కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు అభిషేకించబడిన రోజున, ఇశ్రాయేలీయులు రాబోయే తరాలకు తమ శాశ్వత వాటాగా ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించారు.

  2. వీటిని ఇశ్రాయేలీయులు తమ అర్పణలను యెహోవా దగ్గరకు తీసుకురావాలని ఆజ్ఞాపించిన రోజున యెహోవా సీనాయి అరణ్యంలోని సీనాయి పర్వతం దగ్గర మోషేకు ఇచ్చారు.

  3. యెహోవా మోషేతో చెప్పారు,

  4. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు, అలాగే సమాజం సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సమావేశమయ్యింది.

  5. “యెహోవా ఇలా చేయాలని ఆజ్ఞాపించారు” అని మోషే సమాజానికి చెప్పాడు.

  6. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు అహరోను తలమీద తలపాగాను పెట్టి, దానికి బంగారు పలకను అమర్చి దానికి పవిత్ర చిహ్నాన్ని తగిలించాడు.

  7. తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అతడు అహరోను కుమారులను ముందుకు తీసుకువచ్చి, వారికి చొక్కాలు తొడిగించి నడికట్టు కట్టి, వారి తలల మీద టోపీలను పెట్టాడు.

  8. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, కోడెను, దాని చర్మాన్ని దాని మాంసాన్ని, దాని పేడను శిబిరం బయట కాల్చివేశాడు.

  9. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దాని లోపలి అవయవాలను కాళ్లను నీళ్లతో కడిగి పొట్టేలంతటిని బలిపీఠం మీద కాల్చాడు. అది దహనబలి, యెహోవాకు సమర్పించబడిన ఇష్టమైన సువాసనగల హోమబలి.

  10. యెహోవా ఎదుట ఉన్న పులియని రొట్టెల గంపలో నుండి ఒక మందమైన రొట్టెను, ఒలీవనూనె కలిపి చేసిన ఒక మందమైన రొట్టెను, ఒక పల్చని రొట్టెను తీసుకుని, ఆ క్రొవ్వు మీద, కుడి తొడ మీద ఉంచాడు.

  11. అవన్నీ అహరోను, అతని కుమారుల చేతుల్లో పెట్టగా, వారు యెహోవా ఎదుట వాటిని పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించారు.

  12. తర్వాత మోషే వారి చేతుల్లో నుండి వాటిని తీసుకుని బలిపీఠం మీద ఉన్న దహనబలి మీదుగా ప్రతిష్ఠార్పణగా వాటిని కాల్చి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా అర్పించాడు.

  13. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, ప్రతిష్ఠార్పణకు చెందిన పొట్టేలులో మోషే వాటాయైన రొమ్ము భాగాన్ని కూడా తీసి పైకెత్తి దానిని యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.

  14. అప్పుడు మోషే అహరోనుతో, అతని కుమారులతో, “సమావేశ గుడారపు ద్వారం దగ్గర మాంసాన్ని వండి ప్రతిష్ఠార్పణల గంపలోని రొట్టెలతో తినాలి, నాకు ఆజ్ఞాపించబడిన ప్రకారం, ‘అహరోను అతని కుమారులు దానిని తినాలి.’

  15. ఈ రోజు జరిగింది యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి జరిగింది.

  16. మీరు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర ఏడు రోజులు రాత్రింబగళ్ళు ఉండి యెహోవా ఏం చేయమంటారో అది చేయాలి, అప్పుడు మీరు చావరు; ఎందుకంటే నాకివ్వబడిన ఆజ్ఞ ఇదే” అని చెప్పాడు.

  17. కాబట్టి అహరోను అతని కుమారులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతిదీ చేశారు.

  18. అతడు అహరోనుతో ఇలా అన్నాడు, “మీ పాపపరిహారబలి కోసం ఏ లోపం లేని ఒక మగ దూడను, మీ దహనబలికి ఒక లోపం లేని పొట్టేలును తీసుకువచ్చి వాటిని యెహోవా ఎదుట సమర్పించాలి.

  19. యెహోవా ఎదుట బలి అర్పించడానికి సమాధానబలికి ఎద్దును, పొట్టేలును, ఒలీవనూనె కలిపిన భోజనార్పణతో పాటు తీసుకురండి. ఎందుకంటే యెహోవా ఈ రోజు మీకు ప్రత్యక్షమవుతారు.’ ”

  20. వారు మోషే ఆజ్ఞాపించినట్లుగా సమావేశ గుడారం ఎదుటికి వాటన్నిటిని తీసుకువచ్చారు, అప్పుడు సమాజమంతా దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడ్డారు.

  21. అప్పుడు మోషే ఇలా అన్నాడు, “మీరు ఇలా చేయాలని యెహోవా ఆజ్ఞాపించారు, తద్వార యెహోవా మహిమ మీకు ప్రత్యక్షం అవుతుంది.”

  22. మోషే అహరోనుతో ఇలా అన్నాడు, “యెహోవా ఆజ్ఞాపించినట్లు బలిపీఠం దగ్గరకు వచ్చి, నీ పాపపరిహారబలిని, దహనబలిని అర్పించి, నీకోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి; ప్రజల కోసం అర్పణను అర్పించి వారి కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.”

  23. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు బలిపీఠం మీద పాపపరిహారబలిగా దాని క్రొవ్వును, మూత్రపిండాలను, కాలేయం దగ్గర ఉన్న క్రొవ్వును దహించాడు.

  24. మోషే ఆజ్ఞాపించినట్టు అహరోను రొమ్ము భాగాన్ని, కుడి తొడను పైకెత్తి ఊపి యెహోవా ఎదుట ప్రత్యేక అర్పణగా అర్పించాడు.

  25. అప్పుడు మోషే అహరోనులు కలిసి సమావేశ గుడారం లోనికి వెళ్లారు. వారు బయటకు వచ్చినప్పుడు ప్రజలను దీవించారు; యెహోవా మహిమ ప్రజలందరికి కనిపించింది.