Afflictions Made Beneficial గురించి బైబిల్ వచనాలు: In purifying us
In purifying us గురించి వచనాలు
విందు జరిగే వారి ఇళ్ళకు వెళ్లే కంటే ఏడ్చేవారి ఇళ్ళకు వెళ్లడం మంచిది. ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరికీ వస్తుంది; జీవించి ఉన్నవారు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించాలి.
నవ్వడం కంటే దుఃఖపడడం మేలు, ఎందుకంటే విచారంగా ఉన్న ముఖం గుండెకు మంచిది.
నీకు వ్యతిరేకంగా నా చేయి ఉంచుతాను; నీ లోహపు మలినాన్ని శుద్ధి చేసి నీ మలినాలను తొలగిస్తాను.
పూర్వం ఉన్నట్లు నీకు న్యాయాధిపతులను, తొలి రోజుల్లో ఉన్నట్లు నీకు పాలకులను నియమిస్తాను. అప్పుడు నీవు నీతిగల పట్టణమని, నమ్మకమైన పట్టణమని పిలువబడతావు.
చూడు, నేను నిన్ను శుద్ధి చేశాను, కాని వెండిని చేసినట్లు కాదు; బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
నీవు మోసం మధ్య జీవిస్తున్నావు; వారి మోసాన్ని బట్టి వారు నన్ను తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
కాబట్టి సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను వారిని శుద్ధి చేసి పరీక్షిస్తాను, నా ప్రజల పాపాన్ని బట్టి అంతకన్నా నేనేం చేయగలను?
ఈ మూడవ వంతు ప్రజలను నేను అగ్నిలో నుండి వెండిని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను బంగారాన్ని పరీక్షించినట్లు వారిని పరీక్షిస్తాను. వారు నా పేరట మొరపెడతారు, నేను వారికి జవాబిస్తాను. ‘వారు నా ప్రజలు’ అని నేనంటాను, ‘యెహోవా మా దేవుడు’ అని వారంటారు.”
అయితే ఆయన రాకడ దినం ఎవరు తట్టుకోగలరు? ఆయన కనబడేటప్పుడు ఎవరు నిలబడి ఉండగలరు? ఆయన కంసాలి నిప్పులాంటి వాడు, బట్టలను శుద్ధి చేసే చాకలివాని సబ్బు లాంటివాడు.
ఆయన వెండిని పరీక్షించి, పుటం పెట్టి శుద్ధి చేసే కంసాలిలా కూర్చుంటారు, వెండి బంగారాలను పుటం పెట్టే విధంగా ఆయన లేవీ వారిని శుద్ధి చేస్తారు. అప్పుడు వారు నీతి నిజాయితీ అనుసరించి యెహోవాకు నైవేద్యాలు అర్పిస్తారు.