Ancient Samaria గురించి బైబిల్ వచనాలు: The residence of the kings of Israel
The residence of the kings of Israel గురించి వచనాలు
యూదా రాజైన ఆసా పరిపాలనలోని ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు, అతడు సమరయలో ఇశ్రాయేలు మీద ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు.
ఆ కాలంలో ఒక రోజు అహజ్యా రాజు సమరయలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు, “నేను ఈ గాయం నుండి కోలుకుంటానో లేదో మీరు వెళ్లి, ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయండి” అని దూతలకు చెప్పి పంపించాడు.
యూదా రాజైన యెహోషాపాతు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో అహాబు కుమారుడైన యోరాము సమరయలో ఇశ్రాయేలు మీద రాజయ్యాడు. అతడు పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు.
కాబట్టి ఆ సమయంలో రాజైన యెహోరాము సమరయ నుండి బయలుదేరి ఇశ్రాయేలంతటిని సమకూర్చాడు.