కంటెంట్‌కు వెళ్లండి

Vineyard గురించి బైబిల్ వచనాలు: Parables of

43 వచనాలు · 9 కోణాలు

"Vineyard" కోసం వెతకండి

Parables of గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా ప్రియుని గురించి పాడతాను. తన ద్రాక్షతోట గురించి పాట పాడతాను: సారవంతమైన కొండమీద నా ప్రియునికి ఒక ద్రాక్షతోట ఉండేది.

  2. ఆయన దానిని త్రవ్వి రాళ్లను ఏరి బాగుచేసి అందులో శ్రేష్ఠమైన ద్రాక్షతీగెలు నాటాడు. దానిలో కాపలా గోపురం కట్టాడు ద్రాక్షతొట్టిని తొలిపించాడు. మంచి ద్రాక్షపండ్లు కాయాలని ఆయన ఎదురుచూశాడు, కాని దానిలో చెడ్డ ద్రాక్షలు కాసాయి.

  3. “కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం చేయండి.

  4. నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే దానికి ఇంకేమి చేయాలి? మంచి ద్రాక్షపండ్ల కోసం నేను చూస్తే ఎందుకు అది చెడ్డ ద్రాక్షలను కాసింది?

  5. నా ద్రాక్షతోటకు నేనేమి చేయబోతున్నానో ఇప్పుడు మీకు చెప్తాను. దాని కంచె నేను తీసివేస్తాను అప్పుడు అది నాశనం అవుతుంది; దాని గోడను పడగొడతాను అప్పుడు అది త్రొక్కబడుతుంది.

  6. నేను దానిని బంజరు భూమిలా చేస్తాను, అది త్రవ్వరు, సాగు చేయరు, అక్కడ గచ్చపొదలు ముళ్ళచెట్లు పెరుగుతాయి. దానిపై వర్షం కురిపించవద్దని మేఘాలను ఆజ్ఞాపిస్తాను.”

  7. ఇశ్రాయేలు వంశం సైన్యాల యెహోవా ద్రాక్షతోట, యూదా ప్రజలు ఆయన ఆనందించే ద్రాక్షలు. ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.

  8. ఆ రోజున “ఫలభరితమైన ద్రాక్షతోట గురించి పాడండి:

  9. యెహోవానైన నేను దానిని కాపాడతాను; నేను దానికి క్రమంగా నీరు పెడతాను. ఎవరూ దానిని పాడు చేయకుండ రాత్రి పగలు కాపలా కాస్తాను.

  10. చాలామంది కాపరులు నా ద్రాక్షతోటను నాశనం చేశారు నా పొలాన్ని త్రొక్కివేశారు; వారు నాకు ఇష్టమైన పొలాన్ని నిర్జనమైన బంజరు భూమిలా మార్చారు.

  11. యేసు పరలోక రాజ్యం గురించి వివరిస్తూ, “పరలోక రాజ్యం, తన ద్రాక్షతోటలో కూలికి పని చేసేవారిని తీసుకురావాలని వేకువనే బయలుదేరిన ఒక యజమానిని పోలి ఉంది.

  12. అతడు రోజుకు ఒక దేనారం కూలి ఇస్తానని ఒప్పుకుని తన ద్రాక్షతోటలోనికి పనికి వారిని పంపించాడు.

  13. “ఉదయకాలం దాదాపు తొమ్మిది గంటలకు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్న మరి కొంతమందిని అతడు చూశాడు.

  14. వారితో, ‘మీరు కూడా వెళ్లి ద్రాక్షతోటలో పని చేయండి, మీకు ఏది న్యాయమో అది మీకు చెల్లిస్తాను’ అని వారితో చెప్పాడు.

  15. కాబట్టి వారు కూడా వెళ్లారు. “మళ్ళీ దాదాపు పన్నెండు గంటలకు, తిరిగి మూడు గంటలకు అతడు వెళ్లి అలాగే చేశాడు.

  16. దాదాపు అయిదు గంటలకు కూడా మరికొందరు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్నారని చూసి, ‘రోజంతా ఇక్కడ మీరు ఏ పనిలేక ఖాళీగా ఎందుకు నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు.

  17. “అందుకు వారు, ‘ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అని చెప్పారు. “కాబట్టి అతడు వారితో, ‘మీరు కూడా వెళ్లి, నా ద్రాక్షతోటలో పని చేయండి’ అని చెప్పాడు.

  18. “సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని తన గృహనిర్వాహకునితో, ‘పనివారిని పిలిచి వారికి చివరి నుండి మొదట వచ్చిన వారివరకు కూలి ఇవ్వమని’ చెప్పాడు.

  19. “దాదాపు అయిదు గంటలకు కూలికి వచ్చినవారు వచ్చి ఒక్కొక్కరు ఒక దేనారం కూలి తీసుకున్నారు.

  20. అది చూసి, మొదట కూలి పనికి వచ్చినవారు, మిగతా వారికంటే తమకు ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశించారు. కాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు.

  21. వారు కూలి తీసుకుని, ‘మేము ఉదయం నుండి ఎండలో కష్టపడి పని చేశాము అయినా చివరిలో వచ్చి ఒక్క గంట మాత్రమే పని చేసిన వారితో సమానంగా కూలి ఇచ్చారు’ అని యజమానుని మీద సణుగుకొన్నారు.

  22. Saying, These last have wrought but one hour, and thou hast made them equal unto us, which have borne the burden and heat of the day.

  23. “అందుకు ఆ యజమాని వారిలో ఒకనితో, ‘స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదు. నీవు నా దగ్గర ఒక దేనారం కొరకే పని చేస్తానని ఒప్పుకున్నావు కదా?

  24. నీవు నీ కూలిని తీసుకుని వెళ్లు. నేను నీకు ఇచ్చినట్టే చివర వచ్చిన వానికి ఇవ్వడం నా ఇష్టము.

  25. నా సొంత డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవడానికి నాకు అనుమతి లేదా? లేదా నేను ధారాళంగా ఇస్తున్నానని నీవు అసూయపడుతున్నావా?’ అని అడిగాడు.