కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Moses & The Exodus

God raises up Moses to confront Pharaoh; the ten plagues culminate in Israel's dramatic deliverance from four centuries of bondage.

415 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. నిర్గమకాండము 6:3సుమారు క్రీ.పూ. 1491

    నేను సర్వశక్తిగల దేవునిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను, కాని యెహోవా అనే నా పేరుతో నన్ను నేను వారికి తెలియపరచుకోలేదు.

  2. నిర్గమకాండము 6:4సుమారు క్రీ.పూ. 1491

    వారు విదేశీయులుగా ఉండిన కనాను దేశాన్ని వారికి ఇస్తాననే నా నిబంధనతో నేను వారిని స్థిరపరిచాను.

  3. నిర్గమకాండము 6:5సుమారు క్రీ.పూ. 1491

    అంతేకాక, ఈజిప్టు వారిచేత బానిసలుగా చేయబడిన ఇశ్రాయేలీయుల మూలుగును నేను విన్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను.

  4. నిర్గమకాండము 6:6సుమారు క్రీ.పూ. 1491

    “కాబట్టి, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను యెహోవాను, ఈజిప్టువారి వెట్టిచాకిరి నుండి నేను మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను. మీరు వారికి బానిసలుగా ఉండకుండ నేను మిమ్మల్ని స్వతంత్రులను చేస్తాను, చాపబడిన బాహువుతో, గొప్ప తీర్పు చర్యలతో నేను మిమ్మల్ని విమోచిస్తాను.

  5. నిర్గమకాండము 6:7సుమారు క్రీ.పూ. 1491

    నేను మిమ్మల్ని నా సొంత ప్రజలుగా చేసుకుని, మీకు దేవుడనై ఉంటాను. అప్పుడు ఈజిప్టువారి కాడి క్రిందనుండి మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.

  6. నిర్గమకాండము 6:8సుమారు క్రీ.పూ. 1491

    నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు చేయెత్తి ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. దానిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. నేను యెహోవాను.’ ”

  7. నిర్గమకాండము 6:9సుమారు క్రీ.పూ. 1491

    మోషే ఇశ్రాయేలీయులకు ఈ విషయాన్ని తెలియజేశాడు, కాని వారి కఠినమైన శ్రమను బట్టి, నిరుత్సాహాన్ని బట్టి వారు అతని మాట వినలేదు.

  8. నిర్గమకాండము 6:10సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  9. నిర్గమకాండము 6:11సుమారు క్రీ.పూ. 1491

    “వెళ్లు, ఇశ్రాయేలీయులను తన దేశం నుండి బయటకు వెళ్లనివ్వమని ఈజిప్టు రాజైన ఫరోకు చెప్పు.”

  10. నిర్గమకాండము 6:12సుమారు క్రీ.పూ. 1491

    అయితే మోషే యెహోవాతో, “ఇశ్రాయేలీయులే నా మాట వినకపోతే స్పష్టంగా మాట్లాడలేని నా మాట ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.

  11. నిర్గమకాండము 6:13సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఇశ్రాయేలీయులను గురించి ఈజిప్టు రాజైన ఫరోను గురించి మాట్లాడి, ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురమ్మని వారిని ఆదేశించారు.

  12. నిర్గమకాండము 6:14సుమారు క్రీ.పూ. 1491

    వారి కుటుంబాలకు మూలపురుషులు వీరే: ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ;

  13. నిర్గమకాండము 6:15సుమారు క్రీ.పూ. 1491

    షిమ్యోను కుమారులు: యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు;

  14. నిర్గమకాండము 6:16సుమారు క్రీ.పూ. 1491

    కుటుంబ వివరాల ప్రకారం లేవీ కుమారుల పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి.

  15. నిర్గమకాండము 6:17సుమారు క్రీ.పూ. 1491

    వంశాల ప్రకారం గెర్షోను కుమారులు: లిబ్నీ, షిమీ.

  16. నిర్గమకాండము 6:18సుమారు క్రీ.పూ. 1491

    కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. (కహాతు 133 సంవత్సరాలు బ్రతికాడు.)

  17. నిర్గమకాండము 6:19సుమారు క్రీ.పూ. 1491

    మెరారి కుమారులు: మహలి, మూషి.

  18. నిర్గమకాండము 6:20సుమారు క్రీ.పూ. 1491

    అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెళ్ళి చేసుకున్నాడు. వారికి అహరోను మోషేలు పుట్టారు.

  19. నిర్గమకాండము 6:21సుమారు క్రీ.పూ. 1491

    ఇస్హారు కుమారులు: కోరహు, నెఫెగు, జిఖ్రీ.

  20. నిర్గమకాండము 6:22సుమారు క్రీ.పూ. 1491

    ఉజ్జీయేలు కుమారులు: మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.

  21. నిర్గమకాండము 6:23సుమారు క్రీ.పూ. 1491

    అహరోను అమ్మీనాదాబు కుమార్తె నయస్సోను సహోదరియైన ఎలీషేబను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె అతనికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులను కన్నది.

  22. నిర్గమకాండము 6:24సుమారు క్రీ.పూ. 1491

    కోరహు కుమారులు: అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు.

  23. నిర్గమకాండము 6:25సుమారు క్రీ.పూ. 1491

    అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకరిని పెళ్ళి చేసుకున్నాడు, ఆమె అతనికి ఫీనెహాసును కన్నది.

  24. నిర్గమకాండము 6:26సుమారు క్రీ.పూ. 1491

    “ఇశ్రాయేలీయులను వారి విభజనల ప్రకారం ఈజిప్టులో నుండి బయటకు తీసుకురండి” అని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరే.

  25. నిర్గమకాండము 6:27సుమారు క్రీ.పూ. 1491

    ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడం గురించి ఈజిప్టు రాజైన ఫరోతో మాట్లాడిన అహరోను మోషేలు వీరే.