కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సమావేశ గుడార ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా బలిపీఠం మీద యాజకుడు రక్తాన్ని చల్లి, క్రొవ్వును యెహోవాకు ఇష్టమైన సువాసనగా దహించాలి.

  2. యెహోవాకు బలి ఇవ్వడానికి సమావేశ గుడార ద్వారం దగ్గరకు దాన్ని తీసుకురాకపోతే వారు ఇశ్రాయేలు ప్రజల నుండి తొలగించబడాలి.

  3. “ ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా రక్తాన్ని తింటే వారికి నేను విరోధంగా ఉంటాను, వారిని తమ ప్రజల నుండి తొలగిస్తాను.

  4. ఎందుకంటే, ఒక జీవికి ప్రాణం రక్తంలో ఉంది, బలిపీఠం మీద మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నేను దానిని మీకిచ్చాను. ఇది ఒకరి జీవితానికి ప్రాయశ్చిత్తం చేసే రక్తము.

  5. అందుకే, “మీలో గాని, మీ మధ్య ఉన్న విదేశీయులలో గాని ఎవరూ రక్తాన్ని తినకూడదు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.

  6. ఎందుకంటే ప్రతి జీవికి ప్రాణం దాని రక్తము. అందుకే, “ప్రతి జీవికి ప్రాణం దాని రక్తం కాబట్టి మీరు ఏ ప్రాణి రక్తాన్నీ తినకూడదు. ఎవరైన దానిని తింటే వారు తొలిగించబడతారు” అని నేను ఇశ్రాయేలీయులకు ఆదేశించాను.

  7. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  8. “నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ‘నేను మీ దేవుడనైన యెహోవాను అని చెప్పు.

  9. మీరు నివసించిన ఈజిప్టులోని వారు చేసినట్లు మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని తీసుకెళ్లే కనాను దేశంలోని వారు చేసినట్టు మీరు చేయకూడదు. వారి ఆచారాలను పాటించకూడదు.

  10. మీరు నా చట్టాలకు లోబడాలి, నా శాసనాలను జాగ్రతగా పాటించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.

  11. నా శాసనాలను చట్టాలను మీరు పాటించండి. ఎవరైతే వాటికి లోబడేవారు వాటి వల్లనే జీవిస్తారు. నేను యెహోవాను.

  12. “ ‘ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను.

  13. “ ‘మీ పిల్లల్లో ఎవరినీ మోలెకుకు బలి ఇవ్వవద్దు, ఎందుకంటే మీరు మీ దేవుని పేరును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.

  14. “ ‘వీటిలో దేని ద్వారానైన మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు, ఎందుకంటే మీ ముందు నుండి నేను వెళ్లగొట్టే దేశాల ప్రజలు ఇలాంటి వాటి వల్లనే అపవిత్రమయ్యారు.

  15. ఆ దేశం కూడ అపవిత్రమైంది; కాబట్టి దాని పాపాన్ని బట్టి దాన్ని శిక్షించాను, ఆ దేశం తనలో నివసించేవారిని బయటికి వెళ్లగ్రక్కుతుంది.

  16. కానీ మీరు నా శాసనాలను నా చట్టాలను పాటించాలి. మీలో నివసించే స్వదేశీయులు గాని విదేశీయులు గాని ఈ హేయమైన పనులేవి చేయకూడదు.

  17. నేను మీకు చెప్పినవి పాటించి, అక్కడ మీకన్నా ముందు నివసించినవారు పాటించిన హేయమైన ఆచారాల్లో దేనినైనా పాటించి వాటివలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”

  18. యెహోవా మోషేతో అన్నారు,

  19. “నీవు ఇశ్రాయేలు సమాజమంతటితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘మీరు పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను.

  20. “ ‘మీలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి, నా సబ్బాతులను ఆచరించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.

  21. “ ‘విగ్రహాలవైపు తిరగకండి లేదా మీ కోసం అచ్చు వేసిన విగ్రహ దేవుళ్ళను చేసుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.

  22. “ ‘మీరు యెహోవాకు సమాధానబలి అర్పించినప్పుడు, అది మీ తరపున అంగీకరించబడే విధంగా దానిని అర్పించాలి.

  23. ఎవరైనా దానిని తింటే, యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రం చేసినందుకు వారు దోషశిక్షను భరిస్తారు; వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి.

  24. మీ ద్రాక్షతోటపై రెండవసారి వెళ్లవద్దు లేదా పడిపోయిన ద్రాక్షను తీయవద్దు. పేదలు, విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.

  25. “ ‘నా పేరిట అబద్ధ ప్రమాణాలు చేసి మీ దేవుని పేరు అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను.