కంటెంట్‌కు వెళ్లండి

Afflictions Made Beneficial గురించి బైబిల్ వచనాలు: In leading us to seek God in prayer

8 వచనాలు · 23 కోణాలు

"Afflictions Made Beneficial" కోసం వెతకండి

In leading us to seek God in prayer గురించి వచనాలు

  1. అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి, అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించాడు, కాబట్టి వారు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నారు.

  2. “ఎఫ్రాయిం మూలుగులు నేను ఖచ్చితంగా విన్నాను: ‘శిక్షణ పొందని దూడలా ఉన్న నన్ను మీరు క్రమశిక్షణలో పెట్టారు, నేను క్రమశిక్షణ పొందాను. నన్ను బాగుచేయండి, నేను తిరిగి వస్తాను, ఎందుకంటే మీరే నా దేవుడైన యెహోవావు.

  3. యెహోవా తాను సంకల్పించింది చేశారు, చాలా కాలం క్రితం ఆయన శాసించిన, తన మాట ఆయన నెరవేర్చారు. ఆయన దయ లేకుండా నిన్ను పడగొట్టారు, శత్రువు నీ మీద సంతోషించేలా చేశారు, ఆయన నీ శత్రువుల కొమ్మును హెచ్చించారు.

  4. ప్రజల హృదయాలు యెహోవాకు మొరపెడుతున్నాయి. సీయోను కుమారి గోడలారా, మీ కన్నీటిని నదిలా పగలు రాత్రి ప్రవహించనివ్వండి; మీకు మీరే ఉపశమనం కలిగించుకోవద్దు, మీ కళ్లకు విశ్రాంతి ఇవ్వవద్దు.

  5. లేచి, రాత్రివేళ కేకలు వేయండి, రేయి మొదటి జామున కేకలు వేయండి. నీ హృదయాన్ని నీళ్లలా ప్రభువు సన్నిధిలో కుమ్మరించండి. ప్రతి వీధి చివరిలో ఆకలితో మూర్ఛపోయిన మీ పిల్లల ప్రాణాల కోసం ఆయన వైపు మీ చేతులు ఎత్తండి.

  6. ఎందుకంటే నేను ఎఫ్రాయిముకు సింహంలా యూదాకు కొదమసింహంలా ఉంటాను. నేను వారిని ముక్కలుగా చీల్చి వెళ్లిపోతాను; వారిని మోసుకెళ్తాను, వారిని కాపాడేవారెవరూ ఉండరు.

  7. వారు తమ అపరాధం ఒప్పుకుని నన్ను వెదికే వరకు నేను నా స్థలానికి తిరిగి వెళ్తాను, వారు తమ దురవస్థలో నన్ను తీవ్రంగా వెదకుతారు.”

  8. చేప కడుపులో నుండి యోనా తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు.