God
God ను ప్రస్తావించే వచనాలు
అయితే నేను, “అయ్యో, ప్రభువా యెహోవా! ప్రవక్తలు వారితో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, మీకు కరువు రాదు. నిజానికి, ఈ స్థలంలో నేను మీకు శాశ్వతమైన సమాధానం ఇస్తాను’ అని చెబుతున్నారు.”
అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “ప్రవక్తలు నా పేరుతో అబద్ధాలు ప్రవచిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారిని నియమించలేదు, అసలు వారితో మాట్లాడలేదు. వారు మీకు తప్పుడు దర్శనాలు, భవిష్యవాణి, బూటకపు మాటలు వారి సొంత మనస్సు యొక్క భ్రమలు ప్రవచిస్తున్నారు.
కాబట్టి నా పేరుతో ప్రవచిస్తున్న ప్రవక్తల గురించి యెహోవా ఇలా అంటున్నారు: నేను వారిని పంపలేదు, అయినా వారు, ‘ఖడ్గం గాని కరువు గాని ఈ దేశాన్ని తాకవు’ అని చెప్తున్నారు. అలా ప్రవచిస్తున్న ప్రవక్తలే ఖడ్గం కరువుతో నశిస్తారు.
వారు ఎవరికి ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు కరువు, ఖడ్గం కారణంగా యెరూషలేము వీధుల్లోకి విసిరివేయబడతారు. వారిని, వారి భార్యలను, వారి కుమారులను వారి కుమార్తెలను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు. నేను వారికి తగిన విపత్తును వారిపై కురిపిస్తాను.
“వారితో ఈ మాట చెప్పు: “ ‘నా కళ్లలో కన్నీరు రాత్రింబగళ్ళు ఆగకుండా పొంగిపారును గాక; ఎందుకంటే, కన్యయైన నా ప్రజల కుమార్తెకు, తీవ్రమైన గాయం తగిలింది, అది ఆమెను నలిపివేస్తుంది.
నేను పొలాల్లోకి వెళ్తే, ఖడ్గంతో చంపబడినవారు కనబడతారు; నేను పట్టణంలోకి వెళ్తే, కరువు బీభత్సాన్ని చూస్తాను. ప్రవక్త యాజకుడు ఇద్దరూ తమకు తెలియని దేశానికి వెళ్లారు.’ ”
యెహోవా, మీరు యూదాను పూర్తిగా తిరస్కరించారా? మీరు సీయోనును తృణీకరిస్తున్నారా? మేము స్వస్థత పొందలేనంతగా మమ్మల్ని ఎందుకు బాధించారు? మేము సమాధానం కోసం నిరీక్షించాం కానీ ఏ మంచి జరగలేదు, స్వస్థత జరిగే సమయం కోసం నిరీక్షించాం కానీ కేవలం భయమే ఉండింది.
యెహోవా, మా దుర్మార్గాన్ని, మా పూర్వికుల అపరాధాన్ని మేము ఒప్పుకుంటున్నాం; మేము మీకు విరోధంగా పాపం చేశాము.
మీ పేరు కోసం మమ్మల్ని తృణీకరించకండి; మహిమతో నిండిన మీ సింహాసనాన్ని అగౌరపరచకండి. మాతో మీ ఒడంబడికను జ్ఞాపకం ఉంచుకోండి దానిని భంగం చేయకండి.
జనాంగాల పనికిమాలిన విగ్రహాలేవైనా వర్షాన్ని కురిపిస్తాయా? ఆకాశాలు వాటంతట అవి జల్లులు కురిపిస్తాయా? లేదు, యెహోవా, మా దేవా మీరే కదా. కాబట్టి మీ మీదనే మా నిరీక్షణ ఉంది, ఎందుకంటే ఇదంతా చేసింది మీరే.
అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!
వారు నిన్ను, ‘మేము ఎక్కడికి వెళ్లాలి?’ అని అడిగితే, వారితో చెప్పు, ‘యెహోవా ఇలా అంటున్నారు: “ ‘మరణానికి నిర్ణయించబడినవారు, మరణానికి; ఖడ్గానికి నిర్ణయించబడినవారు, ఖడ్గానికి; ఆకలికి నిర్ణయించబడినవారు, ఆకలికి; చెరకు నిర్ణయించబడినవారు, చెరకు వెళ్లాలి.’
“నేను నాలుగు రకాల బాధలను వారి మీదికి పంపుతాను. చంపడానికి ఖడ్గాన్ని, చీల్చడానికి కుక్కలను, తిని నాశనం చేయడానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
యూదా రాజైన హిజ్కియా కుమారుడైన మనష్షే యెరూషలేములో చేసిన దానిని బట్టి భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలకు నేను వారిని అసహ్యమైన వారిగా చేస్తాను.
నీవు నన్ను తిరస్కరించావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీవు విశ్వాసభ్రష్టత్వం కొనసాగిస్తూనే ఉన్నావు. కాబట్టి నేను నా చేయి చాపి నిన్ను నాశనం చేస్తాను; నీ మీద జాలి చూపడానికి నేను అలసిపోయాను.
దేశపు పట్టణ ద్వారం దగ్గర నేను వారిని చేటతో చెరుగుతాను. నా ప్రజలు తమ మార్గాలను మార్చుకోలేదు వారికి బంధువియోగం కలిగించి నాశనం చేస్తాను.
నేను వారి విధవరాండ్ర సంఖ్యను సముద్రపు ఇసుక కంటే ఎక్కువ చేస్తాను. మధ్యాహ్న సమయంలో నేను వారి యువకులు తల్లుల మీదికి నాశనం చేసేవాన్ని రప్పిస్తాను; అకస్మాత్తుగా నేను వారి మీదికి వేదనను, భయాందోళనను రప్పిస్తాను.
ఏడుగురు పిల్లల తల్లి మూర్ఛపోయి తుది శ్వాస విడుస్తుంది. పగలు ఉండగానే ఆమెకు ప్రొద్దు గ్రుంకుతుంది; ఆమె అవమానం పాలవుతుంది, కించపరచబడుతుంది. ప్రాణాలతో బయటపడిన వారిని వారి శత్రువుల ముందు ఖడ్గానికి అప్పగిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
యెహోవా ఇలా అన్నారు, “ఖచ్చితంగా నేను నిన్ను మంచి ఉద్దేశంతో విడిపిస్తాను; ఆపద సమయాల్లోనూ, కష్ట సమయాల్లోనూ నీ శత్రువులు నిన్ను సాయం కోరేలా నేను చేస్తాను.
యెహోవా, మీరు అర్థం చేసుకోండి; నన్ను జ్ఞాపకముంచుకొని నా పట్ల శ్రద్ధ చూపండి. నన్ను హింసించేవారి మీద నా కోసం ప్రతీకారం తీర్చుకోండి. మీ ఓర్పును బట్టి నన్ను తీసుకెళ్లనివ్వకండి; మీ కోసం నేనెలా నిందలు అనుభవిస్తున్నానో ఆలోచించండి.
మీ మాటలు దొరికినప్పుడు ఒకడు ఆహారం తిన్నట్లుగా నేను వాటిని తిన్నాను; అవే నాకు ఆనందం నా హృదయానికి సంతోషం, ఎందుకంటే సైన్యాల యెహోవా దేవుడు అనే, మీ పేరును నేను కలిగి ఉన్నాను.
నేనిప్పుడు ఆనందించే వారితో కలిసి కూర్చోలేదు, వారితో ఎప్పుడూ సంతోషించలేదు. మీ చేయి నా మీద ఉంది మీరు నాలో కోపాన్ని నింపారు కాబట్టి నేను ఒంటరిగా కూర్చున్నాను.
అలాంటప్పుడు నా బాధ ఎందుకు అంతం కావడం లేదు? నా గాయం ఎందుకు నయం చేయలేనిది? మీ సహాయం నమ్మలేని వాగులా, ఎండిపోయే ఊటలా వంటిది.
కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “నీవు పశ్చాత్తాపపడితే మీరు నాకు సేవ చేసేలా నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. నీవు పనికిరాని మాటలు కాక, యోగ్యమైన మాటలు మాట్లాడితే, నీవు నా పక్షంగా మాట్లాడే వక్తవవుతావు. ఈ ప్రజలు నీ వైపుకు తిరగాలి, కాని నీవు వారివైపు తిరగకూడదు.
నిన్ను ఈ ప్రజలకు గోడగా, ఇత్తడి కోటగోడగా చేస్తాను; వారు నీతో పోరాడతారు, కాని నిన్ను జయించలేరు, ఎందుకంటే నిన్ను విడిపించి రక్షించడానికి నేను నీతో ఉన్నాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.