కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సైన్యాల అధిపతియైన యెహోవా ఇలా అంటున్నారు: “నిర్వాహకుడు, అనగా రాజభవన నిర్వాహకుడైన షెబ్నా దగ్గరకు వెళ్లి అతనితో ఇలా చెప్పు:

  2. “ఓ బలవంతుడా, యెహోవా నిన్ను గట్టిగా పట్టుకుని, వేగంగా విసిరివేస్తారు, జాగ్రత్త!

  3. నీ పని నుండి నేను నిన్ను తొలగిస్తాను, నీ హోదా నుండి త్రోసివేయబడతావు.

  4. “ఆ రోజున నేను, నా సేవకుడైన హిల్కీయా కుమారుడైన ఎల్యాకీమును పిలిపించి,

  5. నీ చొక్కా అతనికి తొడిగించి, నీ నడికట్టు అతనికి కట్టి, నీ అధికారాన్ని అతనికి ఇస్తాను. అతడు యెరూషలేములో నివసించేవారికి, యూదా ప్రజలకు తండ్రిగా ఉంటాడు.

  6. నేను దావీదు ఇంటి తాళపు చెవిని అతని భుజం మీద ఉంచుతాను; అతడు తెరచిన దానిని ఎవరూ మూయలేరు. అతడు మూసివేసిన దానిని ఎవరూ తెరవలేరు.

  7. బలమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరుస్తాను; అతడు తన తండ్రి ఇంటికి గౌరవాన్ని ఘనతను తెచ్చే సింహాసనంగా ఉంటాడు.

  8. “సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, ఆ రోజున బలమైన చోట స్థిరంగా కొట్టబడిన మేకు ఊడిపోయి క్రిందపడిపోతుంది. దానిపై ఉన్న బరువు తెగి క్రిందపడుతుంది.” ఇదే యెహోవా చెప్పిన మాట.

  9. తనకున్న అందాన్ని బట్టి కలిగిన గర్వాన్ని అణచడానికి భూమి మీద ప్రసిద్ధులందరిని అవమానపరచడానికి సైన్యాల యెహోవా ఇలా చేశారు.

  10. యెహోవా సముద్రం మీద తన చేయి చాపి దాని రాజ్యాలు వణికేలా చేశారు. కనాను కోటలను నాశనం చేయడానికి ఆయన దాని గురించి ఆజ్ఞ ఇచ్చారు.

  11. ఆయన ఇలా అన్నారు, “అణచివేతకు గురైన సీదోను కుమార్తె, ఇకపై నీకు సంతోషం ఉండదు. “నీవు లేచి కుప్రకు వెళ్లు, అక్కడ కూడా నీకు విశ్రాంతి దొరకదు.”

  12. బబులోనీయుల దేశాన్ని చూడు, వారు తమ గుర్తింపును కోల్పోయారు! అష్షూరీయులు దానిని ఎడారి జీవులకు నివాసంగా చేశారు. వారు దానిలో ముట్టడి గోపురాలు కట్టించి, దాని కోటలు పడగొట్టి శిథిలాలుగా మార్చారు.

  13. డెబ్బై సంవత్సరాల తర్వాత యెహోవా తూరు మీద దయ చూపిస్తారు. కాని అది తన లాభదాయకమైన వ్యభిచారానికి తిరిగివెళ్లి భూమిపై ఉన్న అన్ని రాజ్యాలతో వ్యాపారం చేస్తుంది.

  14. అయినా దాని లాభం, దాని సంపాదన యెహోవాకు చెందుతుంది; వాటిని నిల్వ ఉంచరు, కూడబెట్టరు. దాని లాభాలు యెహోవా సన్నిధిలో నివసించేవారికి సమృద్ధి ఆహారం, విలువైన వస్త్రాలు అందించడానికి ఉపయోగించబడతాయి.

  15. చూడండి, యెహోవా భూమిని పాడుచేసి నాశనం చేయబోతున్నారు; ఆయన దాని ఉపరితలాన్ని పాడుచేసి దానిలో నివసించేవారిని చెదరగొడతారు.

  16. భూమి పూర్తిగా పాడుచేయబడి పూర్తిగా దోచుకోబడుతుంది. యెహోవా ఈ మాట చెప్పారు.

  17. వారు తమ స్వరాలెత్తి ఆనందంతో కేకలు వేస్తారు; పశ్చిమ నుండి వారు యెహోవా గొప్పతనాన్ని కొనియాడుతారు.

  18. కాబట్టి తూర్పున ఉన్నవారలారా, యెహోవాను ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామాన్ని ఘనపరచండి.

  19. ఆ రోజున యెహోవా పైన ఆకాశాల్లో ఉన్న శక్తులను, భూమి మీద ఉన్న రాజులను శిక్షిస్తారు.

  20. చంద్రుడు దిగులు చెందుతాడు సూర్యుడు సిగ్గుపడతాడు; సైన్యాల యెహోవా సీయోను కొండమీద యెరూషలేములో, దాని పెద్దల ఎదుట గొప్ప మహిమతో రాజ్యమేలుతారు.

  21. యెహోవా, మీరే నా దేవుడు; నేను మిమ్మల్ని ఘనపరచి మీ నామాన్ని స్తుతిస్తాను, పరిపూర్ణ నమ్మకత్వంతో మీరు ఎంతో కాలం క్రితం ఆలోచించిన అద్భుతాలను మీరు చేశారు.

  22. మీరు పట్టణాన్ని శిథిలాల కుప్పగా కోట ఉన్న పట్టణాన్ని పాడైన దానిగా, విదేశీయుల దుర్గాన్ని పట్టణంగా ఉండకుండా చేశారు; అది ఎప్పటికీ తిరిగి కట్టబడదు.

  23. కాబట్టి బలమైన జనాంగాలు మిమ్మల్ని గౌరవిస్తారు; క్రూరమైన దేశాల పట్టణాలు మీకు భయపడతాయి.

  24. మీరు పేదవారికి ఆశ్రయంగా ఉన్నారు, అవసరతలో ఉన్నవారికి తమ బాధలో మీరు ఆశ్రయంగా ఉన్నారు, తుఫానులో ఉన్నవారికి ఆశ్రయంగా, వేడి నుండి తప్పించే నీడగా ఉన్నారు. ఎందుకంటే, క్రూరుల శ్వాస గోడకు తాకే తుఫానులా,

  25. ఈ పర్వతం మీద సైన్యాల యెహోవా ప్రజలందరి కోసం క్రొవ్విన వాటిలో విందు సిద్ధం చేస్తారు ఈ విందులో పాత ద్రాక్షరసం ఉంటుంది లేత మాంసం, ఎంపిక చేసిన ద్రాక్షరసం ఉంటాయి.