కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మోషే తన చేతుల్లో ఆ రెండు నిబంధన పలకలను మోస్తూ సీనాయి పర్వతం దిగివస్తున్నప్పుడు, అతడు యెహోవాతో మాట్లాడాడు కాబట్టి అతని ముఖం ప్రకాశమానంగా ఉందని అతనికి తెలియదు.

  2. ఆ తర్వాత ఇశ్రాయేలీయులందరు అతని దగ్గరకు రాగా సీనాయి పర్వతం మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని అతడు వారికిచ్చాడు.

  3. అయితే మోషే యెహోవాతో మాట్లాడడానికి ఆయన సన్నిధిలోనికి వెళ్లినప్పుడెల్లా బయటకు వచ్చేవరకు అతడు ముసుగు తీసివేసేవాడు. అతడు బయటకు వచ్చి తనకు ఆజ్ఞాపించిన వాటిని ఇశ్రాయేలీయులకు చెప్పేవాడు.

  4. అప్పుడు అతని ముఖం ప్రకాశించడం ఇశ్రాయేలీయులు చూశారు; మోషే తిరిగి యెహోవాతో మాట్లాడడానికి వెళ్లేవరకు తన ముఖం మీద ముసుగు వేసుకునేవాడు.

  5. మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటిని సమావేశపరచి వారితో, “మీరు పాటించడానికి యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు ఇవే:

  6. ఆరు రోజులు పని చేయాలి, కాని ఏడవ రోజు మీ పరిశుద్ధ దినం, అది యెహోవాకు సబ్బాతు విశ్రాంతి దినము. ఆ రోజు ఎవరు ఏ పని చేసినా వారికి మరణశిక్ష విధించబడాలి.

  7. మోషే ఇశ్రాయేలీయుల సమాజమంతటితో, “యెహోవా ఆజ్ఞాపించింది ఇదే:

  8. మీ దగ్గర ఉన్నదానిలో నుండి యెహోవా కోసం అర్పణ తీసుకురావాలి. ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుక తెచ్చే ప్రతి ఒక్కరు ఇవి తీసుకురావలసినవి: “బంగారం, వెండి, ఇత్తడి;

  9. “మీలో నైపుణ్యం ఉన్నవారు వచ్చి యెహోవా ఆజ్ఞాపించిన ప్రతిదీ తయారుచేయాలి:

  10. ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్న ప్రతిఒక్కరు, హృదయాల్లో ప్రేరేపించబడిన ప్రతి ఒక్కరు వచ్చి, సమావేశ గుడారం యొక్క పనుల కోసం, దాని సేవలన్నిటి కోసం, పవిత్ర వస్త్రాల కోసం యెహోవాకు అర్పణలు తెచ్చారు.

  11. ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్న స్త్రీలు పురుషులు వచ్చి, చెవికమ్మలు, వ్రేలి ఉంగరాలు, నగలు, వివిధ రకాల బంగారు ఆభరణాలు తెచ్చి ఆ బంగారాన్ని పైకెత్తి ఆడించి యెహోవాకు ప్రత్యేక అర్పణగా సమర్పించారు.

  12. వెండిని ఇత్తడిని అర్పించాలనుకున్నవారు వాటిని యెహోవాకు అర్పణగా తెచ్చారు, ఆ పనిలో దేనికైనా ఉపయోగపడే తుమ్మకర్రలు ఉన్న ప్రతిఒక్కరు వాటిని తెచ్చారు.

  13. మోషే ద్వారా యెహోవా వారికి చేయమని ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలీయుల స్త్రీలు పురుషులలో ప్రేరేపించబడిన వారందరు ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు తెచ్చారు.

  14. తర్వాత మోషే ఇశ్రాయేలీయులతో, “చూడండి, యెహోవా యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును ఏర్పరచుకొని,

  15. బంగారం వెండి ఇత్తడితో కళాత్మక నమూనాలను రూపొందించడానికి, రాళ్లను చెక్కి అమర్చడం, చెక్క పని చేయడం వంటి అన్ని రకాల కళాత్మక నైపుణ్యాలతో పని చేయడానికి అతన్ని దేవుని ఆత్మతో జ్ఞానంతో సామర్థ్యంతో తెలివితో అన్ని రకాల నైపుణ్యతలతో నింపారు.

  16. ఆయన బెసలేలుకు, అలాగే దాను గోత్రానికి చెందిన అహీసామాకు కుమారుడైన ఒహోలీయాబుకు ఇతరులకు నేర్పగల సామర్థ్యాన్ని ఇచ్చారు.

  17. చెక్కేవారి పని, కళాకారుల పని, నీలం ఊదా ఎరుపు రంగుల నూలు సన్నని నారతో కుట్టుపని, నేతగాని పని, చిత్రకారులు చేయగల అన్ని రకాల పనులను చేయడానికి కావలసిన నైపుణ్యంతో యెహోవా వారిని నింపారు.

  18. పరిశుద్ధాలయం యొక్క సేవ కోసం చేయవలసిన అన్ని రకాల పనులు ఎలా చేయాలో తెలుసుకోవడానికి యెహోవా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చిన బెసలేలు ఒహోలీయాబు వలె నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం పని చేయాలి” అన్నాడు.

  19. తర్వాత బెసలేలును ఒహోలీయాబును, యెహోవా సామర్థ్యం ఇచ్చిన వారిని, పని చేయడానికి ప్రేరేపించబడిన వారందరిని మోషే పిలిపించాడు.

  20. మోషేతో, “యెహోవా చేయమని ఆజ్ఞాపించిన పనికి కావలసిన దానికన్నా ఎక్కువగా ప్రజలు తెస్తున్నారు” అని చెప్పారు.

  21. యూదా గోత్రానికి చెందిన ఊరి కుమారుడు హూరు మనుమడైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాడు;

  22. పరిశుద్ధాలయంలో సేవ చేయడానికి నీలం ఊదా ఎరుపు రంగుల నూలు ఉపయోగించి వారు నేసిన వస్త్రాలను తయారుచేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం అహరోనుకు పవిత్ర వస్త్రాలను కూడా తయారుచేశారు.

  23. నైపుణ్యంగా అల్లబడిన దాని నడికట్టు ఏఫోదుతో ఒకే ముక్కగా, బంగారం నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారతో చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.

  24. తర్వాత వాటిని ఇశ్రాయేలు కుమారుల జ్ఞాపకార్థ రాళ్లుగా ఏఫోదు భుజాలపై బిగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇవన్నీ చేశారు.

  25. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు, రొమ్ము పతకం ఏఫోదు నుండి బయటకు వ్రేలాడకుండా నడికట్టును అంటిపెట్టుకుని ఉండేలా రొమ్ము పతకం యొక్క ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు నీలిరంగు దారంతో కట్టారు.