- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
యెషయా43
Listen to this chapter
0:00
0:00
భయపడకుడి, నేను నిన్ను విమోచించితిని
1
అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు ఇలా చెప్తున్నారు: “భయపడకు నేను నిన్ను విడిపించాను. పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.
2
నీవు నీళ్లను దాటుతున్నప్పుడు నేను నీతో ఉంటాను; నీవు నదులను దాటుతున్నప్పుడు అవి నిన్ను ముంచవు. నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు నీవు కాలిపోవు. మంటలు నిన్ను కాల్చవు.
3
యెహోవానైన నేను నీకు దేవుడను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నీ రక్షకుడిని. నీ క్రయధనంగా ఈజిప్టును ఇచ్చాను, నీకు బదులుగా కూషు సెబాలను ఇచ్చాను.
4
నీవు నా దృష్టిలో విలువైనవాడవు, ఘనుడవు కాబట్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు బదులుగా మనుష్యులను అప్పగిస్తాను నీ ప్రాణానికి బదులుగా దేశాలను అప్పగిస్తాను.
5
భయపడకు, నేను నీతో ఉన్నాను; తూర్పు నుండి నీ సంతానాన్ని తీసుకువస్తాను, పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.
6
‘వారిని అప్పగించు’ అని ఉత్తరదిక్కుకు, ‘వారిని ఆపవద్దు’ అని దక్షిణ దిక్కుకు చెప్తాను. దూరం నుండి నా కుమారులను భూమి అంచుల నుండి నా కుమార్తెలను తీసుకురండి.
7
నా పేరుపెట్టబడిన వారందరిని, నా మహిమ కోసం నేను సృష్టించిన వారిని, నేను రూపించి కలుగజేసిన వారిని తీసుకురండి.”
దేవుని సాక్షులుగా ఇశ్రాయేలు
8
కళ్లుండి గ్రుడ్డివారైన వారిని, చెవులుండి చెవిటివారైన వారిని తీసుకురండి.
9
సర్వ దేశాలు గుమికూడాలి జనములు సమావేశమవ్వాలి. వారిలో ఎవరి దేవుళ్ళు ఇలాంటి సంగతులు మాకు తెలియజేశారు? గతంలో జరిగిన వాటిని ఎవరు మాకు చెప్పారు? తాము నిర్దోషులని నిరూపించడానికి తమ సాక్షులను తీసుకురావాలి, అప్పుడు ఇతరులు విని, “ఇది నిజమే” అని చెప్తారు.
10
“మీరు నా సాక్షులు” అని యెహోవా చెప్తున్నారు, “నేను ఏర్పరచుకున్న నా సేవకుడవు, తద్వారా నీవు నన్ను తెలుసుకొని, నన్ను నమ్మి, నేనే ఆయననని నీవు గ్రహిస్తావు. నాకు ముందుగా ఏ దేవుడు లేడు. నా తర్వాత ఏ దేవుడు ఉండడు.
11
నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు.
12
బయలుపరిచింది రక్షించింది ప్రకటించింది నేనే మీ మధ్య ఉన్నది నేనే, ఏ ఇతర దేవుడో కాదు. నేనే దేవుడను మీరు నా సాక్షులు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
13
“అవును, పూర్వ రోజులనుండి ఉన్నవాడను నేనే. నా చేతిలో నుండి ఎవరు విడిపించలేరు. నేను చేసే పనిని తిప్పగలవారు ఎవరు?” అని యెహోవా చెప్తున్నారు.
యెహోవా చేసిన కొత్త విమోచన కార్యము
14
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ విమోచకుడైన యెహోవా చెప్పే మాట ఇదే: “మీ కోసం నేను బబులోనుకు సైన్యాన్ని పంపి బబులోనీయులందరూ వేటిని బట్టి గర్వించేవారో వారిని ఆ ఓడలలో పారిపోయేలా చేస్తాను.
15
యెహోవానైన నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇశ్రాయేలును సృజించిన నేనే మీకు రాజును.”
ఇదిగో, నేను క్రొత్త కార్యము చేయుచున్నాను
16
యెహోవా ఇలా అంటున్నారు: సముద్రంలో మార్గాన్ని ఏర్పరచినవాడు, గొప్ప జలాల్లో దారిని కలుగజేసినవాడు,
17
రథాలను గుర్రాలను, సైన్యాన్ని వీరులను రప్పించిన యెహోవా చెప్పే మాట ఇదే వారందరు కలిసి పడిపోయారు మరలా ఎప్పటికీ లేవరు, ఆరిపోయిన వత్తిలా వారు నిర్మూలించబడతారు:
18
“పూర్వ విషయాల్ని మరచిపోండి; గత సంగతులను ఆలోచించకండి.
19
చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను! ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా? నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను.
20
నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగడానికి అరణ్యంలో నీళ్లు ఇస్తున్నాను ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను కాబట్టి అడవి జంతువులు, నక్కలు నిప్పుకోళ్లు నన్ను ఘనపరుస్తాయి.
21
వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, వారు నా సుత్తిని ప్రకటిస్తారు.
ఇశ్రాయేలు పాపము మరియు దేవుని ఏకపక్ష కృప
22
“అయినా యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఇశ్రాయేలూ, నా గురించి నీవు విసిగిపోయావు.
23
దహనబలులకు గొర్రెలను నా దగ్గరకు తీసుకురాలేదు, నీ బలులతో నన్ను ఘనపరచలేదు. భోజనార్పణల కోసం నేను నీ మీద భారం మోపలేదు ధూపం వేయమని నిన్ను విసిగించలేదు.
24
నీవు నా కోసం సువాసనగల లవంగపు చెక్కను డబ్బుతో కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వుతో నన్ను తృప్తిపరచలేదు. కాని నీ పాపాలతో నన్ను విసిగించావు నీ దోషాలతో నేను అలసిపోయేలా చేశావు.
25
“నేను నేనే నా ఇష్టానుసారంగా నీ పాపాలను తుడిచివేస్తున్నాను, నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను.
26
నాకు గతంలో జరిగింది గుర్తు చేయి మనం కలిసి వాదించుకుందాం; నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో.
27
నీ మూలపురుషుడు పాపం చేశాడు; నీకు బోధించమని నేను పంపినవారు నా మీద తిరుగుబాటు చేశారు.
28
కాబట్టి నేను నీ మందిరంలోని ప్రధానులను అవమానించాను; నేను యాకోబును నాశనానికి ఇశ్రాయేలును దూషణకు అప్పగించాను.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Reading Width chars
Options
Study Note