కంటెంట్‌కు వెళ్లండి

Walls గురించి బైబిల్ వచనాలు: Destruction of, a punishment and cause of grief

8 వచనాలు · 48 కోణాలు

Destruction of, a punishment and cause of grief గురించి వచనాలు

  1. మీరు నమ్మే ఎత్తైన కోటగోడలు కూలిపోయే వరకు వారు మీ దేశంలోని అన్ని పట్టణాలను ముట్టడిస్తారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని అన్ని పట్టణాలను వారు ముట్టడిస్తారు.

  2. వారు నాతో, “చెరలో పడకుండ బయటపడ్డవారు మన దేశంలోనే ఉన్న ఎంతో శ్రమను అవమానాన్ని అనుభవిస్తున్నారు. యెరూషలేము గోడ కూలిపోయింది. దాని గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయి” అని చెప్పారు.

  3. రాత్రివేళ నేను నాతో ఉన్న కొంతమంది పురుషులతో కలిసి బయలుదేరాను. యెరూషలేము గురించి దేవుడు నా హృదయంలో ఉంచిన ఆలోచన ఎవరికి చెప్పలేదు. నేను ఎక్కిన జంతువు తప్ప నా దగ్గర మరో జంతువు లేదు.

  4. రాత్రివేళలో నేను లోయ ద్వారం గుండా ఘటసర్పం బావి వైపు పెంట ద్వారం దగ్గరకు వెళ్లి కూల్చబడిన యెరూషలేము గోడలు, అగ్నితో కాల్చబడిన దాని గుమ్మాలను పరిశీలించాను.

  5. అక్కడినుండి నీటి ఊట గుమ్మానికి రాజు కొలను దగ్గరకు వెళ్లాను కాని నేను ఎక్కిన జంతువు వెళ్లడానికి ఆ దారి చాలా ఇరుకుగా ఉంది.

  6. రాత్రివేళలో నేను లోయ గుండా వెళ్లి గోడను పరిశీలించి తిరిగి లోయ గుమ్మం గుండా వెనుకకు వచ్చాను.

  7. నేను ఎక్కడ వెళ్లానో ఏమి చేస్తున్నానో అధికారులకు తెలియదు. యూదులకు గాని యాజకులకు గాని సంస్థానాధిపతులకు గాని ఇతర అధికారులకు గాని నేను ఆ విషయం చెప్పలేదు.

  8. నేను వారితో, “మనకున్న సమస్యను మీరు చూశారు. యెరూషలేము పాడైపోయింది దాని గుమ్మాలు కాలిపోయాయి. రండి, ఇకపై ఈ నింద మనమీద ఉండకుండా యెరూషలేమును తిరిగి కడదాం” అన్నాను.