Skip to content

Zechariah గురించి బైబిల్ వచనాలు

36 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఏలాము వారసుల నుండి: మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.

  2. అప్పుడు ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా చెక్కతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవారు ఉన్నారు; ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవారు ఉన్నారు.

  3. యూదా, బెన్యామీను వారిలో మరికొంతమంది యెరూషలేములో నివసించారు): యూదా వారసుల నుండి: అతాయా, ఇతడు పెరెసు వారసుడైన మహలలేలు కుమారుడైన షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడైన జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడు;

  4. మయశేయా, ఇతడు షేలా వారసుడైన జెకర్యా కుమారుడైన యోయారీబుకు పుట్టిన అదాయా కుమారుడైన హజాయాకు పుట్టిన కొల్-హోజె కుమారుడైన బారూకు కుమారుడు.

  5. ఆలయ పని చేసే వీరి బంధువులు 822 మంది; అదాయా, ఇతడు మల్కీయా కుమారుడైన పషూరుకు పుట్టిన జెకర్యా కుమారుడైన అమ్జీకు పుట్టిన పెలల్యా కుమారుడైన యెరోహాము కుమారుడు.

  6. ఇద్దో కుటుంబానికి జెకర్యా; గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము;

  7. అలాగే బూరలు ఊదుతూ కొంతమంది యాజకులు వెళ్లారు. ఆసాపు కుమారుడైన జక్కూరుకు పుట్టిన మీకాయా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జెకర్యా,

  8. అలాగే యాజకులైన ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యాలు తమ బూరలు పట్టుకుని ఉన్నారు.

  9. నా కోసం నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి యాజకుడైన ఊరియాను, యేబెరెక్యా కుమారుడైన జెకర్యాను పిలిచాను.

  10. నీతిమంతుడు హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జెకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల నిరపరాధ రక్తదోషం అంతా మీ మీదికి వస్తుంది.

  11. అనగా, హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య చంపబడిన జెకర్యా రక్తం వరకు. అవును, నేను చెప్పేది నిజం, ఈ తరం వారే దానంతటికి బాధ్యులుగా ఎంచబడతారు.