కంటెంట్‌కు వెళ్లండి

Midian

38 వచనాలు · 14 కుటుంబ సభ్యులు

Midian ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇద్దరు మిద్యాను రాజులైన జెబహు, సల్మున్నా పారిపోయారు, కాని అతడు వారిని వెంటాడి పట్టుకుని వారి సైన్యమంతటిని ఓడించాడు.

  2. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, “నీవు మిద్యానీయుల చేతి నుండి మమ్మల్ని రక్షించావు కాబట్టి మమ్మల్ని నీవు, నీ కుమారుడు, నీ మనుమడు పాలించండి” అన్నారు.

  3. మిద్యాను రాజుల ఒంటి మీద ఉన్న చంద్రహారాలు ఆభరణాలు ఊదా దుస్తులు వారి ఒంటెల మెడలకున్న గొలుసులు కాకుండా అతడు కోరిన బంగారు పోగుల బరువు పదిహేడు వందల షెకెళ్ళ బంగారం అయ్యింది.

  4. మిద్యానీయులను ఇశ్రాయేలీయులు అణచివేసిన తర్వాత వారు మరలా తల ఎత్తలేకపోయారు. గిద్యోను కాలంలో దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.

  5. నా తండ్రి మీ కోసం పోరాడి మిద్యాను చేతి నుండి మిమ్మల్ని కాపాడడానికి తన ప్రాణం పణంగా పెట్టాడని జ్ఞాపకం చేసుకోండి.

  6. వారు మిద్యాను నుండి బయలుదేరి పారానుకు వెళ్లారు. తర్వాత పారాను నుండి కొందరిని వెంటబెట్టుకొని ఈజిప్టు రాజైన ఫరో దగ్గరకు వెళ్లారు, ఫరో హదదుకు ఇల్లు, ఆహారం, భూమి ఇచ్చాడు.

  7. అబ్రాహాము ఉంపుడుగత్తె కెతూరాకు పుట్టిన కుమారులు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కుమారులు: షేబ, దేదాను.

  8. మిద్యాను కుమారులు: ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా.

  9. హుషాము చనిపోయిన తర్వాత, మోయాబు దేశంలో మిద్యానీయులను ఓడించిన బెదెదు కుమారుడైన హదదు అతని స్థానంలో రాజయ్యాడు. అతని పట్టణానికి అవీతు అని పేరు పెట్టబడింది.

  10. మిద్యాను ఓడిపోయిన రోజు జరిగినట్లు, వారికి భారం కలిగించే కాడిని వారి భుజాలమీద ఉన్న కర్రను, వారిని హింసించేవాని కర్రను మీరు విరిచివేశారు.

  11. ఓరేబు బండ దగ్గర మిద్యానును చంపినట్లు సైన్యాల యెహోవా తన కొరడాతో వారిని కొడతారు; ఆయన ఈజిప్టులో చేసినట్టు తన దండాన్ని సముద్రం మీద ఎత్తుతారు.

  12. ఒంటెల మందలు, మిద్యాను ఏఫాల ఒంటె పిల్లలతో నీ దేశం నిండిపోతుంది. వారందరు షేబ నుండి వస్తారు, బంగారం ధూపద్రవ్యాలను తీసుకువస్తారు, యెహోవా స్తుతిని ప్రకటిస్తారు.

  13. భయంలో ఉన్న కూషీయుల గుడారాలను, వేదనలో ఉన్న మిద్యానువాసుల నివాసాలను నేను చూశాను.