God
God ను ప్రస్తావించే వచనాలు
ఈ పర్వతంపై ఆయన ప్రజలందరి ముఖాల మీద ఉన్న ముసుగును సమస్త దేశాల మీద ఉన్న తెరను తీసివేస్తారు;
శాశ్వతంగా ఆయన మరణాన్ని మ్రింగివేస్తారు. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది కన్నీటిని తుడిచివేస్తారు; సమస్త భూమి మీద నుండి తన ప్రజల అవమానాన్ని తొలగిస్తారు. యెహోవా ఇది తెలియజేశారు.
ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”
యెహోవా చేయి ఈ పర్వతంపై నిలిచి ఉంటుంది; అయితే పెంటకుప్పలో గడ్డిని త్రొక్కినట్లు, మోయాబీయులు తమ దేశంలోనే త్రొక్కబడతారు.
ఈతగాళ్లు ఈదడానికి తమ చేతులు చాపినట్లు వారు దాని మధ్య తమ చేతులు చాపుతారు. వారి చేతులు యుక్తితో ఉన్నా దేవుడు వారి గర్వాన్ని అణచివేస్తారు.
మోయాబూ, నీ ఎత్తైన కోటలను ఆయన పడగొడతారు. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిలో పడవేస్తారు.
ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు: మనకు ఒక బలమైన పట్టణం ఉంది; దేవుడు రక్షణను దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు.
మీరు స్థిరమైన మనస్సుగల వారిని సంపూర్ణ సమాధానంతో కాపాడతారు, ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.
యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.
ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు ఎత్తైన కోటలను పడగొడతారు; ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి దానిని ధూళిలో కలుపుతారు.
నీతిమంతుల దారి సమంగా ఉంటుంది; యథార్థవంతుడా, మీరు నీతిమంతుల మార్గం సరాళం చేస్తావు.
అవును యెహోవా, మీ న్యాయవిధుల మార్గాల్లో నడుస్తూ మేము మీ కోసం వేచి ఉన్నాము; మీ నామం మీ కీర్తి మా హృదయాల కోరిక.
రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.
కాని చెడ్డవారికి దయ చూపిస్తే, వారు నీతిని నేర్చుకోరు. యథార్థమైన దేశంలో ఉన్నా కూడా వారు చెడు చేస్తూనే ఉంటారు యెహోవా ఘనతను వారు పట్టించుకోరు.
యెహోవా! మీ చేయి ఎత్తుగా ఎత్తబడింది, కాని వారు దానిని చూడరు. మీ ప్రజల పట్ల మీకున్న ఆసక్తి చూసి వారు సిగ్గుపడతారు; మీ శత్రువుల కోసం కేటాయించబడిన అగ్ని వారిని కాల్చివేయాలి.
యెహోవా! మీరు మాకు సమాధానాన్ని స్థాపిస్తారు; మేము సాధించిందంతా మీరు మాకోసం చేసిందే.
యెహోవా! మా దేవా! మీరు కాకుండా వేరే ప్రభువులు మమ్మల్ని పాలించారు, కాని మేము మీ నామాన్ని మాత్రమే ఘనపరుస్తాము.
వారు చనిపోయారు, మరల బ్రతకరు; వారి ఆత్మలు లేవవు. మీరు వారిని శిక్షించి నాశనం చేశారు; మీరు వారి జ్ఞాపకాలన్నిటిని తుడిచివేశారు.
యెహోవా, మీరు దేశాన్ని వృద్ధిచేశారు; మీరు దేశాన్ని వృద్ధిచేశారు. మీరు మీకే మహిమ సంపాదించుకున్నారు; మీరు దేశపు సరిహద్దులన్నిటిని విస్తరింపజేశారు.
యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు; మీరు వారిని శిక్షించినప్పుడు వారు దీన ప్రార్థనలు చేశారు.
గర్భిణి స్త్రీ ప్రసవానికి సిద్ధమైనప్పుడు ఆ నొప్పికి బాధతో కేకలు వేసినట్లు యెహోవా మీ సన్నిధిలో మేము ఉన్నాము.
నా ప్రజలారా! మీ గదిలోకి వెళ్లి మీ వెనక తలుపులు వేసుకోండి; ఆయన ఉగ్రత పోయే వరకు కొంతకాలం మీరు దాక్కోండి.
ఇదిగో వారి పాపాలను బట్టి భూప్రజలను శిక్షించడానికి యెహోవా తన నివాసంలో నుండి వస్తున్నారు. భూమి తనపై చిందిన రక్తాన్ని వెల్లడిస్తుంది; భూమి చంపబడిన వారిని ఇకపై దాచదు.
ఆ రోజున యెహోవా భయంకరమైన, గొప్పదైన శక్తిగల తన ఖడ్గంతో లెవియాథన్ అనే ఎగిరే పాము, లెవియాథన్ అనే చుట్టుకునే పామును ఆయన శిక్షిస్తారు. ఆయన సముద్రపు మృగాన్ని చంపుతారు.
యెహోవానైన నేను దానిని కాపాడతాను; నేను దానికి క్రమంగా నీరు పెడతాను. ఎవరూ దానిని పాడు చేయకుండ రాత్రి పగలు కాపలా కాస్తాను.