- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 7:80సుమారు క్రీ.పూ. 1490
ధూపద్రవ్యంతో నిండిన పది షెకెళ్ళ బరువు ఉన్న బంగారు పళ్ళెం;
- సంఖ్యాకాండము 7:81సుమారు క్రీ.పూ. 1490
దహనబలి కోసం ఒక కోడె, ఒక పొట్టేలు, ఏడాది మగ గొర్రెపిల్ల;
- సంఖ్యాకాండము 7:82సుమారు క్రీ.పూ. 1490
పాపపరిహారబలి కోసం మేకపోతు;
- సంఖ్యాకాండము 7:83సుమారు క్రీ.పూ. 1490
సమాధానబలి కోసం రెండు ఎద్దులు, అయిదు పొట్టేళ్లు, అయిదు మేకపోతులు, అయిదు ఏడాది మగ గొర్రెపిల్లలు.
- సంఖ్యాకాండము 7:84సుమారు క్రీ.పూ. 1490
బలిపీఠం అభిషేకించబడినప్పుడు దాని ప్రతిష్ఠించడానికి ఇశ్రాయేలీయుల నాయకులు సమర్పించిన అర్పణలు ఇవి: పన్నెండు వెండి పళ్ళాలు, పన్నెండు వెండి పాత్రలు పన్నెండు బంగారు పాత్రలు.
- సంఖ్యాకాండము 7:85సుమారు క్రీ.పూ. 1490
వెండి పళ్ళెం ఒక్కొక్కటి నూట ముప్పై షెకెళ్ళు, వెండి పాత్ర ఒక్కొక్కటి డెబ్బై షెకెళ్ళు. అంతా కలిపితే వెండి పాత్రల బరువు పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం రెండువేల నాలుగు వందల షెకెళ్ళు.
- సంఖ్యాకాండము 7:86సుమారు క్రీ.పూ. 1490
ధూపద్రవ్యాలతో నిండియున్న బంగారు పళ్ళాలు, పరిశుద్ధాలయ షెకెల్ ప్రకారం పది షెకెళ్ళ బరువు గలవి పన్నెండు. అంతా కలిపితే, బంగారు పాత్రల బరువు నూట యిరవై షెకెళ్ళు.
- సంఖ్యాకాండము 7:87సుమారు క్రీ.పూ. 1490
దహనబలి కోసం వాటి భోజనార్పణతో పాటు ఇవ్వబడిన పశువులు మొత్తం పన్నెండు కోడెలు, పన్నెండు పొట్టేళ్లు. పన్నెండు ఏడాది గొర్రెపిల్లలు. పన్నెండు మేకపోతులు పాపపరిహారబలి కోసం వాడబడ్డాయి.
- సంఖ్యాకాండము 7:88సుమారు క్రీ.పూ. 1490
సమాధానబలి కోసం ఇవ్వబడిన పశువులు మొత్తం యిరవై నాలుగు ఎడ్లు, అరవై పొట్టేళ్లు, అరవై మేకపోతులు అరవై ఏడాది గొర్రెపిల్లలు.
- సంఖ్యాకాండము 7:89సుమారు క్రీ.పూ. 1490
యెహోవాతో మాట్లాడటానికి మోషే సమావేశ గుడారంలో ప్రవేశించినప్పుడు, నిబంధన మందసం పైనున్న ప్రాయశ్చిత్త మూత మీదుగా ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి అతనితో మాట్లాడటం అతనికి వినిపించింది. ఇలా యెహోవా అతనితో మాట్లాడారు.
- సంఖ్యాకాండము 8:1సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా చెప్పారు.
- సంఖ్యాకాండము 8:2సుమారు క్రీ.పూ. 1490
“అహరోనుతో మాట్లాడి ఇలా చెప్పు, ‘దీపాలను వెలిగించినప్పుడు, దీపస్తంభం ముందు ఉన్న స్థలమంతా ప్రకాశించేలా మొత్తం ఏడు దీపాలు వెలిగేలా చూడాలి.’ ”
- సంఖ్యాకాండము 8:3సుమారు క్రీ.పూ. 1490
అహరోను అలాగే చేశాడు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు దీపస్తంభం మీద దీపాలు వెలుగు ఇచ్చేలా అమర్చాడు.
- సంఖ్యాకాండము 8:4సుమారు క్రీ.పూ. 1490
దీపస్తంభం ఇలా చేయబడింది: అది దాని స్తంభం నుండి దాని పుష్పాల వరకు సుత్తెతో సాగగొట్టబడిన బంగారంతో చేయబడింది. యెహోవా మోషేకు చూపిన నమూన ప్రకారం అది తయారుచేయబడింది.
- సంఖ్యాకాండము 8:5సుమారు క్రీ.పూ. 1490
యెహోవా మోషేతో ఇలా చెప్పారు.
- సంఖ్యాకాండము 8:6సుమారు క్రీ.పూ. 1490
“ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను ప్రత్యేకపరచి వారిని ఆచార ప్రకారం పవిత్రపరచు.
- సంఖ్యాకాండము 8:7సుమారు క్రీ.పూ. 1490
వారిని పవిత్రపరచడానికి ఇలా చేయాలి: వారి మీద శుద్ధి జలం ప్రోక్షించాలి; తర్వాత వారు తమ శరీరాలంతా క్షవరం చేయించుకొని తమ బట్టలు ఉతుక్కోవాలి. అలా తమను తాము పవిత్రపరచుకుంటారు.
- సంఖ్యాకాండము 8:8సుమారు క్రీ.పూ. 1490
వారు ఒక కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన నాణ్యమైన పిండిని భోజనార్పణగా తేవాలి; తర్వాత వారి నుండి రెండవ కోడెను పాపపరిహారబలి కోసం తీసుకోవాలి.
- సంఖ్యాకాండము 8:9సుమారు క్రీ.పూ. 1490
లేవీయులను సమావేశ గుడారం ముందుకు తీసుకువచ్చి మొత్తం ఇశ్రాయేలీయుల సమాజాన్ని సమావేశపరచు.
- సంఖ్యాకాండము 8:10సుమారు క్రీ.పూ. 1490
యెహోవా ముందుకు లేవీయులను నీవు తీసుకురావాలి, ఇశ్రాయేలీయులు వారి మీద చేతులుంచాలి.
- సంఖ్యాకాండము 8:11సుమారు క్రీ.పూ. 1490
అహరోను తన చేతులు పైకెత్తి, ఇశ్రాయేలు ప్రజల నుండి ప్రత్యేక అర్పణగా లేవీయులను యెహోవాకు సమర్పించాలి, తద్వారా వారు యెహోవా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు.
- సంఖ్యాకాండము 8:12సుమారు క్రీ.పూ. 1490
“అప్పుడు లేవీయులు కోడెల తలలపై వారి చేతులుంచి, ఒకటి పాపపరిహారబలిగా ఇంకొకటి లేవీయుల ప్రాయశ్చిత్తం కోసం దహనబలిగా యెహోవాకు అర్పించాలి.
- సంఖ్యాకాండము 8:13సుమారు క్రీ.పూ. 1490
లేవీయులను అహరోను, అతని కుమారుల ఎదుట నిలబెట్టి, చేతులు పైకెత్తి యెహోవాకు వారిని ప్రత్యేక అర్పణగా సమర్పించాలి.
- సంఖ్యాకాండము 8:14సుమారు క్రీ.పూ. 1490
ఈ విధంగా ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించాలి, లేవీయులంతా నా వారుగా ఉంటారు.
- సంఖ్యాకాండము 8:15సుమారు క్రీ.పూ. 1490
“లేవీయులను పవిత్రపరచిన తర్వాత, చేతులు పైకెత్తి వారిని ప్రత్యేక అర్పణగా సమర్పించిన తర్వాత, వారు సమావేశ గుడారంలో సేవ చేయడానికి రావాలి.