కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యాజకుడు అపరాధపరిహారబలిగా అర్పించేందుకు గొర్రెపిల్లతో పాటు కొంచెం నూనె కూడా తీసుకుని పైకెత్తి ప్రత్యేక అర్పణగా యెహోవా ఎదుట అర్పించాలి.

  2. తన కుడి చూపుడు వ్రేలును దానిలో ముంచి యెహోవా ఎదుట ఏడుసార్లు చిలకరించాలి.

  3. యాజకుడు తన అరచేతిలో మిగిలిన నూనెను యెహోవా ఎదుట శుద్ధీకరణ కోసం వచ్చిన వారి తలకు పూసి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.

  4. పాపపరిహారబలిగా ఒకదాన్ని, దహనబలిగా ఒకదాన్ని సమర్పించాలి. వాటిని భోజనార్పణతో పాటు అర్పించాలి. ఈ విధంగా యాజకుడు యెహోవా ఎదుట శుద్ధీకరణ కోసం వచ్చిన వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”

  5. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,

  6. “మీ స్వాస్థ్యంగా నేను మీకు ఇస్తున్న కనాను దేశానికి మీరు వచ్చిన తర్వాత, ఆ దేశంలోని ఒక ఇంట్లో నేను కుష్ఠు మచ్చను ఉంచితే,

  7. యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నారు,

  8. ఎనిమిదవ రోజున అతడు రెండు పావురాలను లేదా రెండు చిన్న గువ్వలను తీసుకుని యెహోవా ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి.

  9. యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్రవిస్తున్న వ్యక్తికి యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.

  10. యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారబలిగా ఒకదాన్ని దహనబలిగా అర్పించాలి. ఈ విధంగా యాజకుడు స్త్రీకి స్రావం ద్వార కలిగిన అపవిత్రతకు యెహోవా ఎదుట ప్రాయశ్చిత్తం చేయాలి.

  11. అహరోను ఇద్దరు కుమారులు అనధికార నిప్పుతో యెహోవాను సమీపించినప్పుడు వారు చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడారు.

  12. యెహోవా మోషేతో అన్నారు: “నీ సహోదరుడైన అహరోను మందసం మీద ఉన్న ప్రాయశ్చిత్త మూతకు ఎదురుగా ఉన్న తెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడంటే అప్పుడు రావద్దు అని చెప్పు, అలా వస్తే అతడు చస్తాడు. ఎందుకంటే నేను మేఘంలో ఆ ప్రాయశ్చిత్త మూత మీదే మీకు ప్రత్యక్షమవుతాను.

  13. తర్వాత అతడు రెండు మేకపోతులు తీసుకుని సమావేశ గుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుట వాటిని సమర్పించాలి.

  14. అహరోను ఆ రెండు మేకపోతుల మధ్య చీట్లు వేయాలి ఎందుకంటే వాటిలో ఒకటి యెహోవా భాగం, మరొకటి విడిచిపెట్టబడే మేక.

  15. అప్పుడు అహరోను యెహోవా పేరిట చీటి వచ్చిన మేకను తీసుకుని పాపపరిహారబలిగా అర్పించాలి.

  16. విడిచిపెట్టాలి అనే చీటి వచ్చిన మేకను దాని వలన ప్రాయశ్చిత్తం కలిగేలా దాన్ని అడవిలో విడిచిపెట్టడానికి యెహోవా ఎదుట సజీవంగా నిలబెట్టాలి.

  17. అతడు యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం మీద ఉన్న నిప్పులతో నింపిన ధూపార్తిని, రెండు పిడికెళ్ళ పరిమళ ధూపం పొడిని తీసుకుని వాటిని తెర వెనుకకు తీసుకెళ్లాలి.

  18. అతడు ధూపాన్ని యెహోవా ముందు అగ్ని మీద ఉంచాలి, ధూపం యొక్క పొగ ఒడంబడిక పలకలను కప్పి ఉంచిన ప్రాయశ్చిత్త మూతను కప్పివేస్తుంది, తద్వారా అతడు చనిపోడు.

  19. “తర్వాత అతడు యెహోవా ఎదుట ఉన్న బలిపీఠం దగ్గరకు వచ్చి దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అతడు కోడె రక్తం కొంచెం, మేకపోతు రక్తం కొంచెం తీసుకుని బలిపీఠం కొమ్ములన్నిటికి పూయాలి.

  20. ఎందుకంటే ఆ రోజున మిమ్మల్ని పవిత్రపరచడానికి ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. అప్పుడు యెహోవా ఎదుట, మీ పాపాలన్నిటి నుండి మీరు శుద్ధి చేయబడతారు.

  21. “ఇది మీ కోసం నిత్య కట్టుబాటుగా ఉంటుంది: ఇశ్రాయేలీయుల పాపాలన్నిటికీ సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చేయాలి.” యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లే, అంతా జరిగింది.

  22. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  23. “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది:

  24. And bringeth it not unto the door of the tabernacle of the congregation, to offer an offering unto the LORD before the tabernacle of the LORD; blood shall be imputed unto that man; he hath shed blood; and that man shall be cut off from among his people:

  25. కాబట్టి ఇశ్రాయేలీయులు బయట పొలాల్లో అర్పిస్తున్న బలులను ఇకపై యెహోవా ఎదుట సమర్పించాలి. వారు సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవాకు సమాధానబలులుగా అర్పించడానికి యాజకుని దగ్గరకు తీసుకురావాలి.