Skip to content
1 దినవృత్తాంతములు 11:26-47

ముప్పది మంది అధిపతులు

1 దినవృత్తాంతములు 11:26-47
26
పరాక్రమముగల బలాఢ్యులు వీరే: యోవాబు తమ్ముడైన అశాహేలు, బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను,
27
హరోరీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
28
తెకోవాకు చెందిన ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతుకు చెందిన అబీయెజెరు,
29
హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,
30
నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెదు,
31
బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా,
32
గాయషు కనుమలకు చెందిన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
33
బహరూమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యహ్బా,
34
గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడైన యోనాతాను,
35
హరారీయుడైన శాకారు కుమారుడైన అహీయాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,
36
మెకేరాతీయుడైన హెఫెరు, పెలోనీయుడైన అహీయా,
37
కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,
38
నాతాను సోదరుడైన యోవేలు, హగ్రీ కుమారుడైన మిబ్హారు,
39
అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు,
40
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
41
హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,
42
రూబేనీయుడైన షీజా కుమారుడు రూబేనీయులకు పెద్దయైన అదీనా, అతనితో ఉన్న ముప్పైమంది,
43
మయకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు,
44
ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరోయేరీయుడైన హోతాము కుమారులైన షామా, యెహీయేలు,
45
షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, అతని సోదరుడు తిజీయుడైన యోహా,
46
మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,
47
ఎలీయేలు, ఓబేదు, మెజోబాయా వాడైన యయశీయేలు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options