టిన దోపుడుసొమ్మును దాచుకుంటారు.”

  6. కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “శత్రువు నీ ప్రాంతంలో చొరబడతాడు, మీ దుర్గాలను పడగొడతాడు, మీ కోటలను దోచుకుంటాడు.”

  7. యెహోవా చెప్పే మాట ఇదే: “గొర్రెల కాపరి సింహం నోటి నుండి విడిపించేటప్పుడు, దాని రెండు కాళ్లను గాని లేదా చెవి ముక్కను గాని విడిపించినట్లుగా, సమరయలో మంచాల మీద పట్టు దిండ్లమీద కూర్చుని ఉన్న, ఇశ్రాయేలీయులు రక్షించబడతారు.”

  8. సమరయ పర్వతం మీద తిరిగే బాషాను ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ, బీదలను అణగద్రొక్కుతూ “మాకు కొంచెం మద్యం తీసుకురండి!” అని భర్తలకు చెప్పే స్త్రీలారా, ఈ మాట వినండి.

  9. సీయోనులో సంతృప్తిగా ఉన్నవారికి శ్రమ, సమరయ పర్వతం మీద ఆధారపడి ఉన్న మీకు శ్రమ, ఇశ్రాయేలు ప్రజలకు సలహాదారులుగా ఉన్న, గొప్ప దేశాల్లో ప్రముఖులైన మీకు శ్రమ!

  10. సమరయ దోషానికి కారణమైనదాని తోడని, ‘దాను దేవుని తోడు’ అని, ‘బెయేర్షేబ దేవుని తోడు’ అని ప్రమాణం చేసేవారు మళ్ళీ లేవకుండా కూలిపోతారు.”

  11. “కాబట్టి నేను సమరయను రాళ్ల కుప్పగా చేస్తాను, అది ద్రాక్షతోటలు నాటే స్థలం అవుతుంది. దాని రాళ్లను లోయలో పారవేస్తాను, దాని పునాదులు బయట పడతాయి.

  12. దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరగ్గొట్టబడతాయి; దాని గుడి కానుకలన్ని అగ్నితో కాల్చబడతాయి; నేను దాని ప్రతిమలన్నిటినీ నాశనం చేస్తాను. అది వేశ్య సంపాదనతో తన బహుమానాలను పోగుచేసింది కాబట్టి అవి మళ్ళీ వేశ్య జీతంగా ఇవ్వబడతాయి.”