Skip to content

Adultery గురించి బైబిల్ వచనాలు

242 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అయితే నీ భర్తతో పెళ్ళి చేసుకున్న తర్వాత నీవు త్రోవ తప్పి, నీ భర్త కాకుండా వేరొక వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా నిన్ను నీవు అపవిత్రపరచుకుని ఉంటే,”

  2. యాజకుడు ఆమె మీదికి, “యెహోవా నిన్ను నీ ప్రజలమధ్య ఒక శాపంగా చేసి, నీ గర్భం పోవునట్లు, నీ ఉదరం ఉబ్బిపోయేలా చేయును గాక.

  3. శాపం తెచ్చే ఈ నీరు నీ శరీరంలోనికి ప్రవేశించి నీ ఉదరం ఉబ్బిపోయేలా లేదా నీ గర్భం పోవునట్లు చేయును గాక” అని శాపం పలుకుతాడు. “ ‘అప్పుడు ఆ స్త్రీ, “ఆమేన్, అలాగే జరుగును గాక” అని అనాలి.

  4. “ ‘యాజకుడు ఈ శాపాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి దానిని చేదు నీటితో కడగాలి.

  5. శాపం తెచ్చే ఆ చేదు నీటిని ఆమెతో త్రాగించాలి, అప్పుడు శాపం తెచ్చే ఆ నీరు ఆమెలో చేదు పుట్టిస్తుంది.

  6. యాజకుడు ఆమె చేతి నుండి అసూయ కొరకైన భోజనార్పణను తీసుకుని, యెహోవా ఎదుట పైకెత్తి దానిని బలిపీఠం దగ్గరకు తీసుకురావాలి.

  7. యాజకుడు ఆ భోజనార్పణలో నుండి పిడికెడు తీసుకుని దాన్ని బలిపీఠం మీద జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి; తర్వాత అతడు ఆ స్త్రీతో ఆ నీరు త్రాగించాలి.

  8. ఆమె తనను తాను అపవిత్రపరచుకుని ఉంటే, తన భర్తకు నమ్మకద్రోహం చేసి ఉంటే, ఫలితం ఇలా ఉంటుంది: శాపం తెచ్చే ఆ నీళ్లను ఆమె త్రాగినప్పుడు, ఆ నీళ్లు ఆమెలో ప్రవేశించి, ఆమె కడుపు ఉబ్బుతుంది, ఆమె గర్భం పోతుంది ఆమె శాపంగా మారుతుంది.

  9. అయితే ఆమె తనను తాను అపవిత్రం చేసుకోకుండ పవిత్రంగా ఉంటే, తాను నిర్దోషిగా ఉండి పిల్లలను కనగలుగుతుంది.

  10. “ ‘ఇది అసూయకు సంబంధించిన నియమము. ఒక స్త్రీ తన భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు త్రోవ తప్పి తనను తాను అపవిత్రపరచుకుంటే,

  11. లేదా ఒక వ్యక్తి తన భార్య మీద అసూయ పడినప్పుడు వర్తించే న్యాయవిధి. యాజకుడు ఆమెను యెహోవా ఎదుట నిలబెట్టి ఈ నియమాన్ని ఆ స్త్రీకి అన్వయింపచేయాలి.

  12. మీరు వ్యభిచారం చేయకూడదు.

  13. ఒకవేళ ఒక వ్యక్తి భార్యను తీసుకుని, ఆమెతో పడుకున్న తర్వాత, ఆమెను ఇష్టపడక,

  14. ఆమెను దూషించి, ఆమె పేరు చెడ్డ చేసి, “నేను ఈ స్త్రీని పెళ్ళి చేసుకున్నాను, కానీ నేను ఆమె దగ్గరకు వెళ్లినప్పుడు, ఆమె కన్యత్వానికి రుజువు దొరకలేదు” అని చెప్తే,

  15. అప్పుడు ఆ యువతి తల్లిదండ్రులు ఆమె కన్య అనే రుజువును పట్టణ పెద్దల దగ్గరకు తీసుకురావాలి.

  16. ఆమె తండ్రి పెద్దలతో, “నేను నా కుమార్తెను ఈ వ్యక్తికిచ్చి పెళ్ళి చేశాను, కాని అతనికి ఆమెపై ఇష్టం లేదు.

  17. ఇప్పుడు అతడు ఆమెను దూషించి, ‘మీ కుమార్తె కన్యగా నాకు కనిపించలేదు’ అని అంటున్నాడు. కానీ, నా కుమార్తె కన్యత్వానికి ఇది రుజువు” అని ఆమె తల్లిదండ్రులు పట్టణ పెద్దల ముందు వస్త్రాన్ని ప్రదర్శించాలి,

  18. పట్టణ పెద్దలు ఆ వ్యక్తిని తీసుకెళ్లి అతన్ని శిక్షించాలి.

  19. వారు అతనికి వంద షెకెళ్ళ వెండి జరిమానా విధించి, ఆ యువతి తండ్రికి ఇవ్వాలి, ఎందుకంటే ఈ వ్యక్తి ఇశ్రాయేలు కన్యకు చెడ్డ పేరు పెట్టాడు. ఆమె అతని భార్యగా ఉంటుంది; అతడు బ్రతికున్నంత కాలం అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు.

  20. ఒకవేళ, ఆరోపణ నిజమైతే ఆ యువతి కన్యత్వానికి రుజువు దొరకనట్లైతే,

  21. ఆమెను తన తండ్రి ఇంటి తలుపు దగ్గరకు తీసుకురావాలి; అక్కడ ఆ పట్టణ పురుషులు ఆమెను రాళ్లతో కొట్టి చంపుతారు. ఆమె తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు వేశ్యావృత్తి చేయడం ద్వారా ఆమె ఇశ్రాయేలులో తప్పుడు పని చేసింది. మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.

  22. ఒక వ్యక్తి మరొకరి భార్యతో పడుకున్నట్లు కనిపించినట్లయితే, ఆమెతో పడుకున్న వ్యక్తి, ఆ స్త్రీ ఇద్దరూ మరణించాలి. మీరు ఇశ్రాయేలు నుండి చెడును ప్రక్షాళన చేయాలి.

  23. ఒకవేళ ఒక పురుషుడు ఒక పట్టణంలో పెళ్ళి నిశ్చయమైన ఒక కన్యను కలవడం జరిగి, అతడు ఆమెతో పడుకున్నట్లైతే,

  24. మీరు వారిద్దరిని ఆ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి, ఆ యువతి పట్టణంలో ఉండి కూడా సహాయం కోసం కేకలు వేయనందుకు తనను, మరొక వ్యక్తి భార్యను చెరిపినందుకు అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఆ విధంగా మీరు మీ మధ్య నుండి చెడును ప్రక్షాళన చేయాలి.

  25. అయితే దేశంలో ఒకడు అనుకోకుండ పెళ్ళి నిశ్చయమైన ఒక యువతిని కలిసినప్పుడు, వాడు ఆమెను పాడు చేస్తే, అది చేసిన వ్యక్తి మాత్రమే చావాలి.